EPFO: ఈ పరిస్థితుల్లో పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్ మొత్తం తీసుకోవచ్చు.. కేంద్రం కొత్త రూల్స్.. ఎప్పుడెప్పుడంటే..?
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి 100 శాతం పీఎఫ్ సొమ్మును తీసుకోవచ్చు. 75 శాతం మాత్రమే పీఎఫ్ బ్యాలెన్స్‌లోని అమౌంట్‌ను విత్ డ్రా చేసుకోవచ్చని గతంలో కేంద్రం నిబంధన విధించింది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మొత్తం తీసేసుకోవచ్చు.

ఈపీఎఫ్‌వో నిబంధనలు పూర్తిగా మారాయి. ఈపీఎఫ్‌వో 3.0లో భాగంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అనేక నిబంధనలను సవరించింది. ఈ కొత్త నిబంధన ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా తమ నిధులలో 75 శాతం సొమ్ముును ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. రూ.5 లక్షల్లోపు క్లెయిమ్ ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేస్తారు. ఆపైన సొమ్ముకు మాన్యువల్ విధానంలో అధికారుల పరిశీలన ఉంటుంది. కానీ 75 శాతం మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చనే నిబంధన వల్ల.. తమ పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్‌లో 100 శాతం సొమ్మును తీసుకోలేమని సందేహం చాలా మందిలో నెలకొంది. మీరు ఖచ్చితంగా వాటిని తీసుకోవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం,.
100 శాతం సొమ్ము తీసుకోవాలంటే..?
పాత నియమాల ప్రకారం మీరు మీ PF అకౌంట్లోని 100 శాతం డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే.. కంపెనీ మూసివేత, ఉద్యోగం కోల్పోవడం, ప్రకృతి వైపరీత్యం లేదా మహమ్మారి వంటి నిర్దిష్ట కారణాన్ని అందించాల్సి ఉండేది. అంతేకాకుండా కారణానికి అవసరమైన ప్రూఫ్ లేదా పత్రాలను సమర్పించాల్సి ఉండేది. కారణం స్పష్టంగా చెప్పకపోవడం, డాక్యుమెంట్ల సరిగ్గా లేకపోవడం వల్ల క్లెయిమ్‌లు తిరస్కరించేవారు. కానీ ఇప్పుడు క్లెయిమ్స్ తిరస్కరణలు తగ్గించేందుకు ఈపీఎఫ్‌వో నిబంధనల్లో మార్పులు చేసింది. పీఎఫ్ 3.0 వెర్షన్‌లో భాగంగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. ఈ విషయాలు చాలామంది ఖాతాదారులకు తెలియడం లేదు.
ఈ పరిస్థితుల్లో మొత్తం తీసేసుకోవచ్చు
-మీ కంపెనీ 15 రోజుల కంటే ఎక్కువ కాలం మూసి ఉండి మీకు ఎలాంటి జీతం లేదా పరిహారం అందకపోయినా లేదా సమ్మె లేకుండా గత రెండు నెలలుగా మీకు జీతం అందకపోతే 100 శాతం విడ్ డ్రా చేసుకోవచ్చు.
-కంపెనీని 6 నెలల కంటే ఎక్కువ కాలం పాటు మూసివేసి ఉద్యోగులు నిరుద్యోగులుగా ఉన్నట్లయితే మొత్త బ్యాలెన్స్ ఒకేసారి తీసుకోవచ్చు
-ఒక ఉద్యోగిని ఉద్యోగం నుండి తొలగించి అతని కేసు కోర్టులో విచారణలో ఉన్నప్పుడు కూడా 100 శాతం ఉపసంహరించుకోవచ్చు
-తీవ్రమైన అనారోగ్య చికిత్స చికిత్స కోసం లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరి చికిత్స కోసమైనా మొత్తం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటికి ఎటువంటి కారణం లేదా రుజువును అందించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు “ప్రత్యేక పరిస్థితి” విభాగాన్ని ఎంచుకోవడం ద్వారా ఎటువంటి కారణం లేకుండా మొత్తం పొందవచ్చు
