IND vs ENG: క్రికెట్ లవర్స్.. ఈ బ్యాట్ ఎవరిదో చెప్పగలరా? అలా గ్రౌండ్ మధ్యలో ఎందుకుందంటే..
రెండో ఇంగ్లాండ్ టెస్టులో రిషభ్ పంత్ అద్భుతమైన 30 పరుగులు చేశాడు. కానీ అతని బ్యాట్ గాల్లోకి ఎగిరిపడింది. టీమిండియా 587 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ ముగించింది. ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 350 పరుగుల లీడ్ తో ఉంది.

పైనున్న ఫొటో చూసి.. ఇప్పటికే చాలా మంది క్రికెట్ అభిమానులు కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి ఉంటారు. ఎస్.. అది రిషభ్ పంత్ బ్యాటే. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అగ్రెసివ్ బ్యాటింగ్ చేసేందుకు క్రీజ్‌లోకి వచ్చిన పంత్.. వచ్చీ రావడంతోనే ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడే ప్రయత్నం చేశాడు. కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు కొట్టేశాడు. టెస్టుల్లో ఇంత వేగంగా ఆడటం అంటే అది పంత్‌కే సాధ్యం అనే విధంగా ఉంటుంది అతని కొట్టుడు. అయితే.. ఇలా వేగంగా ఆడే క్రమంలో పంత్ తన బ్యాట్‌ను గాల్లో వదిలేశాడు. పంత్ బ్యాట్ గాల్లోకి ఎగిరిపడ్డం ఇదే తొలి సారి కాదు. అనేక సందర్భాల్లో పంత్ చేతుల్లోంచి బ్యాట్ జారిపోతూ ఉంటుంది.
చాలా సార్లు ఇలా బ్యాట్‌ను షాట్ ఆడే టైమ్‌లో వదిలేశాడు పంత్. అయితే ఈ సారి అది చాలా దూరం వెళ్లి పడింది. బ్యాట్‌తో బాల్ కొడితే ఎలా వెళ్లి పడుతుందో.. అలా పంత్ చేతుల్లోంచి అతని బ్యాట్ వెళ్లి దూరంలో పడింది. అదృష్టవశాత్తు ఆ బ్యాట్ నో మ్యాన్స్ ల్యాండ్‌లో పడింది. ఆ బ్యాట్ పడిన దగ్గర ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత పంత్ వెళ్లి తన బ్యాట్ తెచ్చుకున్నాడు. పంత్ అలా బ్యాట్ వదిలేసిన తర్వాత గ్రౌండ్ అంతా ఒకటే నవ్వులు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి టీమిండియా ఆటగాళ్లు ఇది మనోడికి కామనే అంటూ నవ్వుకున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 587 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి లంచ్ బ్రేక్‌కి వెళ్లారు. ప్రస్తుతం ఆట నాలుగో రోజు సాగుతోంది. ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. టీమిండియా 357 పరుగుల లీడ్‌లో ఉంది. 450, 500 మధ్య రన్స్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ ఇచ్చి.. ఇంగ్లాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌కు ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ రోజు మూడో సెషన్‌లో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కి రావొచ్చు. అంతకు ముందు ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు 407 పరుగులకు ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్ 6, ఆకాశ్ దీప్ 4 వికెట్లతో రాణించారు. ఇదే ప్రదర్శనను ఐదో రోజు కూడా కొనసాగిస్తే.. రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Ready to steal the show at Neeraj Chopra Classic 😂pic.twitter.com/BeXaBtlgJZ
— Out Of Context Cricket (@GemsOfCricket) July 5, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి