Perth Pitch Report: ఈ ఫొటోలు చూస్తే భారత బ్యాటర్లకు జ్వరం రావాల్సిందే.. భయపెడుతోన్న పెర్త్ పిచ్

IND vs AUS Perth Pitch Report: నవంబర్ 22 నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 5-టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు ఈ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, అంతుకుముందే బ్యాటర్లను భయపెట్టే ఫొటోలు విడుదలయ్యాయి.

Perth Pitch Report: ఈ ఫొటోలు చూస్తే భారత బ్యాటర్లకు జ్వరం రావాల్సిందే.. భయపెడుతోన్న పెర్త్ పిచ్
Ind Vs Aus Perth Pitch Repo
Follow us
Venkata Chari

|

Updated on: Nov 19, 2024 | 2:39 PM

IND vs AUS Perth Pitch Report: నవంబర్ 22 నుంచి పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 5-టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ జరగనుంది. పెర్త్‌లో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్‌కు ముందే పిచ్‌కి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు చూస్తుంటే బ్యాట్స్‌మెన్స్ పరిస్థితి తలచుకుంటే పాపం అనాల్సిందే. ఎందుకంటే, పిచ్‌పై చాలా గడ్డి ఉంది. దానిని పచ్చగా ఉంచడానికి నిరంతరం నీరు పోస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో, బంతి చాలా స్వింగ్, బౌన్స్ తీసుకోవచ్చని తెలుస్తోంది.

ఫాస్ట్ బౌలర్లకు పండగే..

నలుగురు ఫాస్ట్ బౌలర్లతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు బరిలోకి దిగవచ్చని కూడా భావిస్తున్నారు. యశస్వి జైస్వాల్, ఉస్మాన్ ఖవాజా, విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ వంటి భారత బ్యాట్స్‌మెన్‌లకు ఈ పిచ్ కష్టతరమైనదిగా మారనుంది. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్‌ను ఇష్టపడవచ్చు. అయితే, పిచ్‌పై గడ్డి కోయాల్సి ఉందని అంటున్నారు. ఆ తర్వాతే పిచ్ ఎలా ఉంటుందో తెలియనుంది.

ఇవి కూడా చదవండి

టీమిండియాకు సమస్యలు..

ఈ సిరీస్‌లో భారత్‌కు అనేక సవాళ్లు ఉన్నాయి. ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడలేడు. తన రెండవ బిడ్డ పుట్టిన కారణంగా అతను భారతదేశంలోనే ఉన్నాడు. రెండో పెద్ద సమస్య ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు గాయం. తొలి టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. వీటన్నింటితో పాటు విరాట్ కోహ్లీ ఇటీవలి ఫామ్ కూడా ఆందోళన కలిగించే అంశం. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించేందుకు భారత్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో భారత జట్టు ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. కాబట్టి ఈ సిరీస్‌ను గెలవాలంటే భారత్‌ అన్ని రంగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

ఫాస్ట్ బౌలర్లు ఇక్కడ చాలా సహాయాన్ని పొందుతారని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇప్పటి వరకు ఈ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మాత్రమే మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇలాంటి మ్యాచ్‌లో ఏ జట్టు టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ చేయాలని కోరుకుంటుంది.

పెర్త్ స్టేడియం వాతావరణ నివేదిక..

నవంబర్ 22న పెర్త్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కానీ, వర్షం పడే అవకాశం లేదు. ఉష్ణోగ్రత దాదాపు 22 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గాలి వేగం గంటకు 17 కిలోమీటర్లు, గాలి నైరుతి దిశగా ఉంటుంది. తేమ స్థాయి 52% ఉంటుంది. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. క్లౌడ్ కవర్ 57 శాతం ఉంటుంది.

పెర్త్ స్టేడియం టెస్ట్ గణాంకాలు..

మొదటి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు: 456

రెండో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు: 250

మూడో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు: 218

నాల్గవ ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు: 183

ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రవీంద్ర జడేజా , ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

రిజర్వ్: ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.

తొలి టెస్టుకు ఆస్ట్రేలియన్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..