GT vs KKR: కోల్‌కతా సంచలన విజయం.. చివరి ఓవర్‌లో 31 పరుగులతో..
కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన విజయాన్ని నమోదు చేసంది. గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. ఆరు బంతుల్లో 31 పరుగులు కావాల్సిన సమయంలో చివరి ఓవర్‌లో రింకుసాంగ్ చెలరేగాడు. ఏకంగా 5 సిక్స్‌లతో జట్టుకు విజయాన్ని అందించాడు...
కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన విజయాన్ని నమోదు చేసంది. గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. ఆరు బంతుల్లో 31 పరుగులు కావాల్సిన సమయంలో చివరి ఓవర్‌లో రింకుసాంగ్ చెలరేగాడు. ఏకంగా 5 సిక్స్‌లతో జట్టుకు విజయాన్ని అందించాడు. వెంకటేష్ అయ్యర్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ తొలి నుంచి మంచి ప్రతిభను కనబర్చగా రింకూ సింగ్ చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లతో అనూహ్య విజయాన్ని అందించాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో తమ స్టార్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేకుండానే గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగుతోంది. రషీద్ ఖాన్ కమాండ్ తీసుకున్నాడు. హార్దిక్ అనారోగ్యంతో ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేయలేదు. గత ఏడాది కూడా రషీద్ ఖాన్ ఒక మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా, ఆ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. అయితే ఈ సారి ఫలితం దీనికి భిన్నంగా వచ్చింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి దర్శన్, విజయ్ శంకర్‌లు మాత్రమే రాణించారు. సాయి సుదర్శన్ పోరాట ఇన్నింగ్స్ ఆడి వరుసగా రెండో మ్యాచ్‌లో అర్థ సెంచరీ సాధించాడు.
ఇక 14వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన శంకర్.. ఆ తర్వాత ఆఖరి రెండు ఓవర్లలో దూకుడుగా ఆడాడు. 19వ ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు బాదిన విజయ్ శంకర్ ఆ తర్వాత 20వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ వరుసగా 3 సిక్సర్లు బాదాడు. శంకర్ కేవలం 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి జట్టు స్కోరును 204 పరుగులకు చేర్చాడు. అయితే అయితే రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్స్‌తో కోల్‌కతా ఖాతాలో విజయం నమోదైంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..