RCB vs KKR, IPL 2024: దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders: కింగ్ కోహ్లీ మళ్లీ అదరగొట్టాడు. హౌమ్ గ్రౌండ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో స్ఫూర్తి దాయక ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ ల సహాయంతో 83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివర్లో దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 20, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders: కింగ్ కోహ్లీ మళ్లీ అదరగొట్టాడు. హౌమ్ గ్రౌండ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో స్ఫూర్తి దాయక ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ ల సహాయంతో 83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివర్లో దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 20, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కామెరూన్ గ్రీన్ (33), గ్లెన్ మ్యాక్స్ వెల్ (28), డుప్లెసిస్ (8), రజత్ పటిదార్(3), అనూజ్ రావత్(3) నిరాశపర్చారు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్ తలా 2 వికెట్లు పడగొట్టగా, సునీల్ నరైన్ ఒక వికెట్ తీశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు శుభారంభం లభించలేదు. కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ వికెట్ రూపంలో తొలి షాక్ తగిలింది. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫాఫ్ డు ప్లెసిస్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చినా కామెరూన్ గ్రీన్ ధాటిగానే ఆడినా క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయాడు.గ్రీన్, విరాట్ కోహ్లీ రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత విరాట్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ జోడీ 40 పరుగులు జోడించారు.
కాగా విరాట్ కోహ్లీ 59 బంతుల్లో అజేయంగా 83 పరుగులు చేశాడు. ఆఖరిలో దినేష్ కార్తీక్ 3 సిక్సర్లు బాది 8 బంతుల్లో 20 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆండ్రీ రస్సెల్ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్ నిజంగా RCB రన్ రేట్‌ను తగ్గించింది. అయితే 24 కోట్లు వెచ్చించిన మిచెల్ స్టార్క్ కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లోనూ వికెట్ తీయలేకపోయాడు. హర్షిత్ రాణా 2 వికెట్లు, ఆండ్రీ రస్సెల్ 2 వికెట్లు, సునీల్ నరైన్ ఒక వికెట్ తీశారు.
TAKE A BOW, VIRAT KOHLI…!!!! 🐐
83* (59) with 4 fours and 4 sixes – on a slow pitch, the king held one end well and played a terrific knock. The GOAT steps up once again for RCB. 👊 pic.twitter.com/1GmVcDFl41
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2024
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రమణదీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..