IPL Auction 2024 Highlights: ముగిసిన ఐపీఎల్ 2024 మినీ వేలం.. టాప్-5 ధర పలికిన ఆటగాళ్లు వీరే..
2024 IPL Auction Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలం ముగిసింది. సుమారు 8 గంటల పాటు సాగిన ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఆధిపత్యం సాగించారు. మిచెల్ స్టార్క్ ఏకంగా రూ.24.75 కోట్లు పలికితే.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏకంగా రూ. 20 కోట్లకు అమ్ముడుపోయాడు.చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో సహా మొత్తం 10 జట్లు కొద్దిరోజుల క్రితం తమ రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.

IPL 2024 Auction Highlights in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలం ముగిసింది. సుమారు 8 గంటల పాటు సాగిన ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఆధిపత్యం సాగించారు. మిచెల్ స్టార్క్ ఏకంగా రూ.24.75 కోట్లు పలికితే.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏకంగా రూ. 20 కోట్లకు అమ్ముడుపోయాడు. కాగా ఐపీఎల్ వేలం విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి. ఈసారి దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ క్రీడాకారుల మేళాకు మొత్తం 10 టీమ్‌లు పూర్తిగా సిద్ధమయ్యాయి. అయితే, ఈ వేలంలో కోట్లు దక్కించుకునే ప్లేయర్ ఎవరనేది మరికొద్దిసేపట్లో తేలనుంది. ఇది కూడా ప్రత్యేకమైనది. ఎందుకంటే త్వరలో T20 ప్రపంచ కప్ రాబోతోంది. ఇటువంటి పరిస్థితిలో, ప్రతి దేశం తన యువ ఆటగాళ్లపై దృష్టి పెడుతుంది.
ఈ వేలంలో, అభిమానులు ప్రత్యక్ష వేలాన్ని చూసే అవకాశాన్ని పొందుతారు. కోకాకోలా ఎరీనాలో జరుగుతున్న ఈ వేలానికి అభిమానులను అనుమతించారు. ఐపీఎల్ వేలంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఐపీఎల్ వేలం కూడా తొలిసారిగా భారత్ వెలుపల జరుగుతోంది. ఈ వేలం దుబాయ్‌లో జరుగుతోంది.
LIVE NEWS & UPDATES
-
ముగిసిన ఐపీఎల్ 2024 మినీ వేలం..
సుమారు 8 గంటల పాటు కొనసాగిన IPL 2024 మినీ వేలం ముగిసింది. ఈసారి ఖాళీగా ఉన్న 77 స్లాట్‌లలో 72 భర్తీ చేయగా, అన్ని జట్లు కలిపి రూ.230.45 కోట్లు ఖర్చు చేశాయి.
-
షకీబ్ కు రూ. 20 లక్షలు
దక్షిణాఫ్రికా ఆటగాడు నాంద్రే బెర్గర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 50 లక్షల ప్రాథమిక ధరకు కొనుగోలు చేసింది.
20 లక్షలకు షకీబ్ హుస్సేన్‌ను KKR కొనుగోలు చేసింది..
-
-
అన్ క్యాప్డ్ ప్లేయర్ల ధరల వివరాలివే..
- అన్‌క్యాప్డ్ ఆటగాడు స్వస్తిక్ చికారాను ఢిల్లీ బేస్ ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
- రాజస్థాన్ అబిద్ ముస్తాక్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
- 20 లక్షల బేస్ ప్రైస్‌తో స్వప్నిల్ సింగ్‌ను RCB కొనుగోలు చేసింది.
- శివాలిక్ శర్మను MI 20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది.
- 20 లక్షలకు అవినాష్ రావును చెన్నై కొనుగోలు చేసింది
-
వేలంలో భారీ ధర పలికిన ఆటగాళ్లు వీరే..
- అఫ్గానిస్థాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌ను కోల్‌కతా బేస్ ధర రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
- అర్షద్ ఖాన్‌ను లక్నో రూ. 20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది.
- ముంబై ఇండియన్స్ ఆఫ్ఘనిస్థాన్ అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ మహ్మద్ నబీని రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది.
- గుస్ అట్కిన్సన్‌ను KKR మూల ధర రూ. 1 కోటికి కొనుగోలు చేసింది.
-
కోహ్లీ టీమ్ లోకి న్యూజిలాండ్ స్టార్ పేసర్
న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బేస్ ధర రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
-
-
పంజాబ్ లోకి సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రిలే రస్సోను పంజాబ్ కింగ్స్ 8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. మొదటి దశ వేలంలో రూసోను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు..
-
కోల్ కతాలోకి మనీష్ పాండే
టీమిండియా ఆటగాడు మనీశ్ పాండేకు ఐపీఎల్ వేలంలో నిరాశే ఎదురైంది. అతనిని సొంతం చేసుకునేందుకు ఏ జట్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే చివరకు కోల్ కతా బేస్ ధర రూ. 50 లక్షలకు మనీశ్ పాండేను కొనుగోలు చేసింది.
