కాంబ్లీకి రావాల్సింది రూ.70 వేలు పెన్షనా.. అసలు 30 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?

TV9 Telugu

15 December 2024

వినోద్ కాంబ్లీ తన వ్యక్తిగత జీవిత పోరాటాల కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. సచిన్‌ దోస్త్‌ పరిస్థితి విషమంగా మారింది.

కాంబ్లీ ఆరోగ్యం విషమించడంతో పాటు చికిత్సకు కూడా డబ్బులు లేకపోవడం విచారకరం. దీంతో మాజీలు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

వినోద్ కాంబ్లీకి బీసీసీఐ నుంచి నెలకు కేవలం రూ.30 వేలు పెన్షన్ మాత్రమే వస్తోంది. 2022కి ముందు ఇది 15 వేలు మాత్రమే వచ్చేంది.

కాంబ్లీ పింఛను రూ.70 వేలు రావాల్సి ఉంది. అది ఇప్పుడు రూ.30 వేలు మాత్రమే కావడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం 30 ఏళ్ల క్రితం నాటి ఘటనలే.

కాంబ్లీ బ్యాడ్ ఫేజ్ 1994లో మొదలైంది. అతని టెస్ట్ కెరీర్ 1995లో ముగిసింది. అతను తన చివరి 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు.

కాంబ్లీ తన చివరి 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. మూడుసార్లు జీరో పరుగుల వద్ద ఔటయ్యాడు.

కాంబ్లీ 1995లో టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో రాహుల్ ద్రవిడ్ వంటి ఆటగాడు వచ్చాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో కాంబ్లీ కెరీర్‌ ముగిసింది.

కాంబ్లీ కెరీర్ ఎక్కువ కాలం సాగలేదు కాబట్టి, ఫించన్ విషయంలోనూ తేడాలు వచ్చాయి. ఎక్కువ కాలం భారత జట్టు తరపున ఆడిన వారికి ఎక్కువగా పెన్షన్ వచ్చేది.