MS Dhoni: ధోనీ బర్త్‌డేను హిట్‌మ్యాన్ మర్చిపోయాడా..? కావాలనే విష్ చేయలేదా? కారణం ఏంటంటూ నెట్టింట్లో అభిమానుల సందడి

Venkata Chari

Venkata Chari |

Updated on: Jul 07, 2021 | 7:48 PM

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేడు 40వ సంవత్సరంలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా బీసీసీఐతోపాటు, ఐసీసీ, ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలతోపాటు అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ తెలియజేశారు.

MS Dhoni: ధోనీ బర్త్‌డేను హిట్‌మ్యాన్ మర్చిపోయాడా..? కావాలనే విష్ చేయలేదా? కారణం ఏంటంటూ నెట్టింట్లో అభిమానుల సందడి
Dhoni And Rohit

Rohit Sharma: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేడు 40వ సంవత్సరంలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా బీసీసీఐతోపాటు, ఐసీసీ, ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలతోపాటు అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ తెలియజేశారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ధోనీ ట్రెండింగ్ అవుతూనే ఉన్నాడు. జులై 4 న వివాహ వార్షికోత్సవం చేసుకున్న నాటినుంచి మిస్టర్ కూల్ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తోపాటు సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్ ఇలా అందరూ బర్త్‌డే విషెస్ తెలిపారు. అయితే, ఒక్కరు మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. మాజీ కెప్టెన్ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయకపోవడం ఏంటా అని క్రికెట్ వర్గాలతోపాటు అభిమానులకు షాక్‌కు గురవుతున్నారు. హిట్ మ్యాన్ సైలెంట్‌గా ఉండటంతో పలు సందేహాలకు తావిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తు్న్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ప్రారంభానికి చాలా సమయం ఉండడంతో.. బీసీసీఐ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది. దాంతో ఆటగాళ్లంతా లండన్ వీధుల్లో ఫ్యామిలీతో పాటు తిరుగుతున్నారు. విహారంలో ఉన్న రోహిత్.. ధోనీ పుట్టిన రోజు విషయం మరిచిపోయి ఉండొచ్చని అంటున్నారు. ఇక రోహిత్ ఫ్యాన్స్ మాత్రం ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు సచిన్ సైతం జార్ఖండ్ డైనమేట్‌కు లేట్‌గా పుట్టిన రోజు విషెస్ తెలియజేశాడు.

2004లో బంగ్లాదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌ తో ధోనీ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ధోనీ కెరీర్ లో కీలకమైన ఇన్నింగ్స్ మాత్రం 2005లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ అనే చెప్పుకోవాలి. వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 148 పరుగులతో అభిమానుల కంట్లో పడ్డాడు. అదే ఏడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 183 పరుగులు బాదాడు. అయితే, టీమిండియా తరపున వికెట్‌ కీపర్‌గా అత్యుత్తమ పరుగులు చేసిన ప్లేయర్ గా పేరుగాంచాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన జాబితాలో ధోనీ 5వ స్థానం పొందాడు.కెప్టెన్‌గా 2007 టీ20 వ‌రల్డ్‌క‌ప్‌తో పాటు, 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2013 ఛాంపియ‌న్స్ ట్రోఫీలను భారతదేశానికి అందించాడు. మూడు మేజర్‌ ట్రోఫీలు అందుకున్న తొలి కెప్టెన్‌గా రికార్డు క్రియోట్ చేశాడు. ఇక, అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్‌ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183‌. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల బాదాడు.

Also Read:

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌కు భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ గైర్హాజరు..!

Happy Birthday Dhoni : మహేంద్రుడి భారీ సిక్సులు చూశారా..? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu