AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tilak Varma: హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. ముంబై తరపున ఆడుతూ పంజాబీ అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్.. వీడియో

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తన ఆటతోనే కాదు తన ప్రవర్తనతోనూ అందరి మనసులు గెల్చుకున్నాడు తిలక్. ఈ సందర్భంగా పంజాబ్ కింగ్స్ జట్టుకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన ముగ్గురు అమ్మాయిలకు ఊహించని బహిమతులు ఇచ్చి వారి ముఖాల్లో వెలకట్టలేని ఆనందాన్ని నింపాడు

Tilak Varma: హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. ముంబై తరపున ఆడుతూ పంజాబీ అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్.. వీడియో
Tilak Varma
Basha Shek
|

Updated on: Apr 19, 2024 | 5:22 PM

Share

ఐపీఎల్‌-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా కీలక పాత్ర పోషించాడు. క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించిన తిలక్.. కేవలం 18 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స‌ర్లు బాది 34 ప‌రుగుతో నాటౌట్ గా నిలిచాడు. తద్వారా ముంబై భారీ స్కోరు సాధించ‌డంలో త‌న వంతు సాయం చేశాడు. అయితే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తన ఆటతోనే కాదు తన ప్రవర్తనతోనూ అందరి మనసులు గెల్చుకున్నాడు తిలక్. ఈ సందర్భంగా పంజాబ్ కింగ్స్ జట్టుకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన ముగ్గురు అమ్మాయిలకు ఊహించని బహిమతులు ఇచ్చి వారి ముఖాల్లో వెలకట్టలేని ఆనందాన్ని నింపాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ కు వెళుతున్న తిలక్ వర్మకు స్టేడియంలో ముగ్గురు అమ్మాయిలు కనిపించారు. స్టేడియం నుంచి అందరూ వెళ్లిపోయినా ఆ ముగ్గురు అమ్మాయిలు మాత్రమే అక్కడే ఉండడం గమనించాడు వర్మ. దీంతో వెంటనే తన బ్యాటింగ్ గ్లోవ్స్ ను పై నుంచే వారి వైపునకు విసిరాడు.

తిలక్ ఇచ్చిన గ్లోవ్స్ ను క్యాచ్ పట్టుకున్న అమ్మాయిలు అతనికి థ్యాంక్స్ చెప్పారు. అనంతరం చిరునవ్వులు చిందిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ముంబై ఇండియ‌న్స్ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ’18 బంతుల్లో 38 పరుగులు చేయడంతో పాటు.. ఓ కీలకమైన క్యాచ్‌ అందుకున్నాడు. అలాగే ఇద్దరు వర్ధమాన క్రికెటర్లు తమ కలలను నిజం చేసుకునేందుకు ఓ కారణాన్ని కూడా చూపించాడు. తిలక్‌ వర్మ హ్యాట్సాఫ్‌’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తిలక్ వర్మ మంచి మనసుకు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రాబోయే మ్యాచుల్లోనూ అతనూ మరిన్ని మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

అమ్మాయిలకు గ్లోవ్స్ ఇస్తోన్న తిలక్ వర్మ.. వీడియో ఇదిగో..

పంజాబ్ పై విజయం అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో ముంబై ప్లేయర్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..