-
Accelerated IPL 2024 Auction: స్పీడ్ వేలం వివరాలు.. పార్ట్-2
తనయ్ త్యాగరాజన్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – పంజాబ్ కింగ్స్ రూ. రూ. 20 లక్షలు
జి. అజితేష్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్..
గౌరవ్ చౌదరి – బేస్ ధర: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్..
రాబిన్ మింజ్ – బేస్ ధర: రూ. 20 లక్షలు – గుజరాత్ టైటాన్స్ రూ. రూ. 3.60 కోట్లు
బిపిన్ సౌరభ్ – బేస్ ధర: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్..
కె.ఎం. ఆసిఫ్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్..
సాకిబ్ హుస్సేన్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్..
మహ్మద్ కైఫ్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్..
అభిలాష్ శెట్టి – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్..
గుర్జప్నీత్ సింగ్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్..
పృథ్వీ రాజ్ యర్రా – బేస్ ధర: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్..
శుభమ్ అగర్వాల్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్..
ప్రిన్స్ చౌదరి – బేస్ ధర: రూ. 20 లక్షలు – పంజాబ్ కింగ్స్ రూ. రూ. 20 లక్షలు
ఝాతవేద్ సుబ్రమణ్యన్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. రూ. 20 లక్షలు
-
Accelerated IPL 2024 Auction: స్పీడ్ వేలం వివరాలు..
ఫిన్ అలెన్ – బేస్ ధర: రూ. 75 లక్షలు – అన్ సోల్డ్
కోలిన్ మున్రో – బేస్ ధర: రూ. 1.5 కోట్లు – అన్ సోల్డ్
షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ – బేస్ ప్రైస్: రూ. 1.5 కోట్లు -రూ. 1.5 కోట్లకు KKR
అష్టన్ అగర్ – బేస్ ధర: రూ. 1.00 కోట్లు – రూ.1.00 కోట్లకు LSG
రాస్సీ వాన్ డెర్ డస్సెన్ – బేస్ ధర: రూ. 2.00 కోట్లు – అన్‌సోల్డ్
ఖైస్ అహమద్ – బేస్ ప్రైస్: రూ. 50 లక్షలు – అన్ సోల్డ్
మైఖేల్ బ్రేస్‌వెల్ – బేస్ ప్రైస్: రూ. 1 కోటి – అన్ సోల్డ్
టామ్ కర్రాన్ – బేస్ ధర: రూ. 1.5 కోట్లు – RCB రూ. రూ. 1.5 కోట్లు
జేమ్స్ నీషమ్ – బేస్ ప్రైస్: రూ. 1.50 కోట్లు – అన్ సోల్డ్
కీమో పాల్ – బేస్ ప్రైస్: రూ. 75 లక్షలు – అన్ సోల్డ్
ఓడియన్ స్మిత్ – బేస్ ప్రైస్: రూ. 50 లక్షలు – అన్ సోల్డ్
డేవిడ్ విల్లీ – బేస్ ధర: రూ. 2.00 కోట్లు – రూ.2.00 కోట్లకు ఎల్‌ఎస్‌జి కొనుగోలు..
షాయ్ హోప్ – బేస్ ప్రైస్: రూ. 75 లక్షలు – అన్ సోల్డ్
దుష్మంత చమీర – బేస్ ప్రైస్: రూ. 50 లక్షలు – అన్ సోల్డ్
బెన్ ద్వార్షియస్ – బేస్ ధర: రూ. 50 లక్షలు – అన్ సోల్డ్
మాట్ హెన్రీ – బేస్ ధర: రూ. 75 లక్షలు – అన్ సోల్డ్
కైల్ జేమీసన్ – బేస్ ప్రైస్: రూ. 1 కోటి – అన్ సోల్డ్
స్పెన్సర్ జాన్సన్ – బేస్ ధర: రూ. 50 లక్షలు – గుజరాత్ టైటాన్స్‌కు రూ. 10.00 కోట్లు
టైమల్ మిల్స్ – బేస్ ధర: రూ. 1.50 కోట్లు – అన్ సోల్డ్
ఆడమ్ మిల్నే – బేస్ ధర: రూ. 1.00 కోట్లు – అన్ సోల్డ్
లాన్స్ మోరిస్ – బేస్ ధర: రూ. 75 లక్షలు – అన్ సోల్డ్
ముస్తాఫిజుర్ రెహమాన్ – బేస్ ప్రైస్: రూ. 2.00 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2.00 కోట్లకు కొనుగోలు.
ఝే రిచర్డ్‌సన్ – బేస్ ప్రైస్: రూ. 1.50 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 5.00 కోట్లకు కొనుగోలు..
నువాన్ తుషార – బేస్ ప్రైస్: రూ. 50 లక్షలు – ముంబై ఇండియన్స్ రూ. 4.80 కోట్లకు కొనుగోలు..
సందీప్ వారియర్ – బేస్ ధర: రూ. 50 లక్షలు – అన్ సోల్డ్
ల్యూక్ వుడ్ – బేస్ ప్రైస్: రూ. 50 లక్షలు – అన్ సోల్డ్
స్వస్తిక్ చికారా – బేస్ ధర: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్
రితిక్ ఈశ్వరన్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్
హిమ్మత్ సింగ్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్
శశాంక్ సింగ్ – బేస్ ధర: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్
సుమీత్ వర్మ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్
నమన్ ధీర్ – బేస్ ధర: రూ. 20 లక్షలు – ముంబై ఇండియన్స్‌కు రూ. 20 లక్షలు
అన్షుల్ కాంబోజ్ – బేస్ ధర: రూ. 20 లక్షలు – ముంబై ఇండియన్స్‌కు రూ. 20 లక్షలు
తనుష్ కోటియన్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్
సుమిత్ కుమార్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. రూ. 1.00 కోట్లు
కమలేష్ నాగర్కోటి – బేస్ ధర: రూ. 30 లక్షలు – అన్ సోల్డ్
ప్రదోష్ రంజన్ పాల్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్
రోహిత్ రాయుడు – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – అన్ సోల్డ్
అశుతోష్ శర్మ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – పంజాబ్ కింగ్స్ రూ. రూ. 20 లక్షలు
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ – బేస్ ప్రైస్: రూ. 20 లక్షలు – పంజాబ్ కింగ్స్ రూ. రూ. 20 లక్షలు
శశాంక్ సింగ్ – బేస్ ధర: రూ. 20 లక్షలు – పంజాబ్ కింగ్స్ రూ. రూ. 20 లక్షలు
-
IPL Auction: స్పెన్సర్ జాన్సన్‌కు లక్కీ ఛాన్స్..
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ మధ్య హోరాహోరీ బిడ్డింగ్ జరిగింది. స్పెన్సర్ జాన్సన్ బేస్ ధర రూ.50 లక్షలు కగా, గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ.10 కోట్లకు దక్కించుకుంది.
-
స్పీడ్ వేలంలో ప్లేయర్లు..
ఫిన్ అలెన్
అలిక్ అథానాజ్
మార్క్ చాప్మన్
శామ్యూల్ హైన్
రీజా హెండ్రిక్స్
బ్రాండన్ కింగ్
కోలిన్ మున్రో
షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్
అష్టన్ టర్నర్
రాస్సీ వాన్ డెర్ డస్సెన్
జేమ్స్ విన్స్
ఇబ్రహీం జద్రాన్
నజీబుల్లా జద్రాన్
-
అమ్ముడైన అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్లు..
ఆటగాడు ధర జట్టు అర్షిన్ కులకర్ణి 20 లక్షలు LSG షారుఖ్ ఖాన్ 7.4 కోట్లు GT రమణదీప్ సింగ్ 20 లక్షలు KKR -
అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్..
ఆటగాడు ధర జట్టు టామ్ కోహ్లర్-కాడ్మోర్ 40 లక్షలు రాజస్థాన్ రాయల్స్ రికీ భుయ్ 20 లక్షలు ఢిల్లీ రాజధానులు కుమార్ కుశాగ్రా 7.20 కోట్లు ఢిల్లీ రాజధానులు యశ్ దయాళ్ 5 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సుశాంత్ మిశ్రా 2.20 కోట్లు గుజరాత్ టైటాన్స్ ఆకాష్ సింగ్ 20 లక్షలు సన్‌రైజర్స్ హైదరాబాద్ కార్తీక్ త్యాగి 60 లక్షలు గుజరాత్ టైటాన్స్ రాసిఖ్ దార్ 20 ఎల్ ఢిల్లీ రాజధానులు -
IPL 2024 Auction: గుజరాత్ జట్టులోకి షారుక్ ఖాన్
షారుక్ ఖాన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.7.40 కోట్లకు కొనుగోలు చేసింది.
-
వేలంలో ఊహించని ప్రైస్ పొందిన అన్ క్యాప్డ్ బ్యాటర్స్..
ఆటగాడు ధర జట్టు శుభమ్ దూబే 5.8 కోట్లు RR సమీర్ రిజ్వీ 8.4 కోట్లు CSK అంగ్క్రిష్ రఘువంశీ 20 లక్షలు KKR -
చెన్నై జట్టులోకి యూపీ కుర్రాడు..
యూపీ బ్యాటర్ సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్ ఓ దశలో పోటీ పడినా.. చివరకు సీఎస్‌కే రూ.8.40 కోట్లకు దక్కించుకుంది.
-
IPL 2024 Auction: ఊహించని ధర పొందిన శిభమ్ దూబే..
రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన శిభమ్ దూబే కోసం హోరోహోరీ పోరు జరిగింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ టీం రూ.5.80 కోట్లకు దక్కించుకుంది.
