ICC Rankings: టీ20ల్లో కోహ్లీ, రాహుల్ ర్యాంకులు పదిలం.. టాప్ టెన్ లో రోహిత్‌కు దక్కని చోటు!
ఐసీసీ బుధవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ 762 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచాడు. అలాగే టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ 743 పాయింట్లతో 6వ ర్యాంకు సాధించాడు.
ICC Rankings: ఐసీసీ బుధవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ 762 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచాడు. అలాగే టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ 743 పాయింట్లతో 6వ ర్యాంకు సాధించాడు. తొలి స్థానంలో ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ మలన్ పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. ఆరోన్ ఫించ్ 830 పాయింట్లతో రెండవ స్థానం, బాబర్ ఆజామ్ 828 పాయింట్లతో మూడవ స్థానం, డేవిడ్ కాన్వే 774 పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచారు. అయితే, తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్ లో భారత ఆటగాళ్లు కేవలం ఇద్దరే చోటు దక్కించకున్నారు. అలాగే వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ 2వ స్థానంలో నిలవగా, రోహిత్ శర్మ 3 వస్థానంలో కొనసాగుతున్నారు.
ఇక బౌలర్ల జాబితాను పరిశీలిస్తే.. టీమిండియా నుంచి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు 5వ ర్యాంకులో ఉన్న బుమ్రా… తాజా ర్యాకింగ్స్ లో ఒకస్థానం దిగజారి 6వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల లిస్టులో రవీంద్ర జడేజా తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. ఇంగ్లండ్, శ్రీలంక సిరీస్ ముగిసినం అనంతరం.. ఐసీసీ ర్యాంకుల జాబితాను విడుదల చేసింది.
? After entering the top 10 last week, @windiescricket opener Evin Lewis moves up a spot on the @MRFWorldwide ICC Men’s T20I Batting Rankings. pic.twitter.com/TugCjFugmb
— ICC (@ICC) July 7, 2021
⬆️ @ChrisWoakes climbs a spot in the @MRFWorldwide ICC Men’s ODI All-Rounder Rankings, moving to No.3 after the series against Sri Lanka.
Full rankings ➡️ https://t.co/tHR5rK3ru7 pic.twitter.com/hdZTokT6L4
— ICC (@ICC) July 7, 2021
Also Read:
ICC Player of the Month: ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో భారత మహిళా క్రికెటర్లు..!
IND vs ENG: టీమిండియా ఆటగాళ్లకు రెండవ డోస్ వ్యాక్సిన్.. కోవిషీల్డ్ వేసేందుకు బీసీసీఐ ఏర్పాట్లు!