AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు అలర్ట్.. 7,437 పోలీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల లింక్ యాక్టివ్!

రాష్ట్రంలో తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు TGPRB తీపి కబురు చెప్పింది. బోర్డు ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, ఫైర్‌ ఫైటర్‌, జైలర్‌, వార్డర్‌ తదితర విభాగాల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు తాజాగా ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 9 వరకు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా అప్లై చేసుకోండి..

నిరుద్యోగులకు అలర్ట్..  7,437 పోలీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల లింక్ యాక్టివ్!
Telangana Police Recruitment Applications Open
Srilakshmi C
|

Updated on: Aug 21, 2026 | 1:31 PM

Share

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TGPRB) కీలక అప్‌డేట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తం 7,437 పోలీసు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 9, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ పోలీసు నియామక మండలి గత నెలలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి నాలుగు నోటిఫికేషన్లను విడుదల చేసింది. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (AR), స్పెషల్ పోలీస్, జైళ్లు, ఫైర్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

పోలీసు శాఖలో పోస్టులు

  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సివిల్‌) పోస్టుల సంఖ్య: 148
  • రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (AR) పోస్టుల సంఖ్య: 14
  • రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (TGSP) పోస్టుల సంఖ్య: 12
  • రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (SAR CPL) పోస్టుల సంఖ్య: 3
  • అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (FBP) పోస్టుల సంఖ్య: 23
  • పోలీస్‌ కానిస్టేబుల్‌ (సివిల్‌) పోస్టుల సంఖ్య: 3,697
  • పోలీస్‌ కానిస్టేబుల్‌ (AR) పోస్టుల సంఖ్య: 1052
  • పోలీస్‌ కానిస్టేబుల్‌ (SAR CPL) పోస్టుల సంఖ్య: 24
  • పోలీస్‌ కానిస్టేబుల్‌ (డ్రైవర్‌–PTO) పోస్టుల సంఖ్య: 20
  • పోలీస్‌ కానిస్టేబుల్‌ (మెకానిక్‌–PTO) పోస్టుల సంఖ్య: 7

స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (SPF)లో పోస్టులు

  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల సంఖ్య: 44
  • కానిస్టేబుల్‌ పోస్టుల సంఖ్య: 1380

ఫైర్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఎమర్జెన్సీ అండ్‌ సివిల్‌ డిఫెన్స్‌ విభాగం పోస్టులు

  • స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 39
  • ఫైర్‌ ఫైటర్‌ పోస్టుల సంఖ్య: 751

జైళ్ల శాఖలో పోస్టులు

  • డిప్యూటీ జైలర్‌ (పురుషులు) పోస్టుల సంఖ్య: 14
  • డిప్యూటీ జైలర్‌ (మహిళలు) పోస్టుల సంఖ్య: 1
  • వార్డర్‌ (పురుషులు) పోస్టుల సంఖ్య: 196
  • వార్డర్‌ (మహిళలు) పోస్టుల సంఖ్య: 12

ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆగస్టు 19 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబర్‌ 9, 2026లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయోపరిమితి, శారీరక ప్రమాణాలు, ఇతర అర్హతలను సంబంధిత నోటిఫికేషన్‌లో పరిశీలించుకోవల్సి ఉంటుంది. పోలీసు ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో రాత పరీక్షతో పాటు పోస్టును బట్టి శారీరక సామర్థ్య పరీక్ష (PET), శారీరక కొలతల పరీక్ష (PMT), తదితర దశలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు సంబంధిత పోస్టుకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను చదివి, ఎంపిక విధానం, సిలబస్‌, పరీక్ష విధానం తదితర వివరాలను తెలుసుకోవాలి. అలాగే పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, ఫీజు, పరీక్ష విధానం, శారీరక ప్రమాణాలు, దరఖాస్తు విధానం వంటి వివరాలు వేర్వేరుగా ఉండొచ్చు. అభ్యర్థులు TGPRB అధికారిక నోటిఫికేషన్లను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us