AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీ, రోహిత్ కాదు మావ.. నన్ను భయపెట్టిన భారత బ్యాటర్ అతనే! ఆర్చర్ షాకింగ్ స్టేట్మెంట్

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడైన జోఫ్రా ఆర్చర్, తనకు అత్యంత కఠినమైన బ్యాటర్ టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ అని వెల్లడించాడు. కోహ్లీ, రోహిత్ శర్మ కాదు, కేఎల్ రాహుల్ తన బౌలింగ్‌ను ఎప్పుడూ సులభంగా ఎదుర్కొనేవాడని ఆర్చర్ తెలిపాడు.

కోహ్లీ, రోహిత్ కాదు మావ.. నన్ను భయపెట్టిన భారత బ్యాటర్ అతనే! ఆర్చర్ షాకింగ్ స్టేట్మెంట్
Jofra Archer About Kl Rahul
SN Pasha
|

Updated on: Jun 22, 2026 | 11:31 AM

Share

ప్రపంచ క్రికెట్‌లో చాలా మంది బౌలర్లకు కనీసం ఒక్క బ్యాటర్‌కైనా బౌలింగ్ వేయడం కష్టంగా ఉంటుంది. ఎంత మంచి బాల్ వేసినా అతను కొట్టేస్తాడు, నా బౌలింగ్‌లో చాలా ఈజీగా ఆడేస్తాడు.. వీడికి బౌలింగ్ చేయడం కష్టం రా బాబు అనే వాళ్లు చాలా మందే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు తాము ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్, బ్యాటర్ గురించి ఆటగాళ్లు వెల్లడిస్తుంటారు. తాజాగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ప్రపంచ క్రికెట్‌‌లో తన వేగంతో అనేకమంది బ్యాటర్లను భయపెట్టిన బౌలర్ ఆర్చర్, అలాంటి ఆర్చర్‌కు మాత్రం ఓ బ్యాటర్ అంటే భయం. అతనికి బౌలింగ్ చేయడం చాలా టఫ్ అంటూ ఆర్చర్ వెల్లడించాడు. పైగా అతను టీమిండియా ప్లేయర్.

అయితే చాలా మంది కోహ్లీనో, రోహిత్ శర్మ అనో అనుకుంటారు. కానీ ఆర్చర్‌ను భయపెట్టింది వాళ్లిద్దరూ కాదు. క్లాసీ బ్యాటర్ కేఎల్ రాహుల్. చాలా స్కిల్ ఉన్న బ్యాటర్ అనే పేరు రాహుల్‌కి ఉంది. ఎలాంటి బౌలింగ్‌నైనా ఈజీగా ఎందుర్కొంటాడు. రాహుల్ తన ప్రైమ్ టైమ్‌లో తనను ఇబ్బంది పెట్టాడని ఆర్చర్ తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్చర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నిజానికి ఇప్పుడే కాదు.. ఓ ఆరేళ్ల క్రితం కూడా ఆర్చర్ రాహుల్ గురించి చెప్పాడు. తాను బౌలింగ్ చేసిన టీ20 బ్యాట్స్‌మెన్‌లలో కేఎల్ రాహుల్ అత్యంత కఠినమైన బ్యాటర్ అని ఆర్చర్ వెల్లడించాడు. 2018, 2019 ఐపీఎల్ సీజన్లలో రాహుల్ కింగ్స్ XI పంజాబ్ తరఫున ఆడుతూ తన కెరీర్ పీక్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ సమయంలో రాహుల్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఉండేదని ఆర్చర్ పేర్కొన్నాడు.

2018 ఐపీఎల్‌లో 38వ మ్యాచ్‌లో రాహుల్ ఆర్చర్‌ను ఎదుర్కొన్నాడు, ఆ మ్యాచ్‌లో 54 బంతుల్లో 84 పరుగులు చేసి నాటౌట్‌గా ఉంటూ పంజాబ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు రాహుల్. తన ఇన్నింగ్స్‌లో రాహుల్ ఆర్చర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, మూడు బౌండరీలు బాదాడు. చివరి ఓవర్‌లో కూడా రాహుల్ ఆటను ముగించి, ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌కు ఆరు వికెట్ల విజయాన్ని అందించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా?వైరల్ వీడియో వెనుక నిజం
పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా?వైరల్ వీడియో వెనుక నిజం
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..
నొప్పి తెలియదు.. కానీ ఇవి కిడ్నీ క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?
నొప్పి తెలియదు.. కానీ ఇవి కిడ్నీ క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?
కూతురా? అని ఎగతాళి చేశారు.. భార్యతో ఏజ్ గ్యాప్ పై సాయాజీ షిండే
కూతురా? అని ఎగతాళి చేశారు.. భార్యతో ఏజ్ గ్యాప్ పై సాయాజీ షిండే
ఈ ఆకుల్లో ఏ మహత్యముందో.. ఆ రోగాలన్నీ మటాష్..
ఈ ఆకుల్లో ఏ మహత్యముందో.. ఆ రోగాలన్నీ మటాష్..