AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gambhir vs Sreesanth: ఆ వీడియోలను వెంటనే డిలీట్‌ చేసేయ్‌.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు లీగల్‌ నోటీసులు

లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లో భాగంగా గొడవలకు టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్‌ల వ్యవహారం మరింత ముదురుతోంది. గంభీర్ నన్ను ఫిక్సర్ అని తిట్టాడంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన శ్రీశాంత్‌కి లీగల్ నోటీసు జారీ అయింది. అలాగే, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను తొలగించిన తర్వాతే ఈ కేసుపై చర్చిస్తామని లీగ్ ఆఫ్ లెజెండ్స్ నిర్వాహకులు తమ నోటీసులో పేర్కొన్నారు

Gambhir vs Sreesanth: ఆ వీడియోలను వెంటనే డిలీట్‌ చేసేయ్‌.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు లీగల్‌ నోటీసులు
Gambhir Vs Sreesanth
Basha Shek
|

Updated on: Dec 08, 2023 | 10:11 PM

Share

లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లో భాగంగా గొడవలకు టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్‌ల వ్యవహారం మరింత ముదురుతోంది. గంభీర్ నన్ను ఫిక్సర్ అని తిట్టాడంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన శ్రీశాంత్‌కి లీగల్ నోటీసు జారీ అయింది. అలాగే, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను తొలగించిన తర్వాతే ఈ కేసుపై చర్చిస్తామని లీగ్ ఆఫ్ లెజెండ్స్ నిర్వాహకులు తమ నోటీసులో పేర్కొన్నారు. నిజానికి ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా గంభీర్, శ్రీశాంత్ మధ్య స్వల్ప వాగ్వాదమే జరిగింది. ఆ తర్వాత స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ గంభీర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలలో పైన పేర్కొన్న విధంగా గంభీర్ నన్ను ఫిక్సర్ అని పిలిచి అవమానించాడంటూ, అంపైర్ సమక్షంలో కూడా గంభీర్ నన్ను అదే విధంగా దుర్భాషలాడాడంటూ కొన్ని వీడియోలను పంచుకున్నాడు. ఈ కేసు తీవ్రతను గ్రహించిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. దీంతో పాటు సోషల్ నెట్‌వర్క్‌లలో గంభీర్‌కు వ్యతిరేకంగా చేసిన అన్ని వీడియోలను వెంటనే తొలగించాలని ఆదేశించామని, ఆ తర్వాతే చర్చిస్తామని నిర్వాహకులు తెలిపారు.

శ్రీశాంత్ సోషల్ మీడియాలో లీక్ చేసిన వీడియోల ప్రకారం, గంభీర్ నన్ను అంపైర్ ముందు ఫిక్సర్ అని పిలిచి అవమానించాడని పేర్కొన్నాడు. కానీ మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధంపై అంపైర్లు, నిర్వాహకులకు ఇచ్చిన నివేదికలో గంభీర్ ఫిక్సర్ అనే పదాన్ని ఉపయోగించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు గంభీర్, శ్రీశాంత్ స్పందన కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ వివాదంపై గంభీర్ ఇప్పటివరకు స్పందించ‌లేదు. అయితే త‌న సోష‌ల్ మీడియాలో మాత్రం టీమ్ఇండియా జెర్సీ ధ‌రించి న‌వ్వుతున్న అత‌ని పాత ఫోటోను మాత్రం పోస్ట్ చేశాడు. ప్ర‌పంచం మొత్తం నీ వైపు చూస్తున్నప్పుడు నువ్వు న‌వ్వుతూ ఉండాల‌ని ఆ ఫొటో కింద రాసుకొచ్చాడు. దీనిపై ఇర్ఫాన్ ప‌ఠాన్ కూడా స్పందించాడు. అన్నింటికి నవ్వుతూ ఉండ‌డ‌మే మంచి స‌మాధానం అంటూ కామెంట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

గంభీర్ పోస్ట్ చూశారా?

గంభీర్, శ్రీశాంత్ ల గొడవ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..