IND vs ENG: కమ్ బ్యాక్ ఇండియన్ అంటూ ఎలివేషన్ ఇస్తే.. ఇండియన్ 2 సినిమాలా ఫ్లాప్ అవుతున్న ప్లేయర్! మూడో టెస్టుకు డౌటే..?
2016లో ట్రిపుల్ సెంచరీతో సంచలనం సృష్టించిన కరుణ్ నాయర్, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లోనూ తక్కువ స్కోర్లు చేయడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనికి మరో అవకాశం ఇవ్వడం సరైనదేనా అనే చర్చ జరుగుతోంది. మరి చూడాలి ఏమవుతుందో?

ఎప్పుడో 2016లో ఓ ప్లేయర్ ఇండియన్ క్రికెట్‌లోకి రాకెట్‌లా దూసుకొచ్చాడు. వచ్చీ రావడంతోనే ఏకంగా ట్రిపుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. అతని పేరే కరుణ్ నాయర్. 2016లో ఇదే ఇంగ్లాండ్‌పై ఏకంగా 303 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ కొన్ని రోజులకు కనుమరుగైపోయాడు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తూ.. “డియర్ క్రికెట్.. గివ్ మీ వన్ మోర్ ఛాన్స్’ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. దాంతో మరోసారి క్రికెట్ అభిమానుల దృష్టని ఆకర్షించాడు. క్రికెట్‌ను ఇంతలా ప్రాథేయపడుతున్నాడు. ఇతనికి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టే దేశవాళి క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ వచ్చాడు. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగి ఒకటి రెండు మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు.
దీంతో ఒక కరుణ్ నాయర్‌ను టీమిండియాలోకి తీసుకోవాల్సిందే అనే డిమాండ్ వ్యక్తం అయింది. కమ్ బ్యాక్ ఇండియన్ అంటూ క్రికెట్ అభిమానులంతా నినదించారు. డొమెస్టిక్ క్రికెట్‌లో అతని ఫామ్ చూసి.. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం సెలెక్టర్లు కరుణ్ నాయర్‌ను ఎంపిక చేశారు. ఎప్పుడో 2016లో టీమిండియాకు ఆడిన ఆటగాడు మళ్లీ ఇన్నేళ్లకు టీమిండియాలోకి తిరిగి రావడంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇక మనోడు కసితో రెచ్చిపోతాడని అంతా అనుకున్నారు. కానీ, కమ్ బ్యాక్ ఇండియన్ నినాదం ఎంత హైలెట్ అయిందో.. కరుణ్ నాయర్ కమ్ బ్యాక్ మాత్రం ఇండియన్ 2 సినిమా అంత పెద్ద ఫ్లాప్ అయింది. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల్లోనూ కరుణ్ నాయర్ దారుణంగా నిరాశపర్చాడు.
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో డకౌట్ అయ్యాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం 20 పరుగులే చేసి విఫలం అయ్యాడు. సర్లే చాలా కాలం తర్వాత ఆడుతున్నాడు.. ఒక్క మ్యాచే కదా అని అంతా పోనిలే అనుకున్నారు. కానీ, రెండో టెస్టులోనూ అదే పూర్ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 31, రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఒక కరుణ్ నాయర్‌కు ఛాన్సులు ఇచ్చి లాభం లేదని క్రికెట్ అభిమానులు విమర్శలు మొదలెట్టారు. ఇక నాయర్‌కు రెస్ట్ ఇచ్చేసి.. బెంచ్‌లో కూర్చున్న అభిమన్యు ఈశ్వరన్‌కో లేదా సాయి సుదర్శన్‌కో మూడో టెస్టులో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ ఈ టెస్టులో టీమిండియా గెలిస్తే కరుణ్ నాయర్‌కు మరో ఛాన్స్ రావొచ్చేమో కానీ.. ఒక వేళ ఓడినా, డ్రా అయినా కూడా కూడా ఈ రెండో టెస్టే కరుణ్ నాయర్‌కు ఆఖరి టెస్టు అవుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికే కొంతమంది నెటిజన్లు.. డియర్ క్రికెట్ డొంట్ గీవ్ వన్ మోర్ ఛాన్స్ అంటూ కరుణ్ నాయర్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..