IPL 2024: ఢిల్లీకీ ధమ్కీ ఇవ్వలేదు.. ఐపీఎల్ ఆడకపోవడానికి అసలు విషయం చెప్పేసిన స్టార్ ప్లేయర్
IPL 2024 సీజన్ ప్రారంభానికి ముందే కొంతమంది ఆటగాళ్లు తమ ఫ్రాంఛైజీలకు షాక్ లు ఇస్తున్నారు. వివిధ కారణాలతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. కొందరు గాయం కారణంగా తప్పుకుంటే మరికొందరు వ్యక్తిగత కారణాలతో ధనాధాన్ లీగ్ ఆడలేమంటున్నారు. ఈ క్రమంలో టోర్నీ ప్రారంభానికి తొమ్మిది రోజుల ముందు తన పేరును ఉపసంహరించుకున్న ఆటగాళ్లలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా చేరాడు.

IPL 2024 సీజన్ ప్రారంభానికి ముందే కొంతమంది ఆటగాళ్లు తమ ఫ్రాంఛైజీలకు షాక్ లు ఇస్తున్నారు. వివిధ కారణాలతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. కొందరు గాయం కారణంగా తప్పుకుంటే మరికొందరు వ్యక్తిగత కారణాలతో ధనాధాన్ లీగ్ ఆడలేమంటున్నారు. ఈ క్రమంలో టోర్నీ ప్రారంభానికి తొమ్మిది రోజుల ముందు తన పేరును ఉపసంహరించుకున్న ఆటగాళ్లలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా చేరాడు. బ్రూక్ ఐపీఎల్ నుండి వైదొలుగుతున్నట్లు బుధవారం (మార్చి 13) నుంచి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగింది. వీటిపై స్పందించిన బ్రూక్ స్వయంగా సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశాడు. తన అమ్మమ్మ మరణం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు అందులో చెప్పుకొచ్చాడు. 25 ఏళ్ల బ్రూక్ తన అమ్మమ్మ చిత్రాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ‘ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడేందుకు నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. అయితే వ్యక్తిగత కారణాలతో నా పేరును వెనక్కి తీసుకోవలసి వచ్చింది. దీనిపై నేను ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే క్రికెట్ అభిమానులతో మాత్రమే పంచుకోవాలనుకుంటున్నాను. ‘నేను ఎక్కువగా మా అమ్మమ్మ దగ్గరే పెరిగాను. క్రికెట్ పై నాకు ఆసక్తి పెరగడానికి ఆమె కారణం. నా జీవితంలో అమ్మమ్మ లేని లోటు పూడ్చలేనిది. కొన్ని రోజుల క్రితమే ఆమె కన్నుమూసింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను మనసు పెట్టి ఆడలేను. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నా’ అని రాసుకొచ్చాడు.
జనవరిలో టెస్ట్ సిరీస్ కోసం భారత్‌కు వచ్చే ముందు బ్రూక్ తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఆ సమయంలో తన అమ్మమ్మ అనారోగ్యంతో ఉందని, ఆమె ఎక్కువ కాలం జీవించదని తనకు మొదటిసారి తెలిసిందని బ్రూక్ చెప్పాడు. అలాంటి పరిస్థితిలో, అతను తన అమ్మమ్మతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని అనుకున్నాడు. ఇప్పుడు ఆమె మరణంతో కుటుంబం శోకసంద్రంలో ఉంది మరియు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతను కుటుంబంతో ఉండాలనుకుంటున్నాడు.
— Harry Brook (@Harry_Brook_88) March 13, 2024
4 కోట్లు వెచ్చించి..
గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఇంగ్లండ్ యువ బ్యాటర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. బ్రూక్ కోసం ఢిల్లీ రూ.4 కోట్లు వెచ్చించింది. హ్యారీ బ్రూక్ తన బలమైన ప్రదర్శనతో ఢిల్లీని విజయపథంలో నడిపిస్తాడని అంతా భావించారు. అంతేకాదు తన మొదటి సీజన్ వైఫల్యాన్ని కూడా అధిగమిస్తాడనుకున్నారు. బ్రూక్ గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. అయితే ఒక సెంచరీ మినహా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో సన్ రైజర్స్ అతనిని వదిలిపెట్టింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




