Video: స్మిత్ ఛీటింగ్.. కోహ్లీ ఫైరింగ్.. అడ్డదారిలో డీఆర్‌ఎస్.. సీన్ కట్‌చేస్తే.. అదిరిపోయే ట్విస్ట్..
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియా 2017లో భారత్‌లో పర్యటించింది. ఈ టూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. రెండు దేశాల మధ్య జరిగే ఈ సిరీస్ ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. గతంలో 2017లో ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించింది. ఈ పర్యటనలోని రెండవ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డీఆర్‌ఎస్ కోసం స్మిత్ అడ్డదారులు తొక్కాడు. ఈ విషయాన్ని కోహ్లీ గమనించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
2017లో బెంగుళూరులో టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఉమేష్ యాదవ్ ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ డీఆర్‌ఎస్ తీసుకోవాలా వద్దా అంటూ అడగడం ప్రారంభించాడు. దీంతో స్మిత్‌పై కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలో ఫీల్డ్ అంపైర్ కూడా స్మిత్ ఔట్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత కోహ్లీ రియాక్షన్ ఇప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది
అడ్డదారులు వద్దు: విరాట్ కోహ్లీ
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ‘నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు అలా రెండు సార్లు డ్రెస్సింగ్ రూంపైపు చూశారు. నేను అంపైర్‌కి చెప్పాను. గత మూడు రోజులుగా ఇలాగే చేస్తున్నారని, ఇది ఆపాలని మ్యాచ్ రిఫరీకి కూడా చెప్పాం. అంపైర్ ఆ విషయంపై ఫోకస్ చేశాడు. స్మిత్ వెనుదిరగడంతో ఏం జరుగుతుందో అంపైర్‌కి తెలిసింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
కోహ్లీ మాట్లాడుతూ, “క్రికెట్ మైదానంలో ఒక లైన్ కంటే ఎక్కువ కదలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యర్థులతో ఆడడం, స్లెడ్జింగ్ చేయడం వేరు. ఇది ఆ బ్రాకెట్‌లోకే వస్తుంది’’ అని అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..