AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లగొండ స్కూల్‌ ప్రిన్సిపల్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. చంపింది 10th క్లాస్ విద్యార్థులే!

నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. పోలీసులు చేపట్టిన విస్తృత దర్యాప్తులో పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ముగ్గురు నిందితులుగా గుర్తించినట్లు సమాచారం. రూ.4 లక్షల నగదు చోరీ కోసమే హత్యకు పాల్పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

నల్లగొండ స్కూల్‌ ప్రిన్సిపల్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. చంపింది 10th క్లాస్ విద్యార్థులే!
Nalgonda School Principal Murder Case
Srilakshmi C
|

Updated on: Aug 19, 2026 | 6:20 AM

Share

నల్లగొండ, ఆగస్ట్ 19: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె. రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ నెల 11న తన ఇంట్లోనే ఆమె దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ముగ్గురు నిందితులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. రూపారెడ్డి ఇంట్లో ఒంటిపై కత్తిపోట్లతో మృతదేహం కనిపించింది. హత్యకు పాల్పడిన సమయంలో నిందితులు గ్లౌజులు ధరించినట్లు పోలీసులు అనుమానించారు. దీంతో ఘటనా స్థలంలో పెద్దగా ఆధారాలు లభించకపోవడంతో కేసు దర్యాప్తు సవాలుగా మారింది. తొలుత సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. పాఠశాల సిబ్బంది, కుటుంబ సభ్యులు, కాలనీ వాసులతో పాటు పలువురిని విచారించారు. సుమారు 80 మందిని ప్రశ్నించిన అనంతరం పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ప్రత్యేక నిఘా విభాగం పోలీసులు కూడా రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన విద్యార్థులపై పోలీసులకు అనుమానం వచ్చినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

రూ.4 లక్షల నగదు చోరీ?

రూపారెడ్డి హత్య అనంతరం ఇంటి నుంచి సుమారు రూ.4 లక్షల నగదును నిందితులు చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు అసలు కారణం ఏమిటి? నగదు కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ముగ్గురు అనుమానితులను మంగళవారం ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం సాయంత్రంలోగా వెల్లడించే అవకాశం ఉందని పోలీసులు తెలిపినట్లు సమాచారం.

Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!