-
IPL Auction Live: ఆస్ట్రేలియా ఆటగాళ్లపై రూ.50 కోట్ల వర్షం..
ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై భారీగా డబ్బుల వర్షం కురిసింది. కేవలం ముగ్గురు ఆటగాళ్లపైనే రూ.50 కోట్లకు పైగా ఫ్రాంచైజీలు ఖర్చు చేశాయి.
- మిచెల్ స్టార్క్- 24.75 కోట్లు (KKR)
- పాట్ కమిన్స్- 20.50 కోట్లు (SRH)
- ట్రావిస్ హెడ్- 6.80 కోట్లు (SRH)
-
సెట్ 5 తర్వాత అన్నిజట్లలో మిగిలిన ఖాళీలు..
CSK – 3DC – 7
GT – 6
KKR – 9
LSG – 5
MI – 6
PBKS – 6
RCB – 5
RR – 7
SRH – 2
(25లో మిగిలి ఉన్న స్లాట్‌లు)
-
సెట్ 5 తర్వాత అన్ని జట్లకు మిగిలిన పర్స్..
CSK – ఖర్చు: 19.80 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 11.60 కోట్లుDC – ఖర్చు: 4.00 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 24.95 కోట్లు
GT – ఖర్చు: 6.30 Cr | మిగిలి ఉన్న పర్స్: 31.85 కోట్లు
KKR – ఖర్చు: 25.75 | మిగిలి ఉన్న పర్స్: 6.95 కోట్లు
LSG – ఖర్చు: 6.40 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 6.75 కోట్లు
MI – ఖర్చు: 9.60 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 8.15 కోట్లు
PBKS – ఖర్చు: 15.95 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 13.15 కోట్లు
RCB – ఖర్చు: 11.50 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 11.75 కోట్లు
RR- ఖర్చు: 7.40 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 7.10 కోట్లు
SRH – ఖర్చు: 30.40 | మిగిలి ఉన్న పర్స్: 3.60 కోట్లు
-
IPL 2023 Auction Live: స్పిన్నర్లపై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు..
స్పిన్నర్లపై ఏ ఫ్రాంచైజీ కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు.
మహ్మద్ వకార్- ఆఫ్ఘనిస్తాన్
ఆదిల్ రషీద్- ఇంగ్లండ్
అకేల్ హొస్సేన్- వెస్టిండీస్
ఇష్ సోధి- న్యూజిలాండ్
ముజీబ్ ఉర్ రెహమాన్- ఆఫ్ఘనిస్తాన్
తబ్రేజ్ షమ్సీ- దక్షిణాఫ్రికా
-
ఫాస్ట్ బౌలర్ల వేలంలో రికార్డులు బ్రేక్..
ఆటగాడు ధర జట్టు లాకీ ఫెర్గూసన్ అమ్ముడుపోలేదు చేతన్ సకారియా 50 లక్షలు కోల్‌కతా నైట్ రైడర్స్ అల్జారీ జోసెఫ్ 11.50 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమేష్ యాదవ్ 5.80 కోట్లు గుజరాత్ టైటాన్స్ శివం మావి 6.40 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్ మిచెల్ స్టార్క్ 24.75 కోట్లు కోల్‌కతా నైట్ రైడర్స్ జోష్ హాజిల్‌వుడ్ అమ్ముడుపోలేదు జయదేవ్ ఉనద్కత్ 1.60 కోట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ దిల్షాన్ మధుశంక 4.60 కోట్లు ముంబై ఇండియన్స్ -
SRH IPL 2024 Auction: సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటిక టీమిండియా బౌలర్..
జయదేవ్ ఉనద్కత్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ వేలాన్ని ప్రారంభించాయి. బేస్ ధర రూ.50 లక్షలతో మొదలై.. రూ. 1.60 కోట్లకు చేరింది. ఇదే ధరకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
-
ముంబై చెంతకు లంక బౌలర్..
దిల్షాన్ మధుశంక కోసం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ పోరాడాయి. చివరకు ఈ లంక బౌలర్‌ను ముంబై రూ. 4.60 కోట్లకు దక్కించుకుది.
-
కోల్‌కతా చెంతకు ఐపీఎల్ అత్యంత ఖరీదైన ప్లేయర్..
మిచెట్ స్టార్క్ ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా మారాడు. రూ.24.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది.
-
వేలంలో అమ్ముడైన వికెట్ కీపర్లు..
ఆటగాడు ధర జట్టు ఫిల్ ఉప్పు అమ్ముడుపోలేదు ట్రిస్టన్ స్టబ్స్ 50 లక్షలు ఢిల్లీ క్యాపిటల్స్ KS భరత్ 50 లక్షలు కోల్‌కతా నైట్ రైడర్స్ జోష్ ఇంగ్లిస్ అమ్ముడుపోలేదు కుసాల్ మెండిస్ అమ్ముడుపోలేదు -
గుజరాత్ చేరిన ఉమేష్ యాదవ్..
