AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కావ్యపాపకు షాకిచ్చిన ఛోటా ప్యాకెట్.. నేను ధోనిని కాదంటూ బాంబ్ పేల్చిన ఇషాన్..!

Ishan Kishan Quits Wicketkeeping: ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో విజయాన్ని దక్కించుకుంది. అది కూడా ఓటమెరుగని రాజస్థాన్ రాయల్స్ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో తాత్కలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీంతో సానుకూల ఫలితం వచ్చినా.. ఫ్యూచర్ ఏంటోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కావ్యపాపకు షాకిచ్చిన ఛోటా ప్యాకెట్.. నేను ధోనిని కాదంటూ బాంబ్ పేల్చిన ఇషాన్..!
Srh
Venkata Chari
|

Updated on: Apr 14, 2026 | 6:53 PM

Share

Ishan Kishan Quits Wicketkeeping: సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక సారథి ఇషాన్ కిషన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకుని, కేవలం ఫీల్డర్‌గా మైదానంలో ఉండాలని నిశ్చయించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ మార్పు స్పష్టమైన ఫలితాలను ఇవ్వడమే కాకుండా, బౌలర్లతో కమ్యూనికేషన్ సమస్యను కూడా తీర్చిందని ఆయన వెల్లడించాడు.

వికెట్ కీపింగ్ వదులుకోవడానికి గల కారణం..

సాధారణంగా ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలు వికెట్ల వెనుక ఉండి జట్టును అద్భుతంగా నడిపించేవాడు. అయితే తాను ధోనీని కాదని, వికెట్ కీపింగ్ చేస్తూ బౌలర్లను నియంత్రించడం తనకు సవాలుగా మారుతోందని ఇషాన్ కిషన్ నిజాయితీగా ఒప్పుకున్నాడు. కీపింగ్ గ్లౌజులు ధరించినప్పుడు బౌలర్ల వద్దకు వెళ్లి ప్రణాళికలు చర్చించడానికి సమయం సరిపోవడం లేదని, దీనివల్ల క్షేత్రస్థాయిలో కొంత గందరగోళం నెలకొంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకే సలీల్ అరోరాకు కీపింగ్ బాధ్యతలు అప్పగించి, తాను ఫీల్డింగ్‌లో ఉంటూ బౌలర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు తెలిపాడు.

బౌలర్లతో మెరుగైన సమన్వయం..

పాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టును నడిపిస్తున్న ఇషాన్, ఫీల్డర్‌గా ఉండటం వల్ల బౌలర్లకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం సులభమైందని తెలిపాడు. “కెప్టెన్‌గా బౌలర్లతో మాట్లాడటం చాలా ముఖ్యం. ఫీల్డింగ్‌లో ఉంటే వారు ఏ బంతి వేయాలనుకుంటున్నారో చర్చించి, దానికి అనుగుణంగా ఫీల్డింగ్ సెట్ చేయవచ్చు. రాజస్థాన్‌పై ఈ వ్యూహం బాగా పనిచేసింది” అని మ్యాచ్ అనంతరం ఇషాన్ పేర్కొన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇదే పద్ధతిని కొనసాగించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశాడు.

ఇవి కూడా చదవండి

అభిషేక్ శర్మపై నమ్మకం..

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ త్వరగా అవుట్ అయినప్పటికీ, ఇషాన్ కిషన్ 91 పరుగులతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు బ్యాటింగ్ సామర్థ్యంపై ఆయన ధీమా వ్యక్తం చేశాడు. “మా జట్టులో ప్రతి మ్యాచ్‌లోనూ 200 పైగా పరుగులు చేసే సత్తా ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఒకసారి కుదురుకుంటే జట్టు స్కోరును 260 నుంచి 270 వరకు తీసుకెళ్లగలడు. అందుకే అతడిని తన సహజ సిద్ధమైన ఆటను ఆడనిస్తున్నాం. తర్వాతి మ్యాచ్‌లో అతను మరింత కసితో ఆడతాడని నమ్ముతున్నాను” అని ఇషాన్ వివరించాడు.

కెప్టెన్సీ భారంతో బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్‌లో ఇబ్బంది పడకుండా, జట్టు గెలుపు కోసం తన వ్యక్తిగత బాధ్యతలను మార్చుకోవడానికి సిద్ధపడటం ఇషాన్ కిషన్ పరిణతికి నిదర్శనం. ఈ కొత్త వ్యూహం సన్‌రైజర్స్‌కు ఈ సీజన్‌లో మరిన్ని విజయాలను అందిస్తుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us