AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు గుండె పగిలే వార్త.. సూర్య కుమార్ హార్ట్ బ్రేకింగ్ పోస్ట్.. అసలు ఏమైందంటే?

ప్రస్తుతం అంతర్జాతీయ టీ 20 క్రికెట్ లో నంబర్ వన్ బ్యాటర్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సూర్య కుమార్ యాదవ్. అతను క్రీజులో ఉంటే మైదానంలో ఫోర్లు, సిక్స్ ల వర్షమే. బంతులు వేయడానికి ఎలాంటి బౌలరైనా వణికపోతారు. అలాంటి సూర్య ఐపీఎల్ లో ఆడితే ముంబై ఇండియన్స్ కు వెయ్యి ఏనుగుల బలం..

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు గుండె పగిలే వార్త.. సూర్య కుమార్ హార్ట్ బ్రేకింగ్ పోస్ట్.. అసలు ఏమైందంటే?
Mumbai Indians
Basha Shek
|

Updated on: Mar 19, 2024 | 6:17 PM

Share

ప్రస్తుతం అంతర్జాతీయ టీ 20 క్రికెట్ లో నంబర్ వన్ బ్యాటర్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సూర్య కుమార్ యాదవ్. అతను క్రీజులో ఉంటే మైదానంలో ఫోర్లు, సిక్స్ ల వర్షమే. బంతులు వేయడానికి ఎలాంటి బౌలరైనా వణికపోతారు. అలాంటి సూర్య ఐపీఎల్ లో ఆడితే ముంబై ఇండియన్స్ కు వెయ్యి ఏనుగుల బలం. అయితే ఇప్పుడది సాధ్యమయ్యేల కనిపించడం లేదు. అవునుమీడియా నివేదికల ప్రకారం, సూర్యకుమార్ యాదవ్ తన ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. పర్యవసానంగాఅతను IPL 2024 కొన్ని మ్యాచ్‌ల నుండి తప్పుకోవడం ఖాయం. గాయం తీవ్రంగా ఉంటే మాత్రం మొత్తం సీజన్‌లోనూ ఆడలేని అవకాశం కూడా ఉంది. ఈ కారణంగానే సూర్య తన సోషల్ మీడియాలో ఖాతాలో హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశాడని తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ ఇటీవల స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడ్డాడు, దాని కారణంగా అతను శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ శస్త్రచికిత్స తర్వాత, అతను కోలుకునే దశలో ఉన్నాడు. అయితే ఇప్పుడు అతనికి ఐపీఎల్ 2024లోనే ఆడటం కష్టంగా మారింది. క్రిక్‌బజ్ నివేదికల ప్రకారం, సూర్యకుమార్ యాదవ్ మంగళవారం ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. ఈ ఫిట్‌నెస్ టెస్టులో విఫలమవడంతో జాతీయ క్రికెట్ అకాడమీ అతడిని ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతించలేదు. ఇప్పుడు ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి సూర్యకుమార్ యాదవ్‌కు చివరి అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి.

సూర్యకుమార్ యాదవ్ తదుపరి ఫిట్‌నెస్ పరీక్ష మార్చి 21న జరగనుంది. అంటే, ముంబై ఇండియన్స్ ప్రారంభ మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్ ఆడటం దాదాపు అసాధ్యం. ఎందుకంటే సూర్య తదుపరి టెస్టులో పాసైనా, ముంబై ఇండియన్స్ అతన్ని వెంటనే మ్యాచ్‌లో బరిలోకి దించదు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్. అంతర్జాతీయ టీ20లో తన బ్యాట్‌తో 4 సెంచరీలు సాధించాడు. అతని సగటు 45 కంటే ఎక్కువ మరియు అతని స్ట్రైక్ రేట్ 170కి మించి ఉంది. IPLలో కూడా ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముకగా ఉన్నాడు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ IPL 2024 నుండి తప్పుకుంటే మాత్రం ముంబై ఇండియన్స్ కు భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. సూర్య స్థానంలో రీప్లేస్ మెంట్ గా ముంబై ఇండియన్స్‌ పంజాబ్‌కు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్ నెహాల్ వధేరా కేరళ బ్యాటర్ విష్ణు వినోద్ లను జట్టులోకి తీసుకుంది.

ఇవి కూడా చదవండి

సూర్య కుమార్ యాదవ్ పోస్ట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us