KL Rahul: అచ్చొచ్చిన పిచ్‌లో పేలవ ప్రదర్శన.. కేఎల్ రాహుల్ ఏం చేశాడో తెలుసా?
బెంగళూరు టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత కేఎల్ రాహుల్ పిచ్‌ను తాకినట్లు కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను పిచ్‌ను ఎమోషనల్‌గా టచ్ చేసి వీడియో ఒక్కటి నెటింట్లో చక్కర్లు కొడుతుంది.
2024లో న్యూజిలాండ్‌పై చిన్నస్వామి స్టేడియంలో భారత్ సొంతగడ్డపై ఎనిమిది వికెట్ల పరాజయం పాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో రాహుల్ ప్రదర్శన ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్‌ని నిరాశపరిచింది. ఎందుకంటే అతను కేవలం 46 పరుగుల వద్ద డకౌట్ అయిన ఐదుగురు భారతీయ బ్యాటర్లలో ఒకడు. ప్రత్యేకించి రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ సెంచరీకి ఆజ్యం పోసిన ఆతిథ్య జట్టు అద్భుతంగా కోలుకున్నా కేఎల్ రాహుల్ ఆడితే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉండేది. దీంతో సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్‌పై నెటింట్లో ట్రోల్స్ వస్తున్నాయి.
ఇదిలా ఉంటే బెంగళూరు టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత కేఎల్ రాహుల్ పిచ్‌ను తాకినట్లు కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను పిచ్‌ను ఎమోషనల్‌గా టచ్ చేసి వీడియో ఒక్కటి నెటింట్లో చక్కర్లు కొడుతుంది. కొందరు నెటిజన్లు కేఎల్ రాహుల్ నెక్ట్స్ మ్యాచ్‌లో ఛాన్స్ రావటం లేదని కేఎల్ రాహుల్ భావోద్వేగం గురైయ్యాడని కామెంట్లు చేస్తున్నారు.
వీడియో ఇదిగో:
In all probabilities KL Rahul played his last test match today. Go well in ODIs n T20Is 👍🏻 Thank you KL Rahul !!#INDvsNZ #KLRahul pic.twitter.com/Jzmoz7vbMW
— Jay Shah (@Jay_sha_h) October 20, 2024
న్యూజిలాండ్‌తో జరిగే రెండు, మూడు టెస్ట్ మ్యాచ్‌లకు టీమిండియా జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ , మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.