AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kevin Sinclair: కెరీర్‌లో తొలి టెస్ట్‌ వికెట్‌.. గాల్లో పల్టీలు కొట్టి సంబరాలు.. వీడియో చూస్తే వావ్‌ అంటారంతే

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కెవిన్ తన తొలి టెస్టు వికెట్‌ను అందుకున్నాడీ యంగ్ ప్లేయర్‌. అంతే తన ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. గ్రౌండ్‌లోనే ఉత్సాహంగా సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. అది కూడా గాల్లోకి పల్టీలు కొట్టి. సింక్లెయిర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Kevin Sinclair: కెరీర్‌లో తొలి టెస్ట్‌ వికెట్‌.. గాల్లో పల్టీలు కొట్టి సంబరాలు.. వీడియో చూస్తే వావ్‌ అంటారంతే
Kevin Sinclair
Basha Shek
|

Updated on: Jan 27, 2024 | 9:50 AM

Share

వెస్టిండీస్ యంగ్‌ క్రికెటర్‌ కెవిన్ సింక్లెయిర్ టెస్టు క్రికెట్‌లో వికెట్ ఖాతా తెరిచాడు. బ్రిస్బేన్‌లోని గాబా మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కెవిన్ తన తొలి టెస్టు వికెట్‌ను అందుకున్నాడీ యంగ్ ప్లేయర్‌. అంతే తన ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. గ్రౌండ్‌లోనే ఉత్సాహంగా సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. అది కూడా గాల్లోకి పల్టీలు కొట్టి. సింక్లెయిర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హోరాహోరీగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు ఉస్మాన్ ఖవాజా శుభారంభం అందించాడు. ఒకవైపు స్టీవ్ స్మిత్ (6), మార్నస్ లాబుస్‌చాగ్నే (3) వికెట్లు చేజార్చుకోగా, మరోవైపు ఖ్వాజా ఎప్పటిలాగే తన డిఫెన్సివ్ ఆటతో దృష్టిని ఆకర్షించాడు.

కొరకరాని కొయ్యను ఔట్‌ చేసి.. 131 బంతులు ఎదుర్కొన్న ఉస్మాన్ ఖవాజా 10 ఫోర్లతో 75 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అటాకింగ్ స్పిన్నర్ కెవిన్ సింక్లెయిర్ వేసిన బంతిని మార్క్ చేయడంలో విఫలమవడంతో ఖ్వాజా స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు ఖవాజా. అంతే ఆనందంతో కెవిన్ గాల్లో తేలిపోయాడు. మైదానంలో ప‌ల్టీలు కొడుతూ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం మొదలుపెట్టాడు. బ్యాక్-ఫ్లిప్, జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలు చేశాడు. బ్రిస్బేన్ ప్రేక్షకులు కూడా విండీస్‌ బౌలర్‌ సంబరాలను చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు కెవిన్ సింక్లైర్ బ్యాక్ ఫ్లిప్ వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

సింక్లెయిర్ సంబరాలు.. వీడియో

పింక్ బాల్ టెస్ట్

బ్రిస్బేన్‌లోని గాబా మైదానంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 311 పరుగులకు ఆలౌటైంది. దీని తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు రెండో రోజు ఆటలో 1 వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11: ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, మార్నస్ లబు షేన్‌, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.

వెస్టిండీస్ ప్లేయింగ్ 11:

క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), తేజ్‌నరైన్ చంద్రపాల్, కిర్క్ మెకెంజీ, అలిక్ అతానాజ్, కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, షమర్ జోసెఫ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..