AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIR Online: 2002 ఎస్ఐఆర్‌లో కుటుంబసభ్యుల పేర్లు కనిపించడం లేదా..? టెన్షన్ పడక్కర్లేదు.. ఈసీ కీలక సూచనలు..

ఎస్ఐఆర్ ఫారం నింపే సమయంలో ప్రతీఒక్కరినీ ఒక ఆప్షన్ ఇబ్బంది పెడుతోంది. అందే 2002 ఎస్ఐఆర్‌లో మన కుటుంబసభ్యులు లేదా పూర్వీకుల పేర్లను నింపడం. అప్పటి వివరాలు దొరక్క ఓటర్లు సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే అలాంటివారు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఈసీ చెబుతోంది.

SIR Online: 2002 ఎస్ఐఆర్‌లో కుటుంబసభ్యుల పేర్లు కనిపించడం లేదా..? టెన్షన్ పడక్కర్లేదు.. ఈసీ కీలక సూచనలు..
Sir
Venkatrao Lella
|

Updated on: Jul 20, 2026 | 11:30 AM

Share

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం గడువును మరింత పొడిగించింది. దీంతో ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎస్‌ఐఆర్ ఫారం ఫిల్ చేసేటప్పుడు ఒక పెద్ద సమస్య ఓటర్లకు అడ్డంకిగా మారింది. అదేంటంటే.. 2002 ఎస్ఐఆర్‌ జాబితాలో మన కుటుంబసభ్యులు లేదా పూర్వీకుల పేర్లు నమోదు చేయాల్సి రావడం. అప్పటిలో జాబితాలో కుటుంబసభ్యుల పేర్లు దొరక్క ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్లు అన్నీ మారిపోయాయి. దీంతో సెర్చ్ చేసినా వివరాలు రావడం లేదు.

2002 ఎస్ఐఆర్ వివరాలు ఎలా తెలుసుకోవాలి..?

-https://voters.eci.gov.in/ వెబ్‌సైట్ తెరవండి

-సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అనే ఆప్షన్ ఎంచుకోండి

-రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ పేరు, పార్ట్ సీరియల్ నెంబర్, లాస్ట్ ఎస్ఐఆర్‌లో ఓటరు పూర్తి పేరు, వయస్సు, రిలేటివ్ టైప్, రిలేటివ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. అనంతరం క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే సరిపోతుంది.

-ఈ విధానంలో పేరు ద్వారా లాస్ట్ ఎస్ఐఆర్‌లో కుటుంబసభ్యులను గుర్తించవచ్చు

పోలింగ్ స్టేషన్ ఆధారంగా..

ఇక పోలింగ్ స్టేషన్ ఆధారంగా లాస్ట్ ఎస్ఆర్‌లో పేరు తెలుసుకోవాలంటే.. రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ నెంబర్, నేమ్ టైప్ చేసి వ్యూపై క్లిక్ చేయాలి. మీ గ్రామం జాబితా వస్తుంది. అందులో మీ కుటుంబసభ్యుల పేర్ల ఆధారంగా గుర్తించాలి.

డీటైల్స్ దొరక్కపోతే..

2002 నాటికి ఓటరుగా నమోదు కాని మహిళలు తమ పుట్టింటికి సంబంధించిన వారి వివరాలు అందించవచ్చు. ఈ వెబ్‌సైట్‌ ఆధారంగా వారి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక అప్పటికీ వివరాలు దొరక్కపోతే ఎస్‌ఐఆర్ ఫారంలోని థర్డ్ పార్ట్‌లో తమ ప్రస్తుత వివరాలను నింపాలి. వీరికి ఆగస్ట్‌లో నోటీసులు పంపుతారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పిస్తే సరిపోతుంది. కుటుంబసభ్యుల వివరాలు లేవనే కారణంతో ఎస్‌ఐఆర్ ఫారం నింపకుండా ఉండవద్దు. ఆ కాలమ్‌ను నింపకుండా వదిలేసినా సరిపోతుంది.

Follow Us