IPL Auction 2025: CSK పర్సు వాల్యూ రూ. 55 కోట్లు.. కావల్సిన ప్లేయర్లు 20
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐపీఎల్ 2025 వేలంలో ₹55 కోట్ల బడ్జెట్‌తో 20 ఆటగాళ్లను, అందులో ఏడుగురు విదేశీ ప్లేయర్లను కొనుగోలు చేయాలని చూస్తోంది. కొత్త వికెట్‌కీపర్, ఆల్‌రౌండర్, స్పిన్నర్, పేసర్ల కోసం.. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ట్రెంట్ బౌల్ట్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి పేర్లను లక్ష్యంగా పెట్టుకుంది. RTM ద్వారా డెవాన్ కాన్వే, దీపక్ చాహర్ వంటి మునుపటి ఆటగాళ్లను తిరిగి తీసుకునే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ IPL 2025 వేలంలో ఏఏ ఆటగాళ్లను దక్కించుకుంటుదోన్న క్యురియాసిటి అందరిలోను పెరిగింది. ఎందుకంటే సాధారణ కనిపించే ప్లేయర్లు కూడా సీఎస్కే జట్టులోకి వెళ్లాక ఆసాధారణ ప్రదర్శన చేస్తుంటారు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలంలో రూ. 55 కోట్లు, అన్‌క్యాప్డ్ విభాగంలో ఎంఎస్ ధోని సహా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ , రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మతీషా పతిరానా ను కలుపుకొని ఐదుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది.
అయితే CSK 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలంలో రూ. 55 కోట్ల బడ్జెట్ తో మిగిలిన మొత్తం స్క్వాడ్‌ను భర్తీ చేయవలసి ఉంటుంది. నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో ఫ్రాంచైజీ లక్ష్యంగా చేసుకోగల కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు వారెవరూ ఓ సారి పరిశీలిద్దాం.
ధోని మరో సీజన్‌లో ఆడనుండగా, ఫ్రాంచైజీ ధోని వారసుడి కోసం వెతుకుతోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కే ఈసారి కొత్త వికెట్‌కీపర్ బ్యాటర్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
రిషబ్ పంత్ చాలా కాలంగా CSKకి వెళతారు అనే ఉహాగానాలు వస్తున్నాయి. కానీ వారి తక్కువ బడ్జెట్‌తో, అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లకు ఫ్రాంచైజీ వేలం వేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ధోనీకి బ్యాటింగ్ పొజిషన్‌లో జితేష్ శర్మ ని తీసుకుంటే తగిన న్యాయం చేస్తాడని సీఎస్కే భావిస్తోంది.
CSK గతంలో డెవాన్ కాన్వే వంటి విదేశీ ఎంపిక ద్వారా కూడా పాత్రను పూరించవచ్చు, క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, జానీ బెయిర్‌స్టో వంటి ప్లేయర్లు రుతురాజ్‌కు సరైన ఓపెనింగ్ భాగస్వామిగా ప్రెజెంట్ అవుతారు. CSKకి ఒక రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ మిగిలి ఉంది దాంతో కాన్వే లేదా రచిన్ రవీంద్రలో ఒకరు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు ఆటగాళ్లను ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం ఒక ఎంపిక, వారిలో ఒకరు సాధారణ బిడ్డింగ్ లో కొనుగోలు చేయబడతారు. అదేవిధంగా, వారు 2024 సీజన్ లో ఆ జట్టులో ఉన్నప్పటికీ ప్లెయింగ్ ఎలెవన్ లో ఆడే అవకాశం రాని డారిల్ మిచెల్‌ను తిరిగి కొనుగోలు చేయాలని కూడా చూడవచ్చు.
CSK ఎల్లప్పుడూ మిడిల్ ఆర్డర్‌లో మంచి ఆల్-రౌండర్‌ను తీసుకోవాలని యోచిస్తోంది. గ్లెన్ మాక్స్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొహమ్మద్ నబీ వంటివారు ఆ పాత్రను భర్తీ చేయగలరు.
మహేశ్ తీక్షణ, మిచెల్ సాంట్నర్ ఇద్దరూ ఇటీవలి సంవత్సరాలలో రవీంద్ర జడేజాతో కలిసి CSK కోసం ప్రీమియం స్పిన్నర్ పాత్రను పూరించారు. ఈ ఇద్దరూ CSK జాబితాలో తప్పకుండా ఉంటారు. వానిందు హసరంగా వంటి ఇతరులు కూడా ఆసక్తిని పొందవచ్చు. ఇక అశ్విన్ కూడా ఈ సారి సీఎస్కేలోకి వచ్చే అవకాశముంది.
CSK పేసర్ల పైన బలమైన పెట్టుబడి పెట్టడానికి ఎప్పుడు ముందడుగు వేస్తుంది. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, ఉమ్రాన్, ప్రసిద్ధ్ కృష్ణ వంటివారు ఆసక్తిని కనబరుస్తుండగా, తనను CSK మళ్లీ కొనుగోలు చేస్తుందని దీపక్ చాహర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. గుజరాత్ టైటాన్స్ (GT) మొహమ్మద్ షమీపై తమ RTMని ఉపయోగించాలని నిర్ణయించుకోకపోతే, CSK అతని సేవలను పొందేందుకు ప్రయత్నించవచ్చు.
ఓవర్సీస్ పేర్లలో, ముస్తాఫిజుర్ రెహమాన్ గత సీజన్‌లో ఆకట్టుకున్నందున ఫ్రాంచైజీకి తిరిగి రావచ్చు. కగిసో రబడ, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, లాకీ ఫెర్గూసన్, నవీన్-ఉల్-హక్ వంటి స్టార్‌లు దృష్టిలో ఉంచుకునే ఆటగాళ్లు. మొత్తంమీద, CSK వేలంలో 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది, అందులో గరిష్టంగా ఏడుగురు విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు.
IPL 2025 CSK వేలం అంచనాలు:
Marquee Set – కగిసో రబడ, మిచెల్ స్టార్క్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ.
వికెట్ కీపర్ బ్యాటర్లు – ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, క్వింటన్ డి కాక్, ఫిల్ సాల్ట్, రహ్మానుల్లా గుర్బాజ్, జానీ బెయిర్‌స్టో.
ఆల్ రౌండర్లు – గ్లెన్ మాక్స్‌వెల్, లియామ్ లివింగ్‌స్టోన్ గ్లెన్ ఫిల్పిస్, మహ్మద్ నబీ.
స్పిన్నర్లు – ఆర్ అశ్విన్,
పేసర్లు – ట్రెంట్ బౌల్ట్, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, టి నరజన్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, ఉమ్రాన్, ప్రసిద్ధ్ కృష్ణ.
RTMలు/మాజీ ఆటగాళ్లు – డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, మిచెల్ సాంట్నర్.