ICC Player of the Month: ‘ప్లేయర్ ​ఆఫ్ ది మంత్’ రేసులో భారత మహిళా క్రికెటర్లు..!

Venkata Chari

Venkata Chari |

Updated on: Jul 07, 2021 | 8:56 PM

జూన్ నెల‌కు గాను 'ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్' నామినీలను ఐసీసీ ప్రకటించింది. ఉమెన్స్ క్రికెట్‌లో టీమిండియా యువ బ్యాటర్ షెఫాలీ వర్మతో పాటు ఆల్​రౌండర్​ స్నేహ్​ రాణా ఈ అవార్డులకు నామినేట్ అయ్యారు.

ICC Player of the Month: 'ప్లేయర్ ​ఆఫ్ ది మంత్' రేసులో భారత మహిళా క్రికెటర్లు..!
Shafali Verma And Sneh Rana

ICC Player of the Month: జూన్ నెల‌కు గాను ‘ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్’ నామినీలను ఐసీసీ ప్రకటించింది. ఉమెన్స్ క్రికెట్‌లో టీమిండియా యువ బ్యాటర్ షెఫాలీ వర్మతో పాటు ఆల్​రౌండర్​ స్నేహ్​ రాణా ఈ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఇంగ్లండ్​తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్​లో ఈ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ ఉమెన్స్ టీం నుంచి బౌలర్​ సోఫీ ఎకిల్​స్టోన్​కూడా నామినేట్​అయింది. ఇక మెన్స్ క్రికెట్‌లో కివీస్ ప్లేయర్లు​డేవన్ కాన్వే, పేసర్​కైల్ జేమీసన్​తో పాటు దక్షిణాఫ్రికా సారథి ​క్వింటాన్ ​డికాక్​లను ఈ అవార్డులకు ఐసీసీ నామినేట్ చేసింది. షెఫాలీ వర్మ టీ20 ఫార్మాట్​లో ఆకట్టుకోవడంతో.. ఇంగ్లండ్​తో జరిగిన టెస్టులు, వన్డేల్లో అరంగేట్రం చేసింది. ఈ సిరీస్‌లోనూ ఆకట్టుకోవడంతోపాటు ఏకైక టెస్టులో ‘ప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్’​గా నిలిచింది. ఈ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్​ల్లోనూ హాఫ్​సెంచరీలతో ఆకట్టుకుంది. దాంతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్థ సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాటర్‌గా నిలిచింది. అలాగే మొత్తంగా నాలుగవ మహిళా క్రికెటర్​గా రికార్డు క్రియోట్ చేసింది.

ఇక, ఆల్​రౌండర్ స్నేహ్​రాణా ఇంగ్లండ్​తో జరిగిన ఏకైక టెస్టును డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించింది. 154 బంతుల్లో 80 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. చివరకు ఇంగ్లండ్ టీంకు విజయాన్ని దూరం చేసింది. బౌలింగ్‌లోనూ రాణించి నాలుగు వికెట్లు పడగొట్టింది. అవార్డుకు నామినేట్ అయిన ఇంగ్లండ్​బౌలర్​సోఫీ ఎకిల్​స్టోన్​8 వికెట్లు పడగొట్టింది.

మూడు ఫార్మాట్లలో ఈ అవార్డులకు ప్లేయర్లను నామినేట్ చేసింది. ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఐసీసీ అవార్డులకు నామినేట్ చేసింది. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు ఆటగాళ్లు చూపిన ప్రతిభ, పనితీరును ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తుంది. అనంతరం ఓటింగ్‌కు ఉంచుతుంది. దీనిలో స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ చేస్తారు. ఈ ఓటింగ్‌తో విజేతలను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు బ్రాడ్ కాస్టర్స్, సీనియర్ జర్నలిస్ట్‌లు, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌ సభ్యులు ఉంటారు.

Also Read:

IND vs ENG: టీమిండియా ఆటగాళ్లకు రెండవ డోస్ వ్యాక్సిన్.. కోవిషీల్డ్ వేసేందుకు బీసీసీఐ ఏర్పాట్లు!

MS Dhoni: ధోనీ బర్త్‌డేను హిట్‌మ్యాన్ మర్చిపోయాడా..? కావాలనే విష్ చేయలేదా? కారణం ఏంటంటూ నెట్టింట్లో అభిమానుల సందడి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu