AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విధి నిర్వహణలోనే మృత్యువాత.. రవాణా శాఖ అధికారిని బలితీసుకున్న బొగ్గు లారీ!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI) వెంకన్న మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం జిల్లాతో పాటు రవాణా శాఖలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వెంకన్న మృతికి కారణమైన వాహనం తాడిచర్ల కోల్ మైన్ నుంచి భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్‌కు బొగ్గును తరలిస్తున్న బొగ్గు లారీగా అధికారులు గుర్తించారు.

విధి నిర్వహణలోనే మృత్యువాత..  రవాణా శాఖ అధికారిని బలితీసుకున్న బొగ్గు లారీ!
Motor Vehicle Inspector Venkanna
Balaraju Goud
|

Updated on: Jun 22, 2026 | 2:05 PM

Share

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణ శాఖ అధికారి (DTO) వెంకన్న మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం జిల్లాతో పాటు రవాణా శాఖలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వెంకన్న మృతికి కారణమైన వాహనం తాడిచర్ల కోల్ మైన్ నుంచి భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్‌కు బొగ్గును తరలిస్తున్న బొగ్గు లారీగా అధికారులు గుర్తించారు.

విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు స్పందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంకన్న మృతి వార్త తెలిసిన వెంటనే రవాణా శాఖ అధికారులు, సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా చేర్యాల ప్రాంతానికి చెందిన వెంకన్న ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్న అధికారి. విద్యుత్ (మెకానికల్) ఇంజినీరింగ్‌లో చదువు పూర్తి చేసిన ఆయన ఖమ్మం జిల్లాలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. 2003లో పవర్ సెక్టార్ నియామకాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ (AE)గా ఉద్యోగంలో చేరి తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం కేటీపీఎస్‌లో విధులు నిర్వహిస్తూ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE) హోదాకు పదోన్నతి పొందారు. చదువుల పట్ల అపారమైన ఆసక్తి, మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే తపనతో వెంకన్న అప్పటి ఉమ్మడి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పరీక్షలకు హాజరయ్యారు. ఆ పరీక్షల్లో విజయం సాధించి రవాణా శాఖలో ఉద్యోగం పొందారు. తన విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన వెంకన్న సేవలను సహచరులు గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

వెంకన్నకు భార్యతో పాటు ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆయనే ప్రధాన ఆధారం కావడంతో ఆయన మృతి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వెంకన్న కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సీఎం, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్‌ను ఆదేశించారు.

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బొగ్గు లారీల నిర్వహణలో ఉన్న లోపాలు, భద్రతా ప్రమాణాల అమలుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వెంకన్నకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, సహచరులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us