IND vs AUS: పెర్త్ టెస్ట్‌కు ముందే షాకింగ్ న్యూస్.. వార్మప్ మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా స్టార్ ప్లేయర్
IND vs AUS 1st Test: నవంబర్ 22 నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ క్రమంలో ఇప్పటికే రంగంలోకి దిగిన భారత జట్టుకు బిగ్ షాకింగ్ న్యూస్ వచ్చింది. పెర్త్ టెస్టుకు ముందు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ గాయపడ్డాడు.
IND vs AUS 1st Test: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల హై ప్రొఫైల్ టెస్ట్ సిరీస్ నవంబర్ 22 నుంచి పెర్త్‌లో ప్రారంభం కానుంది. పెర్త్ టెస్టుకు ముందు భారత జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ గాయపడ్డాడు. పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో ఈ బ్యాట్స్‌మన్ ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయం. పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటంపై సందేహం నెలకొన్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ తన రెండో బిడ్డ కోసం ముంబైలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది.
టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్..
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడకపోతే ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను బరిలోకి దింపవచ్చు. అయితే, ఇంతలో ఓ బ్యాడ్ న్యూస్ బయటకు వస్తోంది. నవంబర్ 15 శుక్రవారం పెర్త్‌లోని WACA మైదానంలో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. పెర్త్‌లోని WACA మైదానంలో భారత్ వర్సెస్ ఇండియా-ఎ మధ్య మూడు రోజుల వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. డబ్ల్యూఏసీఏ మైదానంలో బౌన్స్ బంతిని ఆడే క్రమంలో కేఎల్ రాహుల్ కుడి మోచేతికి తాకింది. బంతి తగిలిన కేఎల్ రాహుల్ నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయడం సాధ్యం కాకపోవడంతో మైదానం వీడాల్సి వచ్చింది.
గాయపడని కేఎల్ రాహుల్..
కేఎల్ రాహుల్ గాయం టీమ్ ఇండియాకు పెద్ద దెబ్బగా మారింది. పెర్త్ తొలి టెస్టులో రోహిత్ శర్మ ఆడుతాడనేది కచ్చితంగా చెప్పలేం. ఇటువంటి పరిస్థితిలో కేఎల్ రాహుల్ గాయం టీమ్ ఇండియా పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కేఎల్ రాహుల్ గురించి మాట్లాడితే, అతని ప్రస్తుత ఫామ్ ఆందోళన కలిగించే విషయం. టెస్ట్ మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ తన చివరి 5 ఇన్నింగ్స్‌లలో 16, 22*, 68, 0, 12 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 53 టెస్టు మ్యాచ్‌లు ఆడి 91 ఇన్నింగ్స్‌ల్లో భారత్ తరపున 2981 పరుగులు చేశాడు. ఈ కాలంలో కేఎల్ రాహుల్ 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు సాధించాడు. కేఎల్ రాహుల్ టెస్టులో అత్యుత్తమ స్కోరు 199 పరుగులుగా ఉంది.
ఇప్పుడు టీమిండియాకు ఎలాంటి ఆప్షన్ ఉందంటే?
KL Rahul’s not looking very comfortable after being struck on his right elbow/forearm off a rising delivery. Tried to resume batting by shaking it off but clearly couldn’t. And now leaving with the physio #AusvInd pic.twitter.com/JFivRNx7af
— Bharat Sundaresan (@beastieboy07) November 15, 2024
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇద్దరూ ఆడలేకపోతే.. ధృవ్ జురెల్ లాంటి యువ బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇవ్వడం భారత జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. కేఎల్ రాహుల్ కంటే ధృవ్ జురెల్ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. టెస్టు క్రికెట్‌లో కేఎల్ రాహుల్ ప్రదర్శన చాలా మామూలుగా ఉంది. టెస్టు క్రికెట్‌లో కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ కూడా చాలా దారుణంగా ఉంది. టెస్టు క్రికెట్‌లో కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ 53.07గా ఉంది. అదే సమయంలో, ధ్రువ్ జురెల్ సాంకేతికంగా చాలా బలమైన బ్యాట్స్‌మన్.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
రిజర్వ్: ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..