AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real Story: సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. వైద్య చరిత్రను తలకిందులు చేసిన మోరిస్‌ గుడ్‌మాన్‌ కథ!

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుదల, సంకల్ప బలం, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వివరించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రయత్నం చేసినప్పటికీ వెంటనే విజయం సాధించలేకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదని, నిజాయితీగా ప్రయత్నించే వ్యక్తికి ఏదో ఒక రోజు విజయం తప్పకుండా లభిస్తుందని చరిత్రలో ఎందరో నిరూపించారు..

Real Story: సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. వైద్య చరిత్రను తలకిందులు చేసిన మోరిస్‌ గుడ్‌మాన్‌ కథ!
Morris Goodman Inspirational Story
Srilakshmi C
|

Updated on: Aug 19, 2026 | 11:23 AM

Share

మాజీ రాష్ట్రపతి, ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం రచనల్లోని భావాలను ప్రస్తావిస్తూ.. మనిషి ముందుగా తాను చేరుకోవాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే వైఫల్యాలకు భయపడకూడదని చెప్పారు. చేరుకోవడానికి నక్షత్రాలు లేకపోవడం తప్పు కాదు. లక్ష్యంగా పెట్టుకున్న నక్షత్రాన్ని చేరుకోలేకపోవడం కూడా అంత పెద్ద తప్పు కాదు. కానీ చేరుకోవడానికి ఎలాంటి లక్ష్యం లేకపోవడమే అసలు తప్పు అనే భావనను విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు. కలెక్టర్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకుని మధ్యలో ప్రయత్నం మానేస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోలేమని, డాక్టర్‌ కావాలని నిర్ణయించుకున్న వ్యక్తి అందుకోసం నిరంతరం కష్టపడాల్సిందేనని చెప్పారు. లక్ష్యాన్ని పెట్టుకోవడం కంటే.. దాన్ని సాధించే వరకు శ్రమించే మానసిక దీక్ష ఉండటం ముఖ్యమని స్పష్టం చేశారు.

కాలమే అత్యంత విలువైనది

జీవితంలో మనిషికి లభించే అత్యంత విలువైన వనరు కాలమని పేర్కొన్నారు. డబ్బు, వస్తువుల విలువను లెక్కించగలిగినా కాలం విలువను లెక్కించడం సాధ్యం కాదన్నారు. ఒక పని చేయడం గొప్ప విషయం కాదని.. చేయాల్సిన పనిని సరైన సమయంలో చేయడమే గొప్పతనమని తెలిపారు. విద్యార్థి దశలో లభించే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించవచ్చని చెప్పారు. చదువుకునే అవకాశం కోట్లాది మందిలో కొద్దిమందికే లభిస్తుందని, అలాంటి అవకాశం వచ్చినప్పుడు విద్యార్థులు దాన్ని భారంగా కాకుండా సంతోషంగా స్వీకరించాలని సూచించారు. ఒకసారి చదివితే అర్థం కాకపోతే రెండుసార్లు చదవాలని, రెండుసార్లు చదివినా రాకపోతే మూడుసార్లు, అవసరమైతే పదిసార్లు చదవాలని చెప్పారు. బద్ధకం కారణంగా చదవడం మానేయడం ద్వారా కాలాన్ని వృథా చేసుకుంటే జీవితంలో శాశ్వతమైన విజయాన్ని సాధించడం కష్టమవుతుందని హెచ్చరించారు.

మోరిస్‌ గుడ్‌మాన్‌ సంకల్పబలం

సంకల్ప బలానికి ఉదాహరణగా మోరిస్‌ గుడ్‌మాన్‌ జీవితంలో జరిగిన ఘటనను ప్రస్తావించారు. 1981లో విమానం ప్రమాదానికి గురైన ఘటనలో గుడ్‌మాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన వెన్నుపాము దెబ్బతినడంతో శరీరంలోని చాలా భాగాన్ని కదిలించలేని పరిస్థితి ఏర్పడింది. వైద్యులు ఆయన ఇక కనురెప్పలు ఎత్తడం, వేయడం తప్ప మరేమీ చేయలేరని భావించారు. స్వయంగా శ్వాస తీసుకోవడం కూడా సాధ్యం కాకపోవడంతో కృత్రిమ శ్వాస అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గుడ్‌మాన్‌ మాత్రం తన పరిస్థితిని అంగీకరించలేదు. ‘ఒక ఏడాదిలో నేను ఆరోగ్యంగా మారి నడుచుకుంటూ ఇంటికి వెళ్తాను’ అని తనలో తాను గట్టి సంకల్పం చేసుకున్నారు. ఆ లక్ష్యంతో నిరంతరం సాధన చేశారు. కొన్ని వారాల తర్వాత కృత్రిమ శ్వాస సహాయం లేకుండానే స్వయంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించారు. అనంతరం ఆహారం తీసుకోవడం, శారీరకంగా కోలుకోవడం మొదలైంది. చివరకు తాను నిర్ణయించుకున్న గడువులోనే ఆస్పత్రి నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్లినట్లు ఈ ఉదాహరణ ద్వారా వివరించారు.

ఇవి కూడా చదవండి

ముందుగా మనసును గెలవాలి

సంకల్ప బలానికి రామాయణంలోని హనుమంతుడి ఉదాహరణను కూడా ప్రస్తావించారు. లంకకు వెళ్లేందుకు వంద యోజనాల సముద్రాన్ని దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలామంది వానరులు వెనుకడుగు వేశారు. అయితే హనుమంతుడు తన మానసిక బలాన్ని కూడగట్టుకుని సముద్రాన్ని దాటాలని నిర్ణయించుకున్నారు. ఏదైనా కార్యాన్ని సాధించాలంటే ముందుగా మనసులో ఆ కార్యాన్ని సాధించగలననే నమ్మకం ఏర్పడాలని చెప్పారు. మనసే బలహీనపడితే మనిషి చేతుల్లో ఉన్న అవకాశాలు కూడా ఫలించవని వివరించారు. మనిషి ఏదైనా సాధించాలంటే ముందుగా తనపై తనకు నమ్మకం ఉండాలని సూచించారు. “నేను చేయగలను” అనే ఆత్మవిశ్వాసం లేకుండా ఏ లక్ష్యాన్నీ చేరుకోలేమన్నారు. లక్ష్యాన్ని పెట్టుకోవడం మాత్రమే గొప్ప విషయం కాదని.. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు దృఢమైన దీక్షతో, నిరంతర శ్రమతో ముందుకు సాగడమే నిజమైన విజయం అని విద్యార్థులకు సందేశమిచ్చారు. విద్యార్థి దశలో సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని, వైఫల్యాలు ఎదురైనా వెనుకడుగు వేయకూడదని సూచించారు. లక్ష్యం స్పష్టంగా ఉండి, సంకల్పం దృఢంగా ఉంటే ఎంతటి కష్టమైన పరిస్థితినైనా అధిగమించి విజయం సాధించవచ్చని ఈ సందేశం ద్వారా వివరించారు.

Follow Us
సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి
సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..
2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..