ఉమేష్ యాదవ్ గుజరాత్ గూటికి చేరాడు. రూ. 2.00 కోట్ల ధరతో వేలంలో వచ్చిన ఉమేష్.. ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ పోటీపడినా.. రూ. 5.80 కోట్లకు గుజరాత్ టీం దక్కించుకుంది. -
అల్జారీ జోసెఫ్ కోసం పోటాపోటీ..
వెస్టిండీస్ బౌలర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ హోరాహోరీగా పోటీపడ్డాయి. అయితే రూ. 5.00 కోట్లతో లక్నో సూపర్ జెయింట్ రేసులో చేరింది. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 6.80 కోట్ల నుంచి రూ. 11.50 కోట్లకు తీసుకెళ్లింది. దీంతో ఆర్‌సీబీ రూ.11.50 కోట్లకు దక్కించుకుంది. -
కోల్‌కతాకు చేరిన చేతన సకారియా..
చేతన్ సకారియాను – కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. రూ. 50 లక్షలకు దక్కించుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ బేస్ ధరకే ఈ పేసర్‌ను దక్కించుకుంది. -
రెండవ సెట్‌లో అమ్ముడైన ప్లేయర్లు..
ఆటగాడు ధర జట్టు వానిందు హసరంగా 1.50 కోట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ రచిన్ రవీంద్ర 1.80 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ శార్దూల్ ఠాకూర్ 4 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ అజ్మతుల్లా ఒమర్జాయ్ 50 లక్షలు గుజరాత్ టైటాన్స్ పాట్ కమిన్స్ 20.50 కోట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ గెరాల్డ్ కోయెట్జీ 5 కోట్లు ముంబై ఇండియన్స్ హర్షల్ పటేల్ 11.75 కోట్లు పంజాబ్ కింగ్స్ డారిల్ మిచెల్ 14 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ క్రిస్ వోక్స్ 4.20 కోట్లు పంజాబ్ కింగ్స్ -
KKR IPL 2024: కోల్‌కతా ఖాతాలోకి కేఎస్ భరత్..
తెలుగబ్యాయి కేఎస్ భరత్ బేస్ ధరకే అమ్ముడయ్యాడు. రూ. 50 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్ టీం సొంతం చేసుకుంది.
-
Pat Cummins: కమిన్స్ స్పందన..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చాలా సంతోషంగా ఉన్నాడు. సన్‌రైజర్స్‌లో చేరడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. కమిన్స్ మాటల్లో విందాం..
𝑻𝒉𝒊𝒔 𝒍𝒊𝒕𝒕𝒍𝒆 PAT 𝒐𝒇 𝒍𝒊𝒇𝒆 𝒊𝒔 𝒄𝒂𝒍𝒍𝒆𝒅 𝑯𝒂𝒑𝒑𝒊𝒏𝒆𝒔𝒔 🧡
Welcome, Cummins! 🫡#HereWeGOrange pic.twitter.com/qSLh5nDbLM
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023
-
పంజాబ్ జట్టులోకి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్..
ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్‌ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఫ్రాంచైజీ రూ.4 కోట్లు చెల్లించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా వోక్స్ కోసం పోటీపడినప్పటికీ పంజాబ్ నే ఈ స్టార్ ఆల్ రౌండర్ ను దక్కించుకుంది.
-
ధోని జట్టులోకి డారిల్ మిచెల్
న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. కోటి రూపాయల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన ఈ ప్రపంచ కప్ హీరోను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ బాగా ఆసక్తి చూపాయి. అయితే చెన్నై ఏకంగా రూ. 14 కోట్లు వెచ్చింది ఈ స్టార్ ఆల్ రౌండర్ ను సొంతం చేసుకుంది.
-
పంజాబ్‌కు బెంగళూరు ఫాస్ట్ బౌలర్
భారత ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో ఫ్రాంచైజీలు పోటీ పడగా పంజాబ్ రూ.11.75 కోట్లకు పటేల్ ను కొనుగోలు చేసింది.
-
ముంబైకు గెరాల్డ్ కోయెట్జీ
దక్షిణాఫ్రికాకు లేటెస్ట్ సెన్సేషన్ గెరాల్డ్ కోయెట్జీ జాక్ పాట్ కొట్టాడు. వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన ఈ ఫాస్ట్ బౌలర్‌ను ముంబై ఇండియన్స దక్కించుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ను దక్కించుకోవడానికి ముంబై, చెన్నై పోటీపడ్డాయి. లక్నో కూడా చివరిదాకా ప్రయత్నించింది. అయితే ఆఖరికి ముంబై ఐదు కోట్లకు సొంతం చేసుకుంది.
Gerald Coetzee sold to Mumbai Indians at 5cr. pic.twitter.com/Rvn3oIuDsM
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2023
-
MI IPL 2024: ముంబై గూటికి గెరాల్డ్ కోయెట్జీ..
