SRH: కావ్య పాపనా.. మజాకానా..! నవ్వినోళ్ల నోరుమూయించేసిన తలైవి.. SRHకే ఐపీఎల్ ట్రోఫీ.!

క్రికెట్‌ గ్రామర్‌కి గ్లామర్‌ అద్దుతున్నారు వాళ్లు. అయితే వాళ్లు చీర్‌ గాల్స్ కాదు... అంతకుమించి. ఐపీఎల్‌లో వాళ్లే స్పెషల్‌ అట్రాక్షన్‌. ఆట వెనుక అందగత్తెలు. తమ తమ టీమ్‌లకు ఫుల్‌ జోష్‌ తెప్పించే శక్తులు. బోర్డ్ రూమ్స్‌లో ప్లానింగ్‌ మాత్రమే కాదు...స్టేడియంలో బోల్డ్‌ యాక్షన్‌తో అదరగొడతారు.

SRH: కావ్య పాపనా.. మజాకానా..! నవ్వినోళ్ల నోరుమూయించేసిన తలైవి.. SRHకే ఐపీఎల్ ట్రోఫీ.!
Kavya Maran
Follow us

|

Updated on: May 25, 2024 | 9:09 PM

క్రికెట్‌ గ్రామర్‌కి గ్లామర్‌ అద్దుతున్నారు వాళ్లు. అయితే వాళ్లు చీర్‌ గాల్స్ కాదు… అంతకుమించి. ఐపీఎల్‌లో వాళ్లే స్పెషల్‌ అట్రాక్షన్‌. ఆట వెనుక అందగత్తెలు. తమ తమ టీమ్‌లకు ఫుల్‌ జోష్‌ తెప్పించే శక్తులు. బోర్డ్ రూమ్స్‌లో ప్లానింగ్‌ మాత్రమే కాదు…స్టేడియంలో బోల్డ్‌ యాక్షన్‌తో అదరగొడతారు. తమ అందంతో అందరిని క్లీన్ బౌల్డ్‌ చేస్తారు. స్టేడియంలో ప్రేక్షకులు మాత్రమే కాదు, టీవీల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు చూసేవారి చూపు కూడా వాళ్ల మీదే ఉంటుంది. ఆటగాళ్లు ఎందరున్నా ఐపీఎల్‌కు ఊపు తెచ్చేది అందమైన భామలే. తమ టీమ్‌ బౌండరీలు బాదినా, చిచ్చర పిడుగుల్లా సిక్సర్లు కొట్టినా…స్టేడియం మొత్తం చూపు, టీవీలో ఆట చూసే జనం చూపు వాళ్ల వైపే ఉంటుంది. తమ టీమ్‌ బాగా ఆడుతుంటే ఫ్రాంచైజీల లేడీ ఓనర్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు.

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్‌ నీతా అంబానీ, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహ ఓనర్‌ జూహీ చావ్లా, పంజాబ్ కింగ్స్‌ ఓనర్‌ ప్రీతి జింతా, ఒకప్పటి డెక్కన్‌ చార్జర్స్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ డాటర్‌ గాయత్రి, ఇప్పటి హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ కావ్య…వీళ్లంతా ఆట వెనుక అందగత్తెలు మాత్రమే కాదు. తమ టీమ్‌కు జోష్‌ తెప్పించే తెర వెనుక శక్తులు. ఈ అందాల భామలు…ఐపీఎల్‌ టీమ్‌ల ఓనర్లు ప్లస్‌ గ్లామర్‌ క్వీన్స్‌. క్రికెట్‌ గ్రామర్‌కు తమ గ్లామర్‌ని అద్దే బ్యూటిఫుల్‌ ఏంజెల్స్‌. ఇక సోషల్‌ మీడియాలో వీళ్ల హవా మామూలుగా ఉండదు. ప్లేయర్స్‌తో సరిసమానంగా వీళ్లు కూడా హల్‌చల్‌ చేస్తుంటారు. హైదరాబాద్‌ ఐపీఎల్‌ టీమ్‌ ఒకప్పుడు డెక్కన్‌ చార్జర్స్‌గా ఉన్నప్పుడు దానికి తన జోష్‌తో ఫుల్‌ చార్జ్‌ చేసి, స్టేడియంలో ప్లేయర్స్‌ని, ఫ్యాన్స్‌ని రీచార్జ్‌ చేసేవారు గాయత్రి. అప్పటి ఫ్రాంచైజీ ఓనర్‌ కూతురు అయిన గాయత్రి…తన టీమ్‌ను ఎంతో ప్రోత్సహించేవాళ్లు. ఇక ఆమెకు సెపరేట్‌గా ఫ్యాన్‌ బేస్‌ కూడా ఉండేది. అప్పట్లో డెక్కన్‌ చార్జర్స్‌కు ఫుల్‌ జోష్‌ ఇచ్చి.. కప్పు కొట్టేలా చూశారు గాయత్రి.

ఆ తర్వాత డెక్కన్ చార్జర్స్‌ పేరు మారింది. అది రూపాంతరం చెంది హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌గా అవతారం ఎత్తాక…గాయత్రి ప్లేసులో నేనున్నా మీకోసం అంటూ ఓ సరికొత్త అందాల భామ ఫ్యాన్స్‌కి అభయమిచ్చారు. ఆమె కావ్యా మారన్‌. ఈమె సన్‌ రైజర్స్‌లో కొత్త కావ్యానికి శ్రీకారం చుట్టారు. సన్‌ రైజర్స్‌ టీమ్‌ ఆడుతున్నప్పుడు కావ్య చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ బోల్డ్ అండ్‌ బ్యూటిఫుల్‌ ఉమన్‌ యాక్షన్‌తో స్టేడియంలోని ప్రేక్షకుల నుంచే కాదు…టీవీల్లో మ్యాచ్‌ చూసే ఫ్యాన్స్‌ నుంచి కూడా బోలెడు రియాక్షన్‌ వస్తుంది. కావ్య అంటే ఆషామాషీ గాల్‌ కాదు. నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకుంది. తన టీమ్‌ ఆడుతున్నప్పుడు, క్షణక్షణముల్‌ జవరాండ్ర చిత్తముల్‌ అన్నట్లు, ఆమె ముఖంలో హావభావాలు మారిపోతుంటాయి. అప్పుడు మూడ్ ఆఫ్‌ ది నేషన్‌గా మారిపోతుంటుంది ఈ అందాల కావ్య. ఆమె ఇస్తున్న సపోర్ట్‌తో ఇప్పుడు ఫైనల్స్‌కు చేరుకుంది సన్‌ రైజర్స్‌ టీమ్‌.

అటు కావ్య పాప ఐపీఎల్ 2024 వేలంలో అంత డబ్బులు వెచ్చించి.. ప్యాట్ కమిన్స్‌ను కొనుగోలు చేసినప్పుడు.. మిగతా ఫ్రాంచైజీల ఓనర్లు ఆమె నిర్ణయానికి నవ్వుకున్నారు. ఇక వారినే ఇప్పుడు సైలెంట్ చేస్తూ.. తనదైన మార్క్ చూపించింది కావ్య మారన్. ఆ ప్యాట్ కమిన్స్ సారధ్యంలోనే ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2024 ఫైనల్స్‌కు చేరుకుంది.

Latest Articles
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్