6,6,6,6,6 Watch: ఒకటి కాదు రెండు కాదు ఐదు సిక్సులు.. చిచ్చర పిడుగులా రెచ్చిపోయిన కేకేఆర్ హీరో.. వీడియో మీరే చూడండి..

ఒకటి,రెండు,మూడు, నాలుగు.. కాదు ఐదు సిక్సులతో మోత మోగింది. చివరి ఓవర్లో ఏకంగా ఐదు వరుస సిక్సర్లు బాది హిస్టారికల్‌ విక్టరీ అందించాడు రింకూసింగ్‌. ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. గుజరాత్‌ విజయం ముంగిట నీళ్లు చల్లాడు. ఏదో జరుగుతుందనుకుంటే మరేదో జరిగిపోయింది.

6,6,6,6,6 Watch: ఒకటి కాదు రెండు కాదు ఐదు సిక్సులు.. చిచ్చర పిడుగులా రెచ్చిపోయిన కేకేఆర్ హీరో.. వీడియో మీరే చూడండి..
Rinku Singh
Follow us
Sanjay Kasula

| Edited By: seoteam.veegam

Updated on: Apr 10, 2023 | 2:02 PM

చివరి ఓవర్లో చివరి బంతికి సిక్సర్‌ కొట్టి గెలిపించేవాళ్లున్నారు. రేర్‌ కేసుల్లో రెండు సిక్సులు కొట్టినోళ్లని చూశాం. కాని ఇది రేరెస్ట్‌ ఆఫ్‌ ది రేర్‌. చివరి ఓవర్లో ఏకంగా ఐదు వరుస సిక్సర్లు బాది హిస్టారికల్‌ విక్టరీ అందించాడు రింకూసింగ్‌. ఇవాళ గుజరాత్‌తో జరిగిన మ్యాచ్లో కోల్‌కతా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఐపీఎల్ సంచలనాలను బ్రేక్ చేశాడు. రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ తర్వాత మ్యాచ్‌ ముగిసిందని అంతా అనుకున్నారు. ఆరు బంతుల్లో 29 పరుగులు సాధించాల్సిన టైమ్‌లో ఉమేష్‌ యాదవ్‌ ఫస్ట్‌ బాల్‌కి సింగిల్‌ తీసి రింకూసింగ్‌కి ఇచ్చాడు. అయినా అయిపోయిన మ్యాచ్‌కి చివరి తంతు జరుగుతుంది అని అంతా అనుకున్నారు. కాని మ్యాచ్‌ అక్కడే మొదలైంది. బౌలర్‌ యష్‌ దయాల్‌కి మోత అక్కడే మొదలైంది. రెండో బంతిని డీప్‌ కవర్‌ దిశగా సిక్స్‌ బాదాడు రింకూ. మూడో బంతి కూడా అదే జోష్‌లో కొట్టాడు అదీ బౌండరీ అవతల పడింది. నాలుగో బాల్‌కి గుజరాత్‌ సంకోచించింది.

కాని ఒక్క బంతినైనా డాట్‌ చేసే మ్యాచ్‌ మనదే అనుకున్నారు. కాని.. ఫుల్‌ టాస్‌ బంతిని డీప్‌ కవర్‌ పాయింట్‌ మీదుగా సిక్సర్‌ కొట్టాడు రింకూ.. కోల్‌కతా క్యాంప్‌లో ఆనందం మొదలైంది. ఇంకా రెండు బాల్సే. కొట్టాల్సింది పది పరుగులే. గుజరాత్‌ టీమ్‌ డైలమాలో పడింది. ఈసారి యష్‌ స్లోబంతిని సంధించినా.. రింకూ బలంగా బాది లాంగాన్‌ దిశగా సిక్సర్‌గా బాది మ్యాచ్‌ మొత్తాన్ని కోల్‌కతా వైపుకు తిప్పాడు. చివరిబాల్‌ కూడా రింకూ సిక్సర్‌ బాది… కోల్‌కతాకి చారిత్రక విజయాన్ని అందించాడు.

కోల్‌కతా క్యాంపులో ఆనందం అనేది చిన్న పదం.. అంతకు మించిన సంబరాలు జరిగాయి. రింకూ హీరోయిక్‌ ఇన్నింగ్స్‌ అభిమానులను కేరింతలు కొట్టేలా చేసింది. నభూతో నభవిష్యత్‌. టార్గెట్‌ చేసింగ్‌లో చివరి ఓవర్‌ చివరి ఐదు బాల్స్‌ని సిక్సర్లుగా మలిచి మ్యాచ్‌ను గెలిపించడం ఇంత ముందు జరగలేదు.. ఇకపై జరుగుతుందో లేదో తెలియదు.

మరిన్ని ఐపీఎల్ న్యూస్ కోసం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!