AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీప్లేస్‌మెంట్ ప్లేయర్లుగా ఎంట్రీ.. కట్‌చేస్తే.. వచ్చే ఏడాది ఫ్రాంచైజీల బ్రహ్మాస్త్రాలు వీళ్లే..?

IPL 2027: ఐపీఎల్ వేలం, రిటెన్షన్ వ్యూహాలు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయి. కేవలం రిప్లేస్‌మెంట్‌లుగా వచ్చి బెంచ్‌కే పరిమితమైనప్పటికీ, ఈ ముగ్గురు యువ ఆటగాళ్లలోని ప్రతిభ, ఆయా ఫ్రాంచైజీల ప్రస్తుత అవసరాలు చూస్తుంటే.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో వీరు తమ పాత జట్ల తరఫున మైదానంలో దుమ్మురేపడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

రీప్లేస్‌మెంట్ ప్లేయర్లుగా ఎంట్రీ.. కట్‌చేస్తే.. వచ్చే ఏడాది ఫ్రాంచైజీల బ్రహ్మాస్త్రాలు వీళ్లే..?
Ipl 2026 Replacements
Venkata Chari
|

Updated on: Jun 03, 2026 | 1:15 PM

Share

IPL 2026 Replacements: ఐపీఎల్ 2026 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విశ్వవిజేతగా నిలవడంతో ఘనంగా ముగిసింది. అయితే, ఈ రెండు నెలల క్రికెట్ పండుగలో పరుగుల సునామీతో పాటు ఆటగాళ్ల గాయాలు కూడా ఫ్రాంచైజీలను తీవ్రంగా కలవరపెట్టాయి. ఈ నేపథ్యంలోనే లక్కు కలిసి వచ్చి రిప్లేస్‌మెంట్ ఆటగాళ్లుగా ఎంట్రీ ఇచ్చి, వచ్చే సీజన్‌లోనూ జట్లలో కొనసాగే అవకాశం ఉన్న ఆ ముగ్గురు విదేశీ స్టార్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

గాయాల బెడద.. ఐపీఎల్‌లో రిప్లేస్‌మెంట్ల హవా..

గత సీజన్‌లో గాయాల సమస్య దాదాపు అన్ని జట్లను వేధించింది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ సమస్యతో తీవ్రంగా నష్టపోగా, మిగిలిన ఫ్రాంచైజీలు కూడా కీలక ఆటగాళ్లను కోల్పోయాయి. ఆ సమయంలో జట్లు అత్యవసరంగా జట్టులోకి తెచ్చుకున్న కొందరు ఆటగాళ్లు, మ్యాచ్‌లు ఆడే అవకాశం రాకపోయినా తమకున్న నైపుణ్యంతో ఫ్రాంచైజీల భవిష్యత్తు ప్రణాళికల్లో భాగస్వామ్యులయ్యేలా కనిపిస్తున్నారు. వచ్చే మెగా వేలం లేదా రిటెన్షన్ ప్రక్రియలో ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని ఉంచుకోవచ్చో విశ్లేషిద్దాం.

1) రెహాన్ అహ్మద్ (ఢిల్లీ క్యాపిటల్స్): ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ టెస్ట్ క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి షాక్ తింది. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సిన డకెట్ దూరం కావడంతో, ఢిల్లీ యాజమాన్యం అనూహ్యంగా ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ రెహాన్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకుంది. గత సీజన్‌లో ఇతనికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: బీసీసీఐ డేంజరస్ నిర్ణయం.. ఆ జోడీతో ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్.. ఇకపై టార్గెట్ పవర్ ప్లేలోనే ఫినిష్..!

అయినప్పటికీ వచ్చే సీజన్‌లో ఢిల్లీకి ఇతను వజ్రాయుధంగా మారే అవకాశం ఉంది. గత సీజన్‌లో ఢిల్లీ స్పిన్ విభాగం పూర్తిగా విఫలమైంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఆశించిన స్థాయిలో రాణించకపోగా, కుల్దీప్‌ను కొన్ని మ్యాచ్‌ల్లో పక్కన కూడా పెట్టారు. ఒకవేళ వచ్చే సీజన్ కంటే ముందే కుల్దీప్‌ను ఢిల్లీ వదులుకుంటే, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి రెహాన్ అహ్మద్ సరైన ప్రత్యామ్నాయం. మిడిల్ ఓవర్లలో అద్భుతమైన లెగ్ స్పిన్‌తో పాటు, చివరి ఓవర్లలో భారీ షాట్లు ఆడగల సామర్థ్యం ఇతనికి అదనపు బలం.

2) బ్లెస్సింగ్ ముజారబానీ (కోల్‌కతా నైట్ రైడర్స్): బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి వచ్చాడు. అతనికి కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే అవకాశం లభించినప్పటికీ, 4 వికెట్లు పడగొట్టి తనలోని ప్రతిభను నిరూపించుకున్నాడు. ఎకానమీ కొంచెం ఎక్కువగా ఉన్నా, వికెట్లు తీసే నైపుణ్యం ఇతని సొంతం.

కోల్‌కతా ఫ్రాంచైజీ వచ్చే సీజన్ కోసం ముజారబానీని ఖచ్చితంగా జట్టులోనే ఉంచుకోవాలి. ఎందుకంటే వారి ప్రధాన విదేశీ పేసర్ మతీష పతిరాన తరచూ గాయాల బారిన పడుతున్నాడు. గత సీజన్‌లో కనీసం ఒక పూర్తి మ్యాచ్ కూడా ఆడకుండానే పతిరాన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ముజారబానీని కూడా వదులుకుంటే కేకేఆర్ వద్ద నాణ్యమైన విదేశీ ఫాస్ట్ బౌలర్ ఉండడు. వేలంలో భారీ ధర పలికే ఇతర పేసర్ల వెనుక పరిగెత్తే కంటే, ముజారబానీని జట్టులోనే ఉంచి సానబెట్టడం కోల్‌కతాకు ఎంతో ప్రయోజనకరం.

ఇది కూడా చదవండి: ఆ అవార్డు వైభవ్‌ది కాదు.. అసలైన అర్హుడు ఆయనే.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

3) కానర్ ఎస్టర్‌హుయిజెన్ (గుజరాత్ టైటాన్స్): టామ్ బాంటన్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ దక్షిణాఫ్రికా ఎదుగుతున్న యువ కిరణం కానర్ ఎస్టర్‌హుయిజెన్‌ను ఎంపిక చేసుకుంది. గత సీజన్ రన్నరప్ గుజరాత్ జట్టులో ఇతనికి ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ రాలేదు. అయితే గుజరాత్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యాలను గమనిస్తే, రాబోయే రోజుల్లో ఇతని అవసరం జట్టుకు ఎంతైనా ఉంది.

దక్షిణాఫ్రికా దేశీవాళీ టీ20ల్లో 44 మ్యాచ్‌లు ఆడిన కానర్, 129.87 స్ట్రైక్ రేట్‌తో 926 పరుగులు చేశాడు. గణాంకాలు సాధారణంగా కనిపించినా, క్రీజులో స్థిరపడితే విధ్వంసం సృష్టించగల సత్తా ఇతనికి ఉంది. గత సీజన్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో గుజరాత్ అతడిని విడుదల చేసే అవకాశం ఉంది. ఫిలిప్స్ వదిలివెళ్లే మిడిల్ ఆర్డర్ బాధ్యతలను కానర్ అద్భుతంగా భర్తీ చేయగలడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us