RCB Vs PBKS: ఆ పిచ్చోడ్ని RCB జెర్సీలో ఆపలేం.. రాసిపెట్టుకో.! కోహ్లీ కోసం కొండమీద కోతినైనా తెస్తాడు
వాడొక పిచ్చోడు.. ఆర్సీబీ కోసం ట్రోఫీ మాత్రమే కాదు.. కోహ్లీ కోసం కొండమీద కోతినైనా తీసుకొస్తాడు. బెంగళూరు జెర్సీ వేస్తేనే చెలరేగి మరీ ఆడుతున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు.? ఐపీఎల్ 2025లో ఎలాంటి అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు.. ఇప్పుడు తెలుసుకుందామా..

ఐపీఎల్ 18 సీజనలలోనూ ఎంతోమంది ప్లేయర్లు.. ఎన్నో ఫ్రాంచైజీలు మారారు. మెగా వేలంలో ఇటునుంచి అటు.. అటునుంచి ఇటు మారిన ప్లేయర్స్ ఎందరో ఉన్నారు. కానీ కొందరు ప్లేయర్స్‌కి కొన్ని జెర్సీలే కసిని పెంచుతాయ్. ఆ కోవకు చెందిన ఓ ప్లేయర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అది మరెవరో కాదు దేవదుత్ పడిక్కల్. 2020లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పడిక్కల్.. మొదటి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 15 మ్యాచ్‌లలో 473 పరుగులు చేశాడు. ఆరంభంలోనే అదరగొట్టిన పడిక్కల్.. ఆ సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నాడు.
ఇక 2021లో కూడా పడిక్కల్ 400+ స్కోర్ చేయడమే కాకుండా.. రాజస్థాన్ రాయల్స్‌పై తన తొలి సెంచరీని నమోదు చేశాడు. అలాగే అదే ఏడాది శ్రీలంకతో టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. అయితే ఈ ఆనందం పడిక్కల్‌కు ఎక్కువసేపు నిలవలేదు. 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడ్ని విడిచిపెట్టాక.. రాజస్థాన్ రాయల్స్ రూ. 7.75 కోట్లకు కొనుగోలు చేసింది. 2022, 2023లో కలిపి కేవలం 637 పరుగులు మాత్రమే చేసిన పడిక్కల్.. తన ఫామ్ కోల్పోయాడు. ఆ తర్వాత 2024లో లక్నో సూపర్ జెయింట్స్ మెగా వేలంలో పడిక్కల్‌ను కొనుగోలు చేయగా.. బ్యాట్‌తో అట్టర్ ప్లాప్ అయ్యాడు.
ఇప్పుడు మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ పడిక్కల్‌ను మెగా ఆక్షన్‌లో కొనుగోలు చేయడంతో మళ్లీ తన సత్తా చాటుతున్నాడు. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగులు చేసి అదరగొట్టాడు. RCB నెంబర్ 3 స్థానాన్ని భర్తీ చేశాడు. 10, 27, 4, 37, 4, 40, 61.. ఏడు అవుటింగ్స్‌లో నాలుగింట మంచి స్కోర్లు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ ఒక ఎండ్‌లో ఉంటే.. తనకు మాంచి బలాన్ని ఇస్తుంది అని పడిక్కల్ ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో చెప్పాడు. రాసిపెట్టుకోండి.! ఈ పిచ్చోడు కోహ్లీ కోసం RCBకి ట్రోఫీని కూడా తెచ్చేస్తాడని బెంగళూరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
High-🖐️ with the awards last evening, and our boys thoroughly deserved it! 🙌#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #PBKSvRCB pic.twitter.com/JPPR54oARv
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 21, 2025




