AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యూజిక్ వరల్డ్‌ను షేక్‌ చేసిన ఒకేఒక్క సాంగ్‌.. Youtubeలో ఏకంగా 600 కోట్ల వ్యూస్‌!

‘గంగ్నమ్‌ స్టైల్‌’.. ఈ పాట పేరు వినగానే మ్యూజిక్ లవర్స్‌కి పూనకాలు వచ్చేస్తాయి. గుర్రం స్వారీ చేస్తున్నట్లు ఉండే డ్యాన్స్‌ స్టెప్‌, ఆకట్టుకునే ట్యూన్‌ యావత్ ప్రపంచాన్ని అప్పట్లో ఉర్రూతలూగించింది. ఈ గ్లోబల్ సెన్సేషన్ సాంగ్‌ను దక్షిణ కొరియా పాప్‌ స్టార్‌ సింగర్‌ PSY (సై) 2012లో విడుదల చేయగా.. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జులై 15, 2012న విడుదలైన ఈ పాట మ్యూజిక్‌ వీడియో అప్పట్లో యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికి 14 ఏళ్లు పూర్తయినా దీని క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు..

మ్యూజిక్ వరల్డ్‌ను షేక్‌ చేసిన ఒకేఒక్క సాంగ్‌.. Youtubeలో ఏకంగా 600 కోట్ల వ్యూస్‌!
Gangnam Style Crosses Nearly 6 Billion Views
Srilakshmi C
|

Updated on: Aug 19, 2026 | 12:20 PM

Share

‘గంగ్నమ్‌ స్టైల్‌’.. ఈ పాట డ్యాన్స్ స్టెప్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. విచిత్రమైన కాన్సెప్ట్‌, ప్రత్యేకమైన డ్యాన్స్‌, క్యాచీ కోరస్‌తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘గంగ్నమ్‌ స్టైల్‌’ మ్యూజిక్‌కు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది అభిమానులు తమదైన శైలిలో డ్యాన్స్‌ వీడియోలు, టిక్‌టాక్‌లు చేశారు. అయితే తాజాగా ఈ సాంగ్‌ మ్యూజిక్ చరిత్రలో మరో రికార్డు బ్రేక్‌ చేసింది. యూట్యూబ్‌లో 1 బిలియన్‌ వ్యూస్‌ సాధించిన తొలి వీడియోగా ‘గంగ్నమ్‌ స్టైల్‌’ చరిత్ర సృష్టించింది. అంతేనా ప్రస్తుతం ఈ వీడియోకు ఏకంగా 6 బిలియన్‌ వ్యూస్‌ అంటే 600 కోట్ల వ్యూస్‌ చేరువలో ఉంది. దీంతో యూట్యూబ్‌ చరిత్రలో అత్యధికంగా వీక్షణలు వచ్చిన మ్యూజిక్‌ వీడియోల్లో ఒకటిగా రికార్డు బద్దలు కొట్టింది.

PSYకి ఎంత ఆదాయం వచ్చింది?

‘గంగ్నమ్‌ స్టైల్‌’కు ఇంత భారీ స్థాయిలో వ్యూస్‌ రావడంతో ఈ ఒక్క పాట ద్వారా PSYకి ఎంత ఆదాయం వచ్చిందనే దానిపై ప్రస్తుతం యావత్‌ ప్రపంచం చర్చించుకుంటోంది. ఈ వీడియో ద్వారా ఇప్పటివరకు వచ్చిన మొత్తం ఆదాయంపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికానప్పటికీ ఈ ఒక్క వైరల్ పాట ద్వారా సైకి ప్రకటనలు, ఇతర మార్గాల ద్వారా సుమారు రూ.470 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు అంచనా. అయితే 2013లో గూగుల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. అప్పటికి ‘గంగ్నమ్‌ స్టైల్‌’ వీడియోకు సుమారు 1.2 బిలియన్‌ వ్యూస్‌ ఉండగా, ప్రకటనల ద్వారా 8 మిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఈ వీడియో 6 బిలియన్‌ వ్యూస్‌ దాటిన నేపథ్యంలో సాధారణ మ్యూజిక్‌ వీడియోల యూట్యూబ్‌ RPM రేట్ల ఆధారంగా హక్కుదారులు ప్రకటనల ద్వారా కొన్ని కోట్ల డాలర్ల స్థాయిలో ఆదాయం ఆర్జించి ఉండొచ్చని Grok అంచనా వేసింది. 6.03 బిలియన్‌ వ్యూస్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ప్రతి వెయ్యి వ్యూస్‌కు సుమారు 1 నుంచి 3 డాలర్ల RPM ఉంటుంది. దీనితోపాటు ప్రకటనల ద్వారా, YouTube Content ID ద్వారా వచ్చే ఆదాయం కూడా కాస్త గట్టిగానే ముట్టుతుంది. మొత్తంగా గంగ్నమ్‌ స్టైల్‌ పాటకు ఆదాయం వందల కోట్లు ఉండొచ్చని అంచనా. అయితే ఇది అధికారిక ఆదాయ గణాంకం కాదని గుర్తుంచుకోవాలి. యూట్యూబ్‌ ప్రకటనల రేట్లు దేశం, ప్రేక్షకుల స్వభావం, ప్రకటనల డిమాండ్‌, వీడియోలో ప్రకటనల ప్రదర్శన వంటి అనేక అంశాలపై ఆధారపడి మారుతుందట.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్‌ ఆదాయంతోనే కాదు..

‘గంగ్నమ్‌ స్టైల్‌’ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని కేవలం యూట్యూబ్‌ ప్రకటనలకే పరిమితం చేయలేం. పాట డౌన్‌లోడ్లు, లైసెన్సింగ్‌, బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్లు, ఇతర వాణిజ్య ఒప్పందాల ద్వారా కూడా PSYకి ఆదాయం వచ్చి ఉండొచ్చు. Meta AI కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. యూట్యూబ్‌ ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలు బహిరంగంగా వెల్లడికాలేదని, ప్రకటనల రేట్లు గణనీయంగా మారుతుంటాయని తెలిపింది. ‘గంగ్నమ్‌ స్టైల్‌’ కేవలం ఒక వైరల్‌ పాటగా మాత్రమే నిలిచిపోలేదు. ఇంగ్లిష్‌ సాంగ్స్‌ మాత్రమేకాకుండా ఒక కొరియన్‌ పాట కూడా ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్‌ మ్యాజిక్‌ చేయగలదని ఇది నిరూపించింది. PSYను ఒక్కసారిగా ప్రపంచవ్యాప్త స్టార్‌గా మార్చిన ఈ పాట.. మ్యూజిక్‌ వరల్డ్‌పై కూడా గణనీయమైన ప్రభావం చూపింది. ఇప్పటికీ 14 ఏళ్లు గడిచినా ‘గంగ్నమ్‌ స్టైల్‌’కు అదే క్రేజ్‌ కొనసాగడం మెస్మరైజ్‌ చేస్తుంది.

Follow Us