AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Quaid-e-Azam Trophy: కొత్త సందేహానికి తెరలేపిన పాకిస్తాన్! ఇలాంటివి మీకు మాత్రమే సాధ్యం.. వీడియో వైరల్

పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్‌లో మొహమ్మద్ వాలీద్ ఒక విచిత్ర రనౌట్‌కు గురయ్యాడు. క్రీజులో ఉండే సమయంలో జంప్ చేయడం అతనికి చేటుగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలను అందుకుంది. ఈ సంఘటన క్రికెట్ న్యాయ నియమాలపై పునరాలోచన అవసరమని సూచిస్తోంది.

Quaid-e-Azam Trophy: కొత్త సందేహానికి తెరలేపిన పాకిస్తాన్! ఇలాంటివి మీకు మాత్రమే సాధ్యం.. వీడియో వైరల్
Pcb
Narsimha
|

Updated on: Jan 04, 2025 | 9:28 PM

Share

క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే రనౌట్‌ పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్‌లో చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ఆటగాడు క్రీజులో ఉండే రనౌట్ అవ్వడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు “ఇదెక్కడి రనౌట్‌? మీ పాకిస్థానోళ్లకే సాధ్యం రా అయ్యా!” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Quaid-e-Azam Trophy ట్రోఫీలో పెషావర్‌తో జరిగిన మ్యాచ్‌లో సియల్‌కోట్ బ్యాటర్ మొహమ్మద్ వాలీద్ తన దురదృష్టకర రనౌట్‌కు గురయ్యాడు. బౌలర్ మహమ్మద్ అమీర్ ఖాన్ వేసిన బంతిని వాలీద్ డిఫెండ్ చేయగా, మళ్ళీ బౌలర్ బంతిని వికెట్ల వైపుకి వేగంగా విసిరాడు. బంతి వికెట్లను తాకుతుందేమోనని వాలీద్ తన కాలిని పైకెత్తి జంప్ చేయగా, అదే అతనికి చేటు అయింది. థర్డ్ అంపైర్ రిప్లేను పరిశీలించిన తర్వాత వికెట్ ఔట్‌గా ప్రకటించాడు.

ఈ సంఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “బ్యాటర్ క్రీజులో ఉండగా బంతిని విసరడం అనవసరం,” అని కొందరు బౌలర్ తప్పిదంగా భావిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి సంఘటనలు జరగకపోవడం వలన సరైన నియమాలు లేవని మరికొందరు అభిప్రాయపడ్డారు.

ఈ సంఘటన క్రికెట్ ప్రపంచానికి నూతన చర్చను తెచ్చింది. ఆటలో న్యాయం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.