దక్షిణాఫ్రికాకు చెందిన గెరాల్డ్ కోయెట్జీ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగాడు. అతని కోసం ముంబై, చెన్నై పోరాడాయి. మధ్యలో లక్నో కూడా చేరింది. కానీ చివరికి ముంబై ఐదు కోట్లకు దక్కించుకుంది.
-
ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పాట్ కమిన్స్..
కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తన నాయకత్వంలో ఆస్ట్రేలియాకు ఆరో ప్రపంచకప్‌ను అందించాడు. ఫైనల్ లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియాను ఓడించి మరీ తన జట్టును విశ్వ విజేతగా నిలిపాడు. ఇప్పుడు ఫ్రాంచైజీల దృష్టి కూడా కమిన్స్‌పై పడింది.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో దిగాడు. మొదట చెన్నై, ముంబయి వారి పోటీపడ్డాయి. ముంబై రంగంలోకి దిగింది. ముంబైతోపాటు RCB పోరాడింది. రూ.6 కోట్లు దాటింది. చివరకు పాట్ కమ్మిన్స్ ధర 20 కోట్లకు పెరిగింది. అంటే అతడిని ఏ జట్టు కొనుగోలు చేసినా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా కమిన్స్ నిలవడం ఖాయంగా మారింది. చివరకు హైదరాబాద్ కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది.
-
CSK IPL 2024: శార్దూల్ ఠాకూర్‌ను దక్కించుకున్న చెన్నై..
మొదట్లో శార్దూల్ ఠాకూర్‌పై ఎవరూ వేలం వేయలేదు. రూ.2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన శార్దుల్‌పై చెన్నై తొలి బిడ్ వేసింది. చెన్నై, సన్‌రైజర్స్ పోటాపడినా.. ఎట్టకేలకు చెన్నై రూ.4 కోట్లకు దక్కించుకుంది.
-
CSK IPL 2024 Auction: ధోని టీంలోకి న్యూజిలాండ్ ఆల్ రౌండర్..
న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర బేస్ ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చాడు. చెన్నై, ఢిల్లీ పోటీపడినా.. రూ.1.80 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది.
-
SRH IPL 2024 Auction: వనిందు హసరంగాను సొంతం చేసుకున్న హైదరాబాద్..
రెండవ సెట్ వేలం మొదలైంది. మొదటి ఆటగాడు వనిందు హసరంగా బేస్ ధర 1.5 కోట్లతో వేలంలోకి వచ్చాడు. LPLలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ని పొందిన తర్వాత శ్రీలంక ఆల్‌రౌండర్ గాయం కారణంగా ప్రపంచ కప్‌నకు దూరమయ్యాడు. SRH ఓపెనింగ్ బిడ్‌ని చేసింది. అలాగే ముగింపు బిడ్ కూడా హైదరాబాద్‌దే కావడం విశేషం. దీంతో హసరంగాను హైదరాబాద్ కైవసం చేసుకుంది.
-
IPL 2024 Auction: తొలి సెట్‌లో అమ్ముడైంది ముగ్గురే..
మొదటి సెట్ (క్యాప్డ్ బ్యాటర్లు)..
ఆటగాడు ధర (INRలో) జట్టు రోవ్మాన్ పావెల్ 7.4 కోట్లు రాజస్థాన్ రాయల్స్ రిలీ రోసోవ్ అమ్ముడుపోలేదు హ్యారీ బ్రూక్ 4 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ట్రావిస్ హెడ్ 6.8 కోట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కరుణ్ నాయర్ అమ్ముడుపోలేదు స్టీవ్ స్మిత్ అమ్ముడుపోలేదు మనీష్ పాండే అమ్ముడుపోలేదు భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కరుణ్ నాయర్, మనీష్ పాండే అన్‌సోల్డ్‌గా ఉన్నారు. స్టీవ్ స్మిత్ అమ్ముడవ్వలేదు. అయితే, ఈ ముగ్గురూ మళ్లీ వేలం పూల్‌లోకి రావొచ్చు.
-
SRH IPL Auction 2024: హైదరాబాద్ చెంతకు ట్రావిస్ హెడ్..
ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్‌పై బిడ్డింగ్ ప్రారంభమైంది. అతని బేస్ ధర రెండు కోట్లు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి వేలం వేయగా, ఆపై ప్రస్తుత విజేత చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్లేయర్ కోసం పోటాపోటీ జరిగింది. రూ.6 కోట్లు దాటింది. చివరకు రూ.6.80 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది.
-
DC IPL Auction 2024: ఢిల్లీ చేరిన హ్యారీ బ్రూక్..
