Virushka: రెండో బిడ్డకు తండ్రి కాబోతున్న విరాట్‌ అనుష్క.! డివిలియర్స్ క్లారిటీ.

Virushka: రెండో బిడ్డకు తండ్రి కాబోతున్న విరాట్‌ అనుష్క.! డివిలియర్స్ క్లారిటీ.

Anil kumar poka

|

Updated on: Feb 05, 2024 | 6:15 PM

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు. కోహ్లీ అర్ధాంగి అనుష్క రెండో బిడ్డకు జన్మనిస్తుండడం వల్లే కోహ్లీ విరామం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమేనని తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యలతో స్పష్టమైంది. కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడని డివిలియర్స్ యూట్యూబ్ లైవ్ లో వెల్లడించాడు. కొన్నిరోజుల కిందటే తాను కోహ్లీతో చాటింగ్ చేశానని, కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న విషయం వాస్తవమే అని తెలిపాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు. కోహ్లీ అర్ధాంగి అనుష్క రెండో బిడ్డకు జన్మనిస్తుండడం వల్లే కోహ్లీ విరామం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమేనని తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యలతో స్పష్టమైంది. కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడని డివిలియర్స్ యూట్యూబ్ లైవ్ లో వెల్లడించాడు. కొన్నిరోజుల కిందటే తాను కోహ్లీతో చాటింగ్ చేశానని, కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న విషయం వాస్తవమే అని తెలిపాడు. జట్టు కంటే కుటుంబానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని ఎవరైనా కోహ్లీని తప్పుబడితే అది సరికాదని అన్నాడు. ఇలాంటి సమయంలో కోహ్లీ తన కుటుంబంతో ఉండడమే సరైన నిర్ణయం అని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో ఓ కుమార్తె జన్మించింది. ఆ పాపకు వామిక అని నామకరణం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..