IPL 2024: అప్పుడు ధోని.. ఇప్పుడు కేఎల్ రాహుల్.. టీమిండియా క్రికెటర్లను దారుణంగా అవమానించిన సంజీవ్ గోయెంకా

IPL 2024 టోర్నమెంట్‌ ప్లేఆఫ్ పోరు రసవత్తరంగా మారింది. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు 16 పాయింట్లతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. మరో మిగిలిన రెండు స్థానాల కోసం ఇప్పుడు విపరీతమైన పోటీ కనిపిస్తోంది. ముంబయి ఇండియన్స్‌ మినహా ప్రతి జట్టుకు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉంది

IPL 2024: అప్పుడు ధోని.. ఇప్పుడు కేఎల్ రాహుల్.. టీమిండియా క్రికెటర్లను దారుణంగా అవమానించిన సంజీవ్ గోయెంకా
KL Rahul, Dhoni
Follow us

|

Updated on: May 09, 2024 | 5:05 PM

IPL 2024 టోర్నమెంట్‌ ప్లేఆఫ్ పోరు రసవత్తరంగా మారింది. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు 16 పాయింట్లతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. మరో మిగిలిన రెండు స్థానాల కోసం ఇప్పుడు విపరీతమైన పోటీ కనిపిస్తోంది. ముంబయి ఇండియన్స్‌ మినహా ప్రతి జట్టుకు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉంది. ఐపీఎల్ టోర్నీమెంట్ ఆఖరి దశకు చేరుకునే కొద్ది కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన టీమ్ ఓనర్లు తెగ టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా జట్ల పేలవ ప్రదర్శనపై ఓనర్ల ఆగ్రహం మైదానంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యజమాని పార్త్ జిందాల్ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా పబ్లిక్ గానే కేఎల్ రాహుల్ ను తిట్టడం క్రికెట్ అభిమానులను షాక్ కు గురిచేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఫ్రాంఛైజీ ఓనర్లు క్రికెట్ ను కూడా కార్పొరేట కంపెనీల్లా మారుస్తున్నారంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై జట్టు యజమాని సంజీవ్ గోయెంకా విరుచుకుపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌తో కోపంగా మాట్లాడుతున్నట్లు ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం ఓనర్ కు సర్ది జెబుతున్నా సంజీవ్ మాత్రం అవేవీ పట్టనట్లు వ్యవహరించాడు. దీనిపై క్రికెట్ నిపుణులు, అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఫ్రాంఛైజీ యజమానులు జట్టు గురించి తమ ఆలోచనలు, భావాలను నాలుగు గదుల మధ్య పంచుకోవాలి. ఇలా బహిరంగంగా మాట్లాడితే జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది’ అని టీమిండియా క్రికెటర్ తమ అభిప్రాయాన్ని వెల్లడించాడు. మరి ఈ చర్చలన్నింటిపై కేఎల్ రాహుల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

కెప్టెన్ పదవికి ..

కేఎల్ రాహుల్ 2022 నుంచి లక్నోకు నాయకత్వం వహిస్తున్నాడు. సంజీవ్ గోయెంకా 2022లో రూ.7090 కోట్లకు ఫ్రాంచైజీ హక్కులను సొంతం చేసుకున్నారు. గత రెండు సీజన్లలో ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కానీ టైటిల్ గెలవలేకపోయింది. కానీ ఈ సంవత్సరం ప్లేఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి . మరోవైపు మెగా వేలం 2025లో జరగనుంది. అయితే అంతకంటే ముందే కేఎల్ రాహుల్ జట్లును విడతాడని తెలుస్తోంది.

అప్పుడు ధోనిని కూడా..

మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒకానొక సందర్భంలో ఇలాంటి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2017లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ జట్టుతోనూ ఇలాంటిదే జరిగింది. ఈ జట్టు సంజీవ్ గోయెంకా యాజమాన్యంలో ఉంది. అయితే పరాజయాలకు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని బాధ్యుడిని చేసిన గోయెంకా అతనిని పక్కనబెట్టి ఆస్ట్రేలియా స్టీవ్‌ స్మిత్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయంతో సంజీవ్ గోయెంకాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2016లో మహేంద్ర సింగ్‌ ధోనీ నేతృత్వంలో పుణె సూపర్‌జెయింట్స్‌ జట్టు 14 మ్యాచ్‌లలో ఐదు మాత్రమే గెలిచింది. అలాగే పాయింట్ల పట్టికలో పుణె జట్టు ఎనిమిది జట్లలో ఏడో స్థానంలో నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో 284 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో 2017లో అకస్మాత్తుగా పుణె కెప్టెన్ నుంచి ధోనీని తొలగించారు. అలాగే జట్టు పేరును రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌గా మార్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..