AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రేయ్ ఎవడ్రా నువ్వు రాత్రి పూట సన్ గ్లాసెస్ పెట్టుకున్నావు? టీంమేట్ ని ట్రోల్ చేస్తున్న యార్కర్ కింగ్

భారత టెస్ట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరిన సమయంలో బుమ్రా చేసిన సరదా కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. శుభ్‌మన్ గిల్‌ను లక్ష్యంగా చేసుకుని "రాత్రి పూట సన్‌గ్లాసెస్ ఎందుకు?" అంటూ బుమ్రా సరదాగా ప్రశ్నించడం అభిమానుల మనసు గెలుచుకుంది. ఇదిలా ఉండగా, బుమ్రా ఐదు టెస్టులకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉండడంతో భారత బౌలింగ్ వ్యూహంలో అది కీలక అంశంగా మారింది. బీసీసీఐ బుమ్రాను జాగ్రత్తగా వినియోగించేందుకు వ్యూహం రచిస్తోంది.

Video: రేయ్ ఎవడ్రా నువ్వు రాత్రి పూట సన్ గ్లాసెస్ పెట్టుకున్నావు? టీంమేట్ ని ట్రోల్ చేస్తున్న యార్కర్ కింగ్
Jasprit Bumrah Shubman Gill
Narsimha
|

Updated on: Jun 08, 2025 | 9:30 AM

Share

భారత జట్టు ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌లో ఆడేందుకు బయలుదేరింది. ఈ సందర్భంగా బీసీసీఐ విడుదల చేసిన యూరప్ ట్రావెల్ వ్లాగ్‌లో రిషబ్ పంత్ తన చిల్ మూడ్‌లో కనిపించగా, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన సహచరుడిపై చేసిన సరదా వ్యాఖ్యతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఆటగాళ్లు విమానంలోకి ప్రవేశించే సమయంలో తీసిన ఓ క్లిప్‌లో బుమ్రా తన చిలిపి ధోరణిలో “బందే నే రాత్ మే చష్మే పెహ్నే హై” అంటూ వ్యాఖ్యానించాడు, దీని అర్థం “ఈ మనిషి రాత్రిపూట సన్‌గ్లాసెస్ పెట్టుకున్నాడు” అన్నమాట. ఈ కామెంట్ ఎవరిపై చేసాడో స్పష్టంగా తెలియకపోయినా, తర్వాత కెమెరా షాట్ భారత జట్టు కొత్త కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌పైకి వెళ్లింది. అతను సన్‌గ్లాసెస్ ధరించి కనిపించడంతో, ఆ వ్యాఖ్య అతనిపైనే చేశాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బుమ్రా ఈ సరదా వ్యాఖ్య అభిమానుల్లో నవ్వులు పూయించింది.

ఇదిలా ఉంటే, జస్ప్రీత్ బుమ్రా పనిభార నిర్వహణ భారత జట్టుకు పెద్ద సవాలుగా మారింది. బీసీసీఐ ముఖ్య సెలెక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం, బుమ్రా ఐదు టెస్ట్‌లలో పూర్తి స్థాయిలో పాల్గొనడనికి అవకాశం లేదు. అతను గరిష్టంగా మూడు టెస్ట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని చెప్పారు. సిరీస్‌లో పరిస్థితులను బట్టి బుమ్రా ఎటువంటి మ్యాచ్‌ల్లో ఆడాలో నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇది భారత బౌలింగ్ దళం వ్యూహంలో కీలక అంశం.

బుమ్రా సిరీస్ ఓపెనర్‌కి ఖచ్చితంగా లభించే అవకాశముంది. మొత్తం జట్టు లండన్‌లో 10 రోజుల శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. ఈ శిక్షణ అనంతరం తుది జట్టును ప్రకటించనున్నారు. ఈ సిరీస్ కొత్త ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ సైకిల్‌ను ప్రారంభించనుంది. గత సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా, బుమ్రాను జాగ్రత్తగా వాడేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతూ, గాయాల రహితంగా తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఈసారి తొలి టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత్ పటిష్టంగా ముందుకెళ్తోంది.

ఇంగ్లాండ్ పర్యటనకు భారత టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (c), రిషబ్ పంత్ (vc, wk), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, శార్దూల్ థాకూర్, ప్రసీద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..