Rs.4 Biryani: రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
అసలే చలికాలం.. అందులో ఘుమఘుమలాడే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీని చూస్తే నోరూరుతుంది కదా..! అది కూడా కేవలం నాలుగు రూపాయలకే మంచి చికెన్ దమ్ బిర్యాని ఇస్తే..! ఇక చెప్పేదేముంది.. అందుకే అందరూ ఆ రెస్టారెంట్ వైపు పరుగు తీశారు. ఏకంగా ఫ్యామిలీలకు ఫ్యామిలీలే క్యూ కట్టాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా నాలుగు రూపాయల బిర్యానీ కోసం పోటీ పడడంతో ఆ క్యూ లైన్ కాస్త కిలోమీటర్లకు చేరింది.
ఇక్కడ కిలోమీటర్ల మేర క్యూలో నిలబడింది కేవలం చికెన్ బిర్యానీ కోసమే. ఏంటీ బిర్యానీ కోసం ఇంతలా క్యూ కట్టాలా? అదేమైనా ఫ్రీగా వస్తోందా అనుకుంటున్నారా… ఫ్రీగా కాకపోయినా మీరు ఊహించనంత తక్కువ ధరకు రుచికరమైన చికెన్ బిర్యానీ అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓ హోటల్ ప్రారంభోత్సవం జరిగింది. నిర్వాహకులు నాలుగు రూపాయలకే చికెన్ బిర్యానీ ప్యాకెట్ ఆఫర్ ప్రకటించారు. దీంతో జనం భారీగా తరలివచ్చారు. బిర్యానీ ప్యాకెట్ కోసం ఫ్యామిలీ ప్యాక్ సిద్ధమైపోయింది. దీంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ మాత్రమే అని కండిషన్ పెట్టారు. రోడ్డుపై రద్దీ పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?

