AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: విరాట్ కోహ్లీకి నిద్రలేకుండా చేస్తున్న రాజస్థాన్ ప్లేయర్స్.. ఎందుకంటే?

IPL 2024, IPL 2024 Orange Cap: రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్లో పంజాబ్ కింగ్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో 10 పాయింట్లు సాధించిన మొదటి జట్టుగా అవతరించింది. 148 పరుగుల లక్ష్యం రాయల్స్‌కు సులువుగా అనిపించినా.. పంజాబ్ బౌలర్లు చివరి వరకు కష్టపడ్డారు. అయితే స్లో పిచ్‌పై రాయల్స్ బ్యాట్స్‌మెన్ పట్టు వదలకపోవడంతో జట్టు 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి విజయం సాధించింది.

IPL 2024: విరాట్ కోహ్లీకి నిద్రలేకుండా చేస్తున్న రాజస్థాన్ ప్లేయర్స్.. ఎందుకంటే?
Virat Kohli
Venkata Chari
|

Updated on: Apr 14, 2024 | 1:45 PM

Share

IPL 2024 Orange Cap: రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్లో పంజాబ్ కింగ్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో 10 పాయింట్లు సాధించిన మొదటి జట్టుగా అవతరించింది. 148 పరుగుల లక్ష్యం రాయల్స్‌కు సులువుగా అనిపించినా.. పంజాబ్ బౌలర్లు చివరి వరకు కష్టపడ్డారు. అయితే స్లో పిచ్‌పై రాయల్స్ బ్యాట్స్‌మెన్ పట్టు వదలకపోవడంతో జట్టు 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి విజయం సాధించింది. సంజూ శాంసన్ సేన చివరి ఐదు ఓవర్లలో 49 పరుగులు అవసరం. అయితే రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్ వంటి పవర్-హిటర్లు ఉన్నా.. వారు మ్యాచ్ చివరి బంతి వరకు వేచి ఉండాల్సి వచ్చింది.

హెట్మెయర్ హర్షల్ పటేల్‌కు ఒక సిక్స్, ఫోర్ కొట్టిన తర్వాత, చివరి ఆరు బంతుల్లో సమీకరణం 10కి పడిపోయింది. వెస్టిండీస్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ చివరి ఓవర్‌లో ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రెండు బౌండరీలు కొట్టడం ద్వారా మ్యాచ్‌ను ముగించాడు .

ఆరెంజ్ క్యాప్ జాబితాలో అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

ఆటగాడు జట్టు ఆడిన మ్యాచ్ లు పరుగులు
విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 319
రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ 6 284
సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ 6 264
శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ 6 255
సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ 6 226

శనివారం జరిగిన పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్ తర్వాత, విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ జాబితాలో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన వారి విషయంలో రియాన్ పరాగ్, సంజూ శాంసన్ గ్యాప్ తగ్గించుకుంటూ రెండు, మూడు స్థానాలకు చేరారు. పరాగ్ 23 పరుగులు చేయగా, శాంసన్ చివరి ఓవర్లో తన ఖాతాలో 18 పరుగులు జోడించి రాయల్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించాడు. దీంతో పాటు గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ కూడా రేసులో ఉన్నారు. వీరు నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..