IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ముందుగానే ఐపీఎల్ 2024.. తొలి, ఫైనల్ మ్యాచ్‌లు ఎప్పుడంటే?
IPL 2024: వచ్చే ఏడాది భారత్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇది ఐపీఎల్ షెడ్యూల్‌పై కూడా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. దీంతో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, అన్నీ సవ్యంగా జరిగితే IPL 2024 మార్చి 22 నుంచి మే చివరి వరకు నిర్వహించనున్నారు. BCCI IPL 2024 కి విండోను ఫిక్స్ చేసింది. బిడ్డింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత, షెడ్యూల్ సంబంధిత సన్నాహాలు ప్రారంభమవుతాయి.

2024లో జరగనున్న 17వ IPL సీజన్ కోసం మినీ వేలం నేడు డిసెంబర్ 19న దుబాయ్‌లో జరుగుతోంది. ఇంతలో, ఐపీఎల్ తదుపరి ఎడిషన్ ప్రారంభం గురించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. నివేదిక ప్రకారం, ఐపీఎల్ 17 వ ఎడిషన్ మార్చి 22 నుంచి మే చివరి వరకు అంటే మే 29 వరకు ప్రారంభమవుతుంది. జూన్‌లో జరగనున్న ICC T20 వరల్డ్ కప్ (T20 World Cup 2024)ను దృష్టిలో ఉంచుకుని, ఈ IPLని ముందుగానే ముగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మే 29న ఫైనల్..
వచ్చే ఏడాది భారత్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇది ఐపీఎల్ షెడ్యూల్‌పై కూడా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. దీంతో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, అన్నీ సవ్యంగా జరిగితే IPL 2024 మార్చి 22 నుంచి మే చివరి వరకు నిర్వహించనున్నారు. BCCI IPL 2024 కి విండోను ఫిక్స్ చేసింది. బిడ్డింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత, షెడ్యూల్ సంబంధిత సన్నాహాలు ప్రారంభమవుతాయి.
ఐపీఎల్ మనీ వేలం 2024 లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మినీ వేలంలో 333 మంది ఆటగాళ్లు..
ఐపీఎల్ మినీ వేలం గురించి మాట్లాడితే, తొలిసారిగా ఐపీఎల్ 2024 వేలం విదేశాల్లో జరగనుంది. దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో వేలం జరగనుంది. వేలం కోసం 1000 మందికి పైగా ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత 333 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేశారు. అన్ని జట్ల ఖాళీ స్లాట్‌లను కలిపి చూస్తే 77 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేశారు. ఇందులో 30 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
వేలం నిర్వహించే వ్యక్తి కూడా మారిపోయాడు..
పురుషుల ఐపీఎల్ వేలంలో మహిళా వేలం నిర్వాహకులు ఆటగాళ్లను వేలం వేయడం ఇదే తొలిసారి. దీనికి ముందు, హ్యూస్ ఎడ్మీడ్స్ ఆటగాడి వేలం నిర్వాహకుడిగా కనిపించాడు. 2021 వేలం సమయంలో హ్యూస్ ఎడ్మీడ్స్ వేదికపై కుప్పకూలిపోయాడు. కాబట్టి, అతనికి బదులుగా మరొకరు వేలం నిర్వహించారు. అయితే, ఈసారి ఆయన స్థానంలో మల్లికా సాగర్ వచ్చింది. మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో మల్లికా ఇంతకు ముందు రెండుసార్లు ఈ పాత్రను పోషించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..