AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిస్టరీలోనే ఇలాంటోళ్లు చాలా అరుదు భయ్యో.. టాప్ 5 లిస్ట్‌లో మనోళ్లు ఒక్కరు లేరుగా..!

Most Bowled Wickets in Cricket: క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. వాటిలో కొన్ని బద్దలవుతుంటే, మరికొన్ని మాత్రం అలాగే ఉండిపోతుంటాయి. తాజాగా ఇలాంటి లిస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ లిస్ట్‌లో ఒక్క టీమిండియా ప్లేయర్ లేకపోవడం గమనార్హం. అసలు ఏంటి ఈ జాబితా, టాప్ 5లో ఎవరున్నారో ఓసారి చూద్దాం..!

హిస్టరీలోనే ఇలాంటోళ్లు చాలా అరుదు భయ్యో.. టాప్ 5 లిస్ట్‌లో మనోళ్లు ఒక్కరు లేరుగా..!
Most Bowled Wickets In Cricket
Venkata Chari
|

Updated on: Aug 21, 2026 | 4:28 PM

Share

Most Bowled Wickets in Cricket: అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్డ్ చేయడం అంటే బౌలర్లకు ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక స్టార్ బ్యాటర్లను ఇలా బౌల్డ్ చేస్తే వాళ్ల ఆనందానికి అవధులు ఉండవంతే. అయితే తమ కెరీర్‌లో 200 కంటే ఎక్కువ మందిని బౌల్డ్ చేసిన లిస్ట్‌లో కేవలం ఐదుగురు బౌలర్లు మాత్రమే ఉన్నారని మీకు తెలుసా. ఎంతోమంది లెజెండరీ బౌలర్లు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఈ అత్యంత అరుదైన మైలురాయిని భారత్ నుంచి ఏ ఒక్కరూ అందుకోలేకపోవడం గమనార్హం.

అంతర్జాతీయ క్రికెట్‌లో 200 కంటే ఎక్కువ మందిని బౌల్డ్ చేసిన ఐదుగురు బౌలర్లు సాధించిన ఈ రికార్డు జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో సాధించిన మొత్తం 1,347 వికెట్లలో ఏకంగా 290 వికెట్లు బౌల్డ్ రూపంలోనే దక్కించుకున్నాడు. తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను బోల్తా కొట్టించి ఎక్కువసార్లు స్టంప్స్‌ను పడగొట్టాడు. ఆయన తర్వాత పాకిస్థాన్ స్వింగ్ సుల్తాన్ వసీమ్ అక్రమ్ మొత్తం 916 వికెట్లలో 278 వికెట్లను క్లీన్ బౌల్డ్‌ల ద్వారా సాధించి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..?

ఇవి కూడా చదవండి

రివర్స్ స్వింగ్ యార్కర్లతో వకార్, స్టార్క్ జోరు..

పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ తన కెరీర్‌లో సాధించిన 789 వికెట్లలో 253 బ్యాటర్లను నేరుగా బౌల్డ్ చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఆయన సంధించే వేగవంతమైన యార్కర్లు స్టంప్స్‌ను గాల్లోకి లేపేస్తుంటాయి. ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఈ అరుదైన జాబితాలో చేరాడు. ఇప్పటివరకు 761 వికెట్లు తీసిన స్టార్క్, అందులో 223 వికెట్లను బౌల్డ్ రూపంలో సాధించి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

200 మార్కును తాకిన అండర్సన్..

ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో తన స్వింగ్ బౌలింగ్‌తో అద్భుతాలు సృష్టించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 991 వికెట్లు పడగొట్టగా, అందులో 201 మందిని క్లీన్ బౌల్డ్ చేసి ఈ ఎలైట్ గ్రూప్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. స్పీడ్, స్వింగ్, సరైన లెంగ్త్‌తో స్టంప్స్‌ను టార్గెట్ చేసిన ఈ ఐదుగురు బౌలర్లు మాత్రమే ఇప్పటివరకు 200 మైలురాయిని దాటగలిగారు.

ఎక్కువమంది చదివినది: SL vs IND: లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ ప్యాక్ చేసుకుని ఇంటికెళ్లుడు పక్కా..!

క్రికెట్ చరిత్రలో ఎందరో భారత దిగ్గజ బౌలర్లు వందల కొద్దీ వికెట్లు తీసినప్పటికీ, ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. భవిష్యత్ తరంలోనైనా భారత పేసర్లు లేదా స్పిన్నర్లు ఈ 200 బౌల్డ్ వికెట్ల క్లబ్‌లోకి అడుగుపెడతారేమో చూడాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us