AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ 2026 ఆరంభంలోనే వివాదం.. ఫిల్ సాల్ట్ క్యాచ్‌ విషయంలో అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్

IPL 2026 Umpiring Row : ఆర్సీబీ ప్లేయర్ ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచ్‌పై థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇది అంపైరింగ్ తప్పిదం అంటూ ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

IPL 2026 : ఐపీఎల్ 2026 ఆరంభంలోనే వివాదం.. ఫిల్ సాల్ట్ క్యాచ్‌ విషయంలో అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
Ipl 2026 Finishers (1)
Rakesh
|

Updated on: Mar 29, 2026 | 7:57 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభమే వివాదంతో మొదలైంది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఒక వివాదాస్పద క్యాచ్ సోషల్ మీడియాలో సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఆర్సీబీ ప్లేయర్ ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచ్‌పై థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇది అంపైరింగ్ తప్పిదం అంటూ ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రోమారియో షెపర్డ్ వేసిన షార్ట్ డెలివరీని హెన్రిక్ క్లాసెన్ మిడ్-వికెట్ వైపు బలంగా బాదాడు. బౌండరీ వద్ద ఉన్న ఫిల్ సాల్ట్ వెనక్కి పరుగెత్తుతూ గాలిలోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. అయితే, అతను కింద పడే క్రమంలో అతని వెనుక భాగం లేదా పాదం బౌండరీ కుషన్‌ను తాకినట్లు రీప్లేలో కనిపించింది. ముఖ్యంగా కుషన్ స్వల్పంగా కదలడం టీవీల్లో స్పష్టంగా తెలిసింది. కానీ, థర్డ్ అంపైర్ అన్ని యాంగిల్స్ సరిగ్గా చూడకుండానే, ముఖ్యంగా బ్యాక్ యాంగిల్ చెక్ చేయకుండానే క్లాసెన్ అవుట్ అని ప్రకటించడం వివాదానికి దారితీసింది.

మైఖేల్ వాన్ ఏమన్నారంటే?

ఈ నిర్ణయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. “నాకు తెలిసైతే ఫిల్ సాల్ట్ పాదం ఖచ్చితంగా బౌండరీ స్పాంజ్ (కుషన్)ను తాకింది. అది ఆర్సీబీకి అనుకూలంగా వచ్చిన పెద్ద నిర్ణయం. అసలు ఎటువంటి సందేహం లేకుండా దాన్ని అవుట్ అని ఎలా ఇస్తారు? కుషన్ కూడా కదిలింది కదా” అని వాన్ ప్రశ్నించారు. నిర్ణయాత్మకమైన బ్యాక్ యాంగిల్ చూడకుండానే అంపైర్ క్లాసెన్‌ను పెవిలియన్‌కు పంపడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

జూమ్ చేసి చూస్తే ఏమైంది?

సోషల్ మీడియాలో అభిమానులు ఈ క్యాచ్‌ను జూమ్ చేసి స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. సాల్ట్ బంతిని పట్టుకుని కిందకు వంగినప్పుడు అతని టీ-షర్ట్ లేదా బ్యాక్ సైడ్ కుషన్‌ను తాకడం వల్ల కుషన్ తన స్థానం నుంచి కాస్త పక్కకు జరగడం వీడియోల్లో కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్‌కు అనుకూలంగా నిర్ణయం ఇవ్వాలి. కానీ అంపైర్ తొందరపడి అవుట్ ఇవ్వడంతో హైదరాబాద్ టీమ్ ఒక కీలక వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. దీనివల్ల క్లాసెన్ (31 పరుగులు) ఇన్నింగ్స్ అర్ధాంతరంగా ముగిసింది.

మ్యాచ్ ఫలితంపై ప్రభావం

వివాదాలు పక్కన పెడితే, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 201 పరుగులు చేయగా, బెంగళూరు కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (69*), దేవదత్ పడిక్కల్ (61) అద్భుతంగా ఆడారు. బౌలింగ్‌లో జాకబ్ డఫీ 3 వికెట్లతో మెరిశాడు. అయితే, క్లాసెన్ లాంటి పవర్‌ఫుల్ బ్యాటర్ గనుక క్రీజులో ఉండి ఉంటే హైదరాబాద్ స్కోరు ఇంకా భారీగా ఉండేదని, అప్పుడు మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ఎస్ఆర్‌హెచ్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us