AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs SL: టీమిండియా గెలుపు కోసం వర్షంలోనూ శ్రమించిన 130 మంది.. రోజుకు వచ్చే జీతం ఎంతో తెలుసా?

Ind Vs SL: శ్రీలంకలోని గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ చారిత్రాత్మక గెలుపు వెనుక బౌలర్ల శ్రమ ఎంత ఉందో, వర్షం పడుతున్నా మైదానాన్ని నిరంతరం కాపాడిన 130 మంది గ్రౌండ్ స్టాఫ్ శ్రమ కూడా అంతే ఉంది. మరి వీరి రోజువారీ సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Ind Vs SL: టీమిండియా గెలుపు కోసం వర్షంలోనూ శ్రమించిన 130 మంది.. రోజుకు వచ్చే జీతం ఎంతో తెలుసా?
Galle Test
Rakesh
|

Updated on: Aug 20, 2026 | 1:05 PM

Share

Ind Vs SL: శ్రీలంక పర్యటనను భారత జట్టు ఊహించని రీతిలో అదిరిపోయే ఘన విజయంతో ప్రారంభించింది. గాలే స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో లంక జట్టును చిత్తు చేసిన భారత్, సిరీస్‌లో 1-0 ఆధిపత్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ ఒకే టెస్టులో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. జస్ప్రీత్ బుల్రా వంటి దిగ్గజాలకు సైతం అరుదుగా సాధ్యమయ్యే ఈ ఘనతను అతడు అందుకున్నాడు. ఆగస్టు 19న ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని 206 రనులకే ఆలౌట్ చేసి భారత్ పతాకాన్ని ఎగురవేసింది.

వర్షంతో పోరాడిన 130 మంది గ్రౌండ్ స్టాఫ్

ఈ విజయంలో ఆటగాళ్ల పాత్ర ఎంత ఉందో, మ్యాచ్‌ సాఫీగా సాగేందుకు రాత్రింబవళ్లు కష్టపడిన గ్రౌండ్ స్టాఫ్ పాత్ర అంతకంటే ఎక్కువగా ఉంది. టెస్టు మ్యాచ్ జరుగుతున్న ఐదు రోజులూ గాలే నగరంలో వర్షం నిరంతరం ఆటంకం కలిగిస్తూనే వచ్చింది. వర్షం పడగానే కవర్లను వేగంగా పరచడం, వర్షం తగ్గగానే గ్రౌండ్‌ను ఆరబెట్టడంలో 130 మంది గ్రౌండ్ స్టాఫ్ కనబరిచిన సమర్థత మ్యాచ్‌ను కాపాడింది. వీరి కష్టం లేకపోతే మ్యాచ్ ఫలితం తేలకుండా సమంగా ముగిసిపోయేది.

ఇది కూడా చదవండి: Virat Kohli: ఓర్నీ.. వీళ్ల ధైర్యం తగలెయ్యా.. ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!

శ్రీలంక బోర్డు ఇచ్చే రోజువారీ కూలీ ఎంత?

ఈ టెస్టు మ్యాచ్ నిర్వహణ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రత్యేకంగా 130 మంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం గాలే ప్రాంతం నుంచి 16 మంది, హంబన్‌తోట నుంచి 10 మంది రాగా, మిగిలిన 102 మందిని ఈ ఒక్క మ్యాచ్ కోసమే తాత్కాలికంగా నియమించుకున్నారు. అయితే వీరెవరికీ నెలవారీ స్థిరమైన జీతాలు ఉండవు. బోర్డు వీరికి కేవలం రోజువారీ కూలీ మాత్రమే చెల్లిస్తుంది. ఈ విషయాన్ని లంక క్రికెట్ వర్గాలు ధృవీకరించాయి.

ఇది కూడా చదవండి: Saaniya Chandhok: సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా? ఏం చేసిందో తెలిస్తే వావ్ అంటారు

ఇది కూడా చదవండి:Unwanted Records: టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు.. తొలి ఓవర్ తొలి బంతికే అవుటైన ముగ్గురు స్టార్ బ్యాటర్లు

భారత రూపాయిల్లో వారి సంపాదన ఎంతంటే?

ఈ మ్యాచ్ కోసం నియమితులైన 102 మంది తాత్కాలిక కార్మికులకు రోజుకు 2,500 నుంచి 4,000 శ్రీలంక రూపాయలు ఇచ్చారు. మన భారత కరెన్సీ ప్రకారం లెక్కజిస్తే ఇది కేవలం రూ.727 ల నుంచి రూ.1,164 ల మధ్య మాత్రమే ఉంటుంది. లంక క్రికెట్ బోర్డు తమ వద్ద శాశ్వతంగా పనిచేసే మైదాన సిబ్బందికి కూడా నెల జీతాలు ఇవ్వకుండా రోజుకు రూ.2,000 లంక రూపాయలు (మన దేశ రూపాయిల్లో సుమారు రూ.580లు) మాత్రమే రోజువారీ భత్యంగా ఇస్తుండడం గమనార్హం.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
మ్యూజిక్ లవర్స్‌కు మతిపోగొట్టేస్తున్న బోల్ట్‌ ఇయర్‌‌బడ్స్‌..
మ్యూజిక్ లవర్స్‌కు మతిపోగొట్టేస్తున్న బోల్ట్‌ ఇయర్‌‌బడ్స్‌..
బంగారం ధరలపై బ్యాడ్ న్యూస్.. మళ్లీ పుంజుకున్నాయ్.. నేటి రేట్లు..
బంగారం ధరలపై బ్యాడ్ న్యూస్.. మళ్లీ పుంజుకున్నాయ్.. నేటి రేట్లు..
ఆనంద్ ఏ పాత్ర చేసినా సహజంగా ఒదిగిపోతాడు: సందీప్ రెడ్డి వంగా
ఆనంద్ ఏ పాత్ర చేసినా సహజంగా ఒదిగిపోతాడు: సందీప్ రెడ్డి వంగా
ఒక్క సీసీ కెమెరాతో ఇల్లంతా సెక్యూరిటీ పక్కా!
ఒక్క సీసీ కెమెరాతో ఇల్లంతా సెక్యూరిటీ పక్కా!
స్మార్ట్‌వాచ్​ ఫీచర్లతో ఇయర్‌‌బడ్స్​.. పూర్తి వివరాలు
స్మార్ట్‌వాచ్​ ఫీచర్లతో ఇయర్‌‌బడ్స్​.. పూర్తి వివరాలు
సెప్టెంబర్ 9 రాశిఫలాలు: ఆ రాశులకు ఆర్థికంగా లాభాలు..
సెప్టెంబర్ 9 రాశిఫలాలు: ఆ రాశులకు ఆర్థికంగా లాభాలు..
ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం
ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం
బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రాజకుమారి మరో సంచలన వీడియో
బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రాజకుమారి మరో సంచలన వీడియో
పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?
పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?
వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు..పట్టిందల్లా బంగారమే!
వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు..పట్టిందల్లా బంగారమే!