Ind vs Eng : పాకిస్తాన్ కు షాక్..డబ్ల్యూటీసీ రికార్డ్ బ్రేక్ చేసిన టీం ఇండియా..కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ
శుభమన్ గిల్ 269 పరుగులతో భారత్ డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక విదేశీ స్కోరు (587) నమోదు చేసింది. ఇంగ్లాండ్ బాజ్‌బాల్‌ను చిత్తు చేసి, పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టింది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో భారత జట్టు పటిష్ట స్థితిలో ఉంది.

Ind vs Eng : ప్రస్తుతం నడుస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఒక అద్భుతమైన రికార్డును సాధించింది. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో భారీగా 587 పరుగులు చేసింది. ఇది అనేక విధాలుగా రికార్డులను తిరగరాసింది. కెప్టెన్ శుభమన్ గిల్ ముందుండి నడిపించి 269 పరుగులు సాధించాడు. ఇది ఇంగ్లాండ్ గడ్డపై ఒక భారతీయ బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. అతని ఇన్నింగ్స్ భారత్ భారీ స్కోరుకు పునాది వేయడమే కాకుండా, రికార్డు పుస్తకాలను తిరగరాయడంలో కీలక పాత్ర పోషించింది. మిగిలిన బ్యాట్స్‌మెన్ల నుండి కూడా మంచి సహకారం లభించడంతో భారత్ సాధించిన ఈ స్కోరు ఇప్పుడు ఇంగ్లాండ్‌లో భారత్ సాధించిన అత్యధిక టెస్ట్ స్కోరు, విదేశీ గడ్డపై డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ సాధించిన అత్యధిక స్కోరుగా నిలిచింది. అంతేకాకుండా
పాకిస్థాన్ రికార్డును బ్రేక్ చేసిన భారత్
ఈ భారీ స్కోరుతో WTC చరిత్రలో గతంలో పాకిస్థాన్ పేరిట ఉన్న అత్యధిక విదేశీ స్కోరును భారత్ అధిగమించింది. పాకిస్థాన్ 2022 డిసెంబర్‌లో రావల్పిండిలో ఇంగ్లాండ్‌పై 579 పరుగులు చేసింది. అంతకుముందు, డబ్ల్యూటీసీలో భారత్ సాధించిన అత్యధిక విదేశీ స్కోరు 2024లో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై 487/6 డిక్లేర్ చేసింది.
ఇంగ్లాండ్ బాజ్‌బాల్ వ్యూహాన్ని చిత్తు చేసిన భారత్
దూకుడు ఆటతీరుకు ప్రసిద్ధి చెందిన ఇంగ్లాండ్ బాజ్‌బాల్ వ్యూహాన్ని, భారత్ తమ ఆధిపత్య బ్యాటింగ్‌తో సమర్థవంతంగా నిలువరించింది.ఫాస్టెస్ట్ రన్ చేజ్‌లు, కౌంటర్‌అటాక్‌లకు పేరుగాంచిన ఇంగ్లాండ్, భారత ఆటగాళ్లు నిలకడగా పరుగులు తీస్తుంటే తడబడింది. ఈ ఇన్నింగ్స్ భారత్‌కు మ్యాచ్‌లో పటిష్టమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా, టెస్ట్ క్రికెట్ ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపింది. భారత్ డబ్ల్యూటీసీ వేదికపై ఒకేసారి ఒక రికార్డును బద్దలు కొడుతూ ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.
రాహుల్-గిల్ జోడీతో భారత్ దూకుడు
ఈ వార్త రాస్తున్న సమయానికి, కేఎల్ రాహుల్ 78 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో శుభమన్ గిల్ పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. కరుణ్ నాయర్ త్వరగా ఔటైన తర్వాత ఈ జోడి ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజున భారత్ దూకుడును కొనసాగిస్తోంది.ఇదిలా ఉండగా మ్యాచ్‌పై నల్లటి మేఘాలు అలుముకున్నాయి వర్షం ముప్పు పొంచి ఉంది. మేఘావృతమైన వాతావరణం ఇంగ్లాండ్ సీమర్లకు అనుకూలంగా మారింది, బంతికి స్వింగ్ లభిస్తోంది. బంతి కదలికను ఉపయోగించుకొని బ్రైడన్ కార్స్ నాయర్‌ను ఔట్ చేసి ఇంగ్లాండ్‌కు అవసరమైన వికెట్‌ను పడగొట్టాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..