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతని కోసం మొదటి బిడ్ చేసింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్, బ్రూక్ కోసం పోరాడింది. ఢిల్లీ బ్రూక్ ను రూ.4 కోట్లకు చేర్చుకుంది. గత వేలంలో బ్రూక్‌ను 13.25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అయితే ఈసారి విడుదల చేసింది
-
RR IPL Auction 2024: రాజస్థాన్ చేరిన రోమన్ పావెల్..
వెస్టిండీస్ ప్లేయర్ రోమన్ పావెల్ రాజస్థాన్ రాయల్స్ టీంలో చేరాడు. రూ.7.40 కోట్లకు ఈ టీం దక్కించుకుంది.
-
DC IPL Auction 2024: రికీ పాంటింగ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్
ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఫ్రాంచైజీ కేక్ కట్ చేసింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా పాల్గొన్నారు.
A special day in many ways 💙🎂#YehHaiNayiDilli @RickyPonting @RishabhPant17 pic.twitter.com/hTfD2KjryA
— Delhi Capitals (@DelhiCapitals) December 19, 2023
-
KKR IPL Auction 2024: వేదిక వద్దకు చేరకున్న గంభీర్..
ఐపీఎల్ 2024 కోసం తన పాత ఫ్రాంచైజీ చేరుకున్న గౌతమ్ గంభీర్.. దుబయ్‌లో జరగనున్న వేలానికి సిద్ధమయ్యాడు. ఈమేరకు కోకో కోలా ఎరీనా వద్ద నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు వచ్చాడు.
The king of KKR is back #GautamGambhir #IPL2024Auction #IPLAuction pic.twitter.com/GiWN7AUeyP
— Anshul7999 (@Rohiratforever) December 19, 2023
-
IPL Mock Auction 2024: తొలిసారి ప్రత్యక్షంగా చూడనున్న అభిమానులు..
ఈ వేలంలో, అభిమానులు ప్రత్యక్ష వేలాన్ని చూసే అవకాశాన్ని పొందుతారు. కోకాకోలా ఎరీనాలో జరుగుతున్న ఈ వేలానికి అభిమానులను అనుమతించారు. ఐపీఎల్ వేలంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఐపీఎల్ వేలం కూడా తొలిసారిగా భారత్ వెలుపల జరుగుతోంది. ఈ వేలం దుబాయ్‌లో జరుగుతోంది.
-
IPL Mini Auction 2024 Live: తొలి సెట్‌లో ఈ ఆటగాళ్లు..
IPL మొదటి సెట్‌లో మొత్తం ఏడుగురు ఆటగాళ్లు ఉన్నారు.
హ్యారీ బ్రూక్ – 2 కోట్లు
కరుణ్ నాయర్ – 2 కోట్లు
మనీష్ పాండే – 50 లక్షలు
రోవ్‌మన్ పావెల్ – 1 కోటి
సాలీ రస్సో – 2 కోట్లు
స్టీవ్ స్మిత్ – 2 కోట్లు
-
RCB Team IPL Auction: RCB టీం..
ఫాఫ్ డు ప్లెసిస్, రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్వెస్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, కరణ్ శర్మ, మనోజ్ భాంగే, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్, విజయ్ కుమార్, రాజన్ కామెరాన్ గ్రీన్, మయాంక్ డాగర్.
-
RCB పర్స్..
రూ. 23.5 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ వేలంలోకి ప్రవేశించనుంది. ఈ జట్టులో ఆరు స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిలో మూడు విదేశీ ఆటగాళ్లకు ఉన్నాయి. ఈ జట్టు ఇంకా టైటిల్ గెలవలేదు.
-
Coca-Cola Arenaలో వేలం నిర్వహణ..
భారత్ వెలుపల ఐపీఎల్ వేలం జరగడం ఇదే తొలిసారి. దుబాయ్‌లో ఈ వేలం నిర్వహిస్తున్నారు. దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో ఈ వేలం జరగనుంది.
-
CSK IPL Auction: చెన్నైకి ఎంత డబ్బు ఉంది?
ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత విజేత. గతేడాది గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఈ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఈసారి కూడా ఈ జట్టు విజయం సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఈ వేలంలో చెన్నై రూ.31.4 కోట్ల ధరతో బరిలోకి దిగనుంది. ఇది ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. అందులో గరిష్టంగా ముగ్గురు విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు.
-
MI IPL Auction: కొత్త కెప్టెన్‌తో ముంబై..
ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసి రోహిత్ శర్మను తొలగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేలంలో, ముంబై గరిష్టంగా ఎనిమిది మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగలదు. అందులో ఇద్దరు విదేశీయులు. ఈ టీమ్ రూ.17.75 కోట్లతో ఎంట్రీ ఇవ్వనుంది.
-
పంజాబ్ జట్టు..
శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), జితేష్ శర్మ (WK), సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబాడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విడవత కవరప్ప, శివమ్ సింగ్.
-
PBKS IPL Auction: పంజాబ్ దగ్గర ఎంత డబ్బు ఉంది?
తొలి టైటిల్ కోసం చూస్తోన్న పంజాబ్ కింగ్స్ జట్టు రూ.29.1 కోట్లతో వేలంలోకి దిగనుంది. మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాలి. అందులో కనీసం ఇద్దరు విదేశీయులు కావచ్చు.
-
SRH IPL Auction: హైదరాబాద్ జట్టు..
ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), సన్వీర్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, అబ్దుల్ సమద్, మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సన్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్‌హాక్ ఫరూకి, హెన్రిచ్ క్లాసెన్, మయాన్‌క్‌మొలెసెన్, మయాన్‌క్‌మొలెసెన్, సింగ్, టి నటరాజన్, నితీష్ కుమార్ రెడ్డి
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్స్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో కోచ్‌ని మార్చింది. వెస్టిండీస్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన డేనియల్ వెట్టోరీని జట్టు కోచ్‌గా నియమించారు. 34 కోట్లతో ఈ జట్టు వేలంలోకి దిగనుంది. ఈ జట్టు ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయగలదు. వీరిలో కనీసం ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉంటారు.
-
ఢిల్లీ జట్టు..
రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఎన్రిక్ నోర్కియా, కుల్దీప్ యాదవ్, లూగి న్గిడి, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ కుమార్ శర్మ.
-
వేలానికి పంత్?
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ ఆడలేదు. ఈసారి ఆడుతాడన్న పూర్తి ఆశ ఉంది. పంత్‌తో పాటు మిగిలిన జట్టు సిబ్బంది కూడా వేలంలో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి.
-
గుజరాత్ టైటాన్స్ జట్టు..
గుజరాత్ టైటాన్స్ జట్టు: శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, జో, రషీద్, రషీద్ లిటిల్, మోహిత్ శర్మ.
-
గుజరాత్ టైటాన్స్‌లో 8 ఖాళీలు..
గుజరాత్ టైటాన్స్ అత్యధికంగా రూ.38.15 కోట్లు. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు చోటు ఉంది. మొత్తంగా 8 ఖాళీలు ఉన్నాయి. బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్ కూడా చేయగల హార్దిక్ పాండ్యాకు గుజరాత్ టైటాన్స్ ప్రత్యామ్నాయం వెతకాలి. అంతేకాకుండా, ఈ జట్టుకు విదేశీ ఫాస్ట్ బౌలర్, వృద్ధిమాన్ సాహాకు ప్రత్యామ్నాయంగా ఉండే స్థానిక వికెట్ కీపర్ కూడా అవసరం.
-
ముంబై ఇండియన్స్ జట్టు..
ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రూయిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జాసన్ మధ్వల్ బెహ్రెన్‌డార్ఫ్, రొమారియో షెపర్డ్.
-
ముంబై జట్టులో ఖాళీగా 8 స్లాట్లు..
ముంబై ఇండియన్స్ వేలం పర్స్ రూ.17.75 కోట్లు. ముంబై జట్టులో 8 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 4గురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ముంబై ఇండియన్స్‌కు ఇద్దరు విదేశీ ఫాస్ట్ బౌలర్లు చాలా అవసరం. అందులో ఒకరు ఆల్ రౌండర్ అయితే మంచిది. అలాగే వారికి స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ అవసరం.
-
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: ఎంఎస్ ధోని, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, శివమ్ దూబే, నిశాంత్ సింధు, అజయ్ మండల్, రాజ్యవర్ధన్ హంగార్కర్, దీపక్ చౌద్‌నాహ్, మహిష్ తీశ్‌నాహ్, మహిష్ తీశ్‌నాహ్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, మతిష్ పతిరానా.
-
చెన్నై సూపర్ కింగ్స్‌లో 6 ఖాళీలు..
చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 31.40 కోట్లు ఉన్నాయి. జట్టులో మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. అందులో 3 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు ఉన్నాయి. IPL, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు IPL 2024లో చెన్నై సూపర్ కింగ్స్ భర్తీ చేయవలసి ఉంది. ఇది కాకుండా చెన్నైకి ఒక విదేశీ ఫాస్ట్ బౌలర్, భారత ఫాస్ట్ బౌలర్ అవసరం. దీంతో పాటు విదేశీ ఆల్‌రౌండర్లపై కూడా దృష్టి ఉంటుంది.
-
IPL 2024 మినీ వేలంలో 333 మంది ఆటగాళ్లు..
ఐపీఎల్ 2024 మినీ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలం వేయనున్నారు. ఈసారి 10 జట్లలో మొత్తం 77 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో 30 మంది ఆటగాళ్లు విదేశీయులు కావచ్చు. అంటే 333 మంది ఆటగాళ్లలో 77 మంది ఆటగాళ్లకు మాత్రమే లక్ వరించనుంది. ఈ వేలం ఒక్క రోజు మాత్రమే. ఇది భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతుంది.
Published On - Dec 19,2023 10:24 AM




