AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఇప్పటికీ చెన్నై ప్లే ఆఫ్స్ చేరుకునే ఛాన్స్.. ఇలా జరగాల్సిందే..

Can CSK Still Qualify For Playoffs After Loss To Mumbai Indians?: ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్.. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకునేందుకు సిద్ధమైంది.

IPL 2025: ఇప్పటికీ చెన్నై ప్లే ఆఫ్స్ చేరుకునే ఛాన్స్.. ఇలా జరగాల్సిందే..
Csk Team
Venkata Chari
|

Updated on: Apr 21, 2025 | 10:02 AM

Share

Can CSK Still Qualify For Playoffs After Loss To Mumbai Indians?: ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. కీలక మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడంతో.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. అయితే, ధోని సేన ప్లే ఆఫ్స్ చేరుకునే ఛాన్స్ ఉందా, ఏం చేస్తే తదుపరి రౌండ్‌కు చేరుకుంటుందో వివరంగా తెలుసుకుందాం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో CSKకి ఇది ఆరో ఓటమి. ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు పాయింట్లతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

ఇది కూడా చదవండి: ఒరేయ్, ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌గా నిలిచి.. ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?

ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే?

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బెంగళూరు ఇంకా పోటీ నుంచి నిష్క్రమించలేదు. గత సీజన్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే, దీనికి బలమైన నెట్ రన్ రేట్ అవసరం. లీగ్ 10 జట్లకు విస్తరించిన తర్వాత ఒక జట్టు 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి.

ఇది కూడా చదవండి: సెంచరీతో తొడ కొట్టిన SRH ప్లేయర్.. కట్‌చేస్తే.. నిషేధానికి సిద్ధమైన బీసీసీఐ.. కారణం ఏంటంటే?

మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో 16 పాయింట్లు చేరగలవు. ఇలా జరిగితేనే ధోనిసేన ప్లేఆఫ్‌లకు చేరుకుంటుంది. ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు తన నెట్ రన్ రేట్‌ను మెరుగుపరచుకోవడానికి భారీ తేడాతో మిగిలిని మ్యాచ్‌లను గెలవాల్స ఉంటుంది.

IPL 2025 పాయింట్ల పట్టికను ఇక్కడ చూడండి..

జట్టు ఆడింది గెలిచింది ఓడిపోయినవి నెట్ రన్ రేట్ పాయింట్లు
1. గుజరాత్ టైటాన్స్ 7 5 2 0.984 10
2. ఢిల్లీ క్యాపిటల్స్ 7 5 2 0.589 10
3. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 5 3 0.472 10
4. పంజాబ్ కింగ్స్ 8 5 3 0.177 10
5. లక్నో సూపర్ జెయింట్స్ 8 5 3 0.088 10
6. ముంబై ఇండియన్స్ 8 4 4 0.483 8
7. కోల్‌కతా నైట్ రైడర్స్ 7 3 3 0.547 6
8. రాజస్థాన్ రాయల్స్ 8 2 6 -0.633 4
9. సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 2 5 -1.217 4
10. చెన్నై సూపర్ కింగ్స్ 8 2 6 -1.392 4

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..