AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Points Table: వైజాగ్‌లో ఇంగ్లండ్‌ను మడతెట్టేసిన టీమిండియా.. WTC పాయింట్ల టేబుల్‌లో మన ప్లేస్ ఎక్కడంటే?

విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టును 106 పరుగుల తేడాతో ఓడించింది భారత్. తద్వారా హైదరాబాద్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దీనితో పాటు ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్‌ సేన స్థానం బాగా మెరుగైంది.

WTC Points Table: వైజాగ్‌లో ఇంగ్లండ్‌ను మడతెట్టేసిన టీమిండియా.. WTC పాయింట్ల టేబుల్‌లో మన ప్లేస్ ఎక్కడంటే?
Indian Cricket Team
Basha Shek
|

Updated on: Feb 05, 2024 | 4:05 PM

Share

విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టును 106 పరుగుల తేడాతో ఓడించింది భారత్. తద్వారా హైదరాబాద్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దీనితో పాటు ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్‌ సేన స్థానం బాగా మెరుగైంది. ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభానికి ముందు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్.. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఓటమితో భారీగా నష్టపోయింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన రెండు నుంచి ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు విశాఖపట్నం టెస్టు మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా.. మరోసారి ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​ఎడిషన్ పాయింట్ల పట్టికలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన భారత్ 3 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొత్తం 38 పాయింట్లు సాధించిన భారత్ ఇప్పుడు 52.77 విజయ శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎప్పటిలాగే మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టు 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 3 ఓటములతో 66 పాయింట్లతో ఉంది.

మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆడిన 2 మ్యాచ్‌ల్లో 1 విజయం, 1 ఓటమితో 12 పాయింట్లు సాధించింది. ఆఫ్రికన్ జట్టుతో సమానంగా మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు వరుసగా 6, 7 స్థానాల్లో ఉండగా, ఇప్పుడు భారత్‌ చేతిలో ఓడిన ఇంగ్లండ్ జట్టు ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం. ఇంగ్లిష్‌ జట్టు ఇప్పటి వరకు 7 టెస్టు మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు, 3 ఓటములతో 21 పాయింట్లు సాధించింది.

ఇవి కూడా చదవండి

వైజాగ్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌ రౌండ్‌ షో.

వైజాగ్‌ మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌటైంది. దీంతో 106 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. భారత్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ బౌలర్ ఆర్ అశ్విన్ చెరో 3 వికెట్లు తీశారు. దీంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 253 పరుగులకు కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 9 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.

బూమ్ బూమ్ బుమ్రా..

సమష్ఠిగా రాణించిన భారత బౌలర్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే