RR vs MI , IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. తుది జట్లలో భారీ మార్పులు

ajasthan Royals vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 22) రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబయి, రాజస్థాన్‌ జట్లకు టోర్నీలో ఇది ఎనిమిదో మ్యాచ్‌.

RR vs MI , IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. తుది జట్లలో భారీ మార్పులు
RR vs MI , IPL 2024
Follow us
Basha Shek

|

Updated on: Apr 23, 2024 | 12:06 AM

Rajasthan Royals vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 22) రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబయి, రాజస్థాన్‌ జట్లకు టోర్నీలో ఇది ఎనిమిదో మ్యాచ్‌. రాజస్థాన్ 7 మ్యాచ్‌ల్లో 6 గెలిచింది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 4 ఓడింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు 7వ స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడడం ఇది రెండోసారి. అంతకుముందు ఏప్రిల్ 1న ముంబై, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అప్పట్లో ముంబైపై రాజస్థాన్ విజయం సాధించింది. కాబట్టి ఇప్పుడు రాజస్థాన్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై ప్రయత్నిస్తోంది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఇరు జట్లు మొత్తం 29 సార్లు తలపడ్డాయి. ఈ 29 మ్యాచ్‌ల్లో అత్యధికంగా ముంబైదే ఆధిపత్యం. ముంబై 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాజస్థాన్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి రాజస్థాన్ మొదట బ్యాటింగ్  కు దిగనుంది.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI:

సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ మరియు యుజ్వేంద్ర చాహల్.

 ఇంపాక్ట్ ప్లేయర్లు :

జోస్ బట్లర్, కేశవ్ మహారాజ్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, టామ్ కోహ్లర్-కాడ్మోర్

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్:

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వాద్రా, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా మరియు జస్ప్రీత్ బుమ్రా.

 ఇంపాక్ట్ ప్లేయర్లు :

నువాన్ తుషార, ఆకాష్ మధ్వల్, నమన్ ధీర్, షామ్స్ ములానీ, డెవాల్డ్ బ్రీవిస్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..