IND vs ENG: ముగిసిన భారత తొలి ఇన్నింగ్స్.. 190 ఆధిక్యంలో రోహిత్ సేన.. జడేజా సెంచరీ మిస్..
India vs England, 1st Test: హైదరాబాద్ టెస్టులో మూడో రోజు తొలి సెషన్ లోనే టీమిండియా ఆలౌట్ అయింది. భారత జట్టు 121 ఓవర్లలో 436 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ జట్టుపై 190 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

India vs England, 1st Test: హైదరాబాద్ టెస్టులో మూడో రోజు తొలి సెషన్ లోనే టీమిండియా ఆలౌట్ అయింది. భారత జట్టు 121 ఓవర్లలో 436 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ జట్టుపై 190 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 87 పరుగుల వద్ద రవీంద్ర జడేజా, 86 పరుగుల వద్ద కేఎల్ రాహుల్, 80 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్ 4 వికెట్లు పడగొట్టాడు. రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ 2-2 వికెట్లు తీశారు.
Innings Break!#TeamIndia post 436 on the board, securing a 1⃣9⃣0⃣-run lead.
8⃣7⃣ for @imjadeja 8⃣6⃣ for @klrahul 8⃣0⃣ for @ybj_19
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/cVzCnmMF5h
— BCCI (@BCCI) January 27, 2024
మూడో రోజు తొలి సెషన్‌లోనే టీమిండియా ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత్ 421/7 పరుగుల స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించింది. అయితే, సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రవీంద్ర జడేజాను జో రూట్ పెవిలియన్ చేర్చడంతో ఆట ప్రారంభమైన తర్వాత కొన్ని ఓవర్లు మాత్రమే సాగింది. ఆ తర్వాతి బంతికే బ్యాటింగ్‌కు వచ్చిన జస్ప్రీత్ బుమ్రాను గోల్డెన్ డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాతి ఓవర్ లోనే రెహాన్ అహ్మద్ అక్షర్ పటేల్ వికెట్ పడగొట్టాడు.
మూడో రోజు భారత జట్టు 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లిష్ స్పిన్నర్లు ముగ్గురు భారత ఆటగాళ్లను పెవిలియన్ చేర్చారు. ఇంగ్లండ్ తరపున జో రూట్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
