AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: శ్రుతిమించిన సెలబ్రేషన్స్.. కేకేఆర్ స్టార్ బౌలర్‌కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు..

Kolkata Knight Riders vs Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం (ఏప్రిల్ 29) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ కేకేఆర్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో కోల్ కతా ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇలా ఫుల్ జోష్ లో ఉన్న కేకేఆర్ కు భారీ షాక్ తగిలింది.

IPL 2024: శ్రుతిమించిన సెలబ్రేషన్స్.. కేకేఆర్ స్టార్ బౌలర్‌కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు..
Harshit Rana
Basha Shek
|

Updated on: Apr 30, 2024 | 7:33 PM

Share

Kolkata Knight Riders vs Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం (ఏప్రిల్ 29) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ కేకేఆర్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో కోల్ కతా ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇలా ఫుల్ జోష్ లో ఉన్న కేకేఆర్ కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కేకేఆర్ స్టార్ బౌలర్ హర్షిత్ రాణాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. అలాగే 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ రాణా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. ఆ జట్టు బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు రాణాపై కఠిన చర్యలు తీసుకున్నారు. అభిషేక్‌ ఔటైన తర్వాత రాణా శృతిమించిన సంబురాలు (అభిషేక్‌ను డగౌట్‌ వైపు వెళ్లాలని కోపంగా ఆదేశించాడు) చేసుకుని తగిన మూల్యం చెల్లించుకున్నాడు.దీనికి సంబంధించి హర్షిత్ మ్యాచ్ రిఫరీ ముందు హాజరయ్యాడు. తన తప్పును అంగీకరించాడు. దీంతో అతనికి భారీ జరిమానాతో పాటు శిక్ష తప్పలేదు. హర్షిత్ రాణా ఒక మ్యాచ్ సస్పెండ్ కావడమే కాకుండా మ్యాచ్ ఫీజును కూడా కోల్పోయాడు. హర్షిత్ రాణా 100 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు. అంటే, అతను ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ కోసం IPL ఫీజును పొందలేడు

హర్షిత్ రాణా ఇలా చేయడం రెండోసారి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ లో మయాంక్ ఆగర్వాల్ ను ఔట్ చేసిన అనంతరం ఫ్లయింగ్ కిస్ లు ఇస్తూ అతనిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇందుకు ప్రతిఫలంగా అతని మ్యాచ్ ఫీజులో 60 శాతం తగ్గించి వార్నింగ్ ఇచ్చి వదిలి పెట్టారు. కానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లోనూ మళ్లీ ఇదే తప్పు ను పునరావృతం చేశాడు హర్షిత్ రాణా. దీంతో ఈసారి కేకేఆర్ బౌలర్ కు భారీ జరిమానాతో పాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించారు. ఈ సీజన్‌లో హర్షిత్ రానా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశాడు. అయితే శ్రుతి మించిన సెలబ్రేషన్స్ అతని పాలిట శాపంగా మారాయి.

ఇవి కూడా చదవండి

హర్షిత్ రాణా సెలబ్రేషన్స్ వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా