IND vs ENG: టీమిండియా ఆటగాళ్లకు రెండవ డోస్ వ్యాక్సిన్.. కోవిషీల్డ్ వేసేందుకు బీసీసీఐ ఏర్పాట్లు!

విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆగస్టులో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్ లో ఆతిథ్య జట్టుతో తలపడనున్నారు.

IND vs ENG: టీమిండియా ఆటగాళ్లకు రెండవ డోస్ వ్యాక్సిన్.. కోవిషీల్డ్ వేసేందుకు బీసీసీఐ ఏర్పాట్లు!
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Jul 07, 2021 | 7:56 PM

IND vs ENG: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆగస్టులో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్ లో ఆతిథ్య జట్టుతో తలపడనున్నారు. కాగా, న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో అరంగేట్ర డబ్ల్యూటీసీ ట్రోఫీని మిస్ చేసుకున్నారు. అయితే, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు కరోనా వ్యాక్సిన్ ను అందిచనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. టెస్టు సిరీస్ ప్రారంభం కావడానికి చాలా సమయం ఉండడంతో.. ఆటగాళ్లకు విరామం ప్రకటించింది బీసీసీఐ. దాంతో వీరంతా ఇంగ్లండ్ వీధుల్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈమేరకు బయట తిరుగుతున్న ఆటగాళ్లకు కరోనా వచ్చే ప్రమాదం ఉండడంతో.. వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు. రెండవ డోస్‌ను ఇంగ్లండ్‌లో వేసేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. జట్టులోని అందరి ఆటగాళ్లతోపాటు సహాయ సిబ్బందికి రెండవ డోస్ వేయనున్నారు. జులై 7, 9వ తేదీల్లో రెండవ డోస్ వేయనున్నట్లు తెలుస్తోంది.

మే 4 న ఐపీఎల్ 2021 వాయిదా వేసిన అనంతరం ఆటగాళ్లకు బీసీసీఐ మొదటి విడత వ్యాక్సిన్ అందించింది. ఆ తరువాత ఇంగ్లండ్ బయలుదేరే ముందు ముంబైలో క్వారంటైన్ లో ఉన్నారు. అయితే, మొదటి విడతలో కోవిషీల్డ్ టీకా వేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు ఇంగ్లండ్ లోనూ అదే డోస్ అందించేలా బీసీసీఐ ఏర్పాట్లు చేసిందంట. ‘చాలామంది ఆటగాళ్లు ప్రస్తుతం విరామంలో ఉన్నారు. లండన్‌తో పాటు పరిసర ప్రాంతాలను సంచరిస్తున్నారు. కోవిషీల్డ్ రెండవ డోస్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం’ అని బీసీసీఐ అధికారులు పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది. కాగా, ఇంగ్లండ్ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో మరోసారి బ్రిటన్‌లో కలకలం రేగుతోంది. ఈ మేరకు ఆటగాళ్లను ఐసోలేషన్‌లో ఉంచిన ఈసీబీ.. 18 మందితో కూడిన జట్టును పాకిస్తాన్ సిరీస్‌కు ప్రకటించింది. అయితే, భారత ఆటగాళ్ల విరామంలో ఇప్పటికైతే ఎలాంటి మార్పులేదని బీసీసీఐ ప్రకటించింది. బ్రిటన్‌లో పిరిస్థితులపై ఈసీబీ తగిన సమాచారం అందించింది. ఎప్పటికప్పుడు మాకు ఆవివరాలు తెలియజేస్తోందని బీసీసీఐ అధికారులు తెలియజేశారు. జులై 14 న తిరిగి ఆటగాళ్లు లండన్‌లో కలవనున్నారు. ఆ తరువాత సెలెక్ట్ కౌంటీ XI తో ప్రాక్టీస్ మ్యాచ్ కోసం డర్హమ్‌కు వెళ్లనున్నారు. అనంతరం నాటింగ్‌హామ్‌లో ఆగస్టు 4 నుంచి ప్రారంభకానున్న తొలి టెస్టుతో ఇంగ్లండ్ టూర్ మొదలుకానుంది.

Also Read:

MS Dhoni: ధోనీ బర్త్‌డేను హిట్‌మ్యాన్ మర్చిపోయాడా..? కావాలనే విష్ చేయలేదా? కారణం ఏంటంటూ నెట్టింట్లో అభిమానుల సందడి

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌కు భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ గైర్హాజరు..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే