IPL 2024 Purple Cap: పర్పుల్ క్యాప్ రేసులో మనోళ్లదే పైచేయి.. అగ్రస్థానంలో కోహ్లీ మాజీ టీంమేట్..
IPL 2024 Purple Cap standings after KKR vs SRH, Qualifier 1: ఈ క్రమంలో పర్పుల్ క్యాప్ రేసు కూడా ఆసక్తిగా మారింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన వరుణ్ చక్రవర్తి క్వాలిఫయర్ 1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రెండు వికెట్లు తీశాడు. దీంతో IPL 2024 పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్థానానికి చేరుకున్నాడు.

IPL 2024 Purple Cap standings after KKR vs SRH, Qualifier 1: ఐపీఎల్ తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. అంతకుముందు ఈ జట్టు 2021లో ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు క్వాలిఫయర్-2లో విజయం సాధించి హైదరాబాద్ ఫైనల్ చేరే అవకాశం ఉంది.
ఈ క్రమంలో పర్పుల్ క్యాప్ రేసు కూడా ఆసక్తిగా మారింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన వరుణ్ చక్రవర్తి క్వాలిఫయర్ 1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రెండు వికెట్లు తీశాడు. దీంతో IPL 2024 పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్థానానికి చేరుకున్నాడు.
పర్పుల్ క్యాప్ టాప్ ఫైవ్‌లోకి ప్రవేశించే రేసులో SRH పేసర్ టి. నటరాజన్ కూడా ఉన్నాడు. KKRపై ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు.
పంజాబ్ కింగ్స్ హర్షల్ పటేల్ 24 వికెట్లతో వికెట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 20 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
IPL 2024లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా..
బౌలర్ | జట్టు | ఆడిన మ్యాచ్‌లు | వికెట్లు | ఎకానమీ | సగటు | బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ |
హర్షల్ పటేల్ | PBKS | 14 | 24 | 9.73 | 19.87 | 3/15 |
జస్ప్రీత్ బుమ్రా | MI | 13 | 20 | 6.48 | 16.80 | 5/21 |
వరుణ్ చకారవర్తి | KKR | 13 | 20 | 8.18 | 19.65 | 3/16 |
అర్ష్దీప్ సింగ్ | PBKS | 14 | 19 | 10.03 | 26.57 | 4/29 |
టి. నటరాజన్ | SRH | 12 | 18 | 9.12 | 23.50 | 4/19 |
సీజన్ల వారీగా పర్పుల్ క్యాప్ పొందిన ఆటగాళ్ల జాబితా..
సంవత్సరం | ఆటగాడు | జట్టు | మ్యాచ్‌లు | వికెట్లు | సగటు | స్ట్రైక్ రేట్ | ఎకానమీ రేటు | బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ |
2023 | మహ్మద్ షమీ | GT | 17 | 28 | 18.64 | 13.92 | 8.03 | 4/11 |
2022 | యుజ్వేంద్ర చాహల్ | RR | 17 | 27 | 19.51 | 15.11 | 7.75 | 5/40 |
2021 | హర్షల్ పటేల్ | RCB | 15 | 32 | 14.34 | 10.56 | 8.14 | 5/27 |
2020 | కగిసో రబడ | DC | 17 | 30 | 18.26 | 13.30 | 8.34 | 4/24 |
2019 | ఇమ్రాన్ తాహిర్ | CSK | 17 | 26 | 16.57 | 14.84 | 6.69 | 4/12 |
2018 | ఆండ్రూ టై | KXIP | 14 | 24 | 18.66 | 14.00 | 8.00 | 4/16 |
2017 | భువనేశ్వర్ కుమార్ | SRH | 14 | 26 | 14.19 | 12.00 | 7.05 | 5/19 |
2016 | భువనేశ్వర్ కుమార్ | SRH | 17 | 23 | 21.30 | 17.20 | 7.42 | 4/29 |
2015 | డ్వేన్ బ్రావో | CSK | 17 | 26 | 16.38 | 12.00 | 8.14 | 3/22 |
2014 | మోహిత్ శర్మ | CSK | 16 | 23 | 19.65 | 14.00 | 8.39 | 4/14 |
2013 | డ్వేన్ బ్రావో | CSK | 18 | 32 | 15.53 | 11.70 | 7.95 | 4/42 |
2012 | మోర్నే మోర్కెల్ | DD | 16 | 25 | 18.12 | 15.10 | 7.19 | 4/20 |
2011 | లసిత్ మలింగ | MI | 16 | 28 | 13.39 | 13.50 | 5.95 | 5/13 |
2010 | ప్రజ్ఞాన్ ఓజా | DC | 16 | 21 | 20.42 | 16.80 | 7.29 | 3/26 |
2009 | ఆర్పీ సింగ్ | DC | 16 | 23 | 18.13 | 15.50 | 6.98 | 4/22 |
2008 | సోహైల్ తన్వీర్ | RR | 11 | 22 | 12.09 | 11.22 | 6.46 | 6